నా కెరీర్లోనే బెస్ట్ పోస్టర్ ఇది.. కల్ట్ పోస్టర్.. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది: సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్

స్పిరిట్ మూవీ పోస్టర్ పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ది రాజా సాబ్ మూవీ కోసం సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూలో స్పిరిట్ మూవీ గురించి ప్రభాస్ తోపాటు ముద్దురు ముద్దుగుమ్మలు మాట్లాడారు. ముఖ్యంగా లేటెస్ట్ పోస్టర్ పై ప్రశంసలు కురిపించారు.

Published on: Jan 8, 2026, 15:47:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ది రాజా సాబ్ ఇంటర్వ్యూలో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలిసి స్పిరిట్ మూవీ గురించి మాట్లాడటం విశేషం. సందీప్ వద్దని వారిస్తున్నా.. ప్రభాస్ మాత్రం రాజా సాబ్ మూవీలోని ముగ్గురు ముద్దుగుమ్మలను రెచ్చగొట్టి మరీ స్పిరిట్ మూవీ గురించి ప్రశ్నలు అడిగించాడు. ఆ ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అవుతోంది.

నా కెరీర్లోనే బెస్ట్ పోస్టర్ ఇది.. కల్ట్ పోస్టర్.. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది: సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్
నా కెరీర్లోనే బెస్ట్ పోస్టర్ ఇది.. కల్ట్ పోస్టర్.. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది: సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్

సందీప్ వద్దంటున్నా ప్రభాస్ వినకుండా..

ది రాజా సాబ్ మూవీ శుక్రవారం (జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రానుండగా.. గురువారం మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రాజా సాబ్ మూవీలో నటించిన ప్రభాస్, ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళివిక మోహనన్, రిద్ధి కుమార్ లతో మాట్లాడాడు. మధ్యలో స్పిరిట్ మూవీ గురించి చర్చ వచ్చింది.

దాని గురించి తర్వాత ముందు ది రాజా సాబ్ గురించి మాట్లాడదామని సందీప్ అంటున్నా.. ప్రభాస్ మాత్రం తన హీరోయిన్లను రెచ్చగొట్టి స్పిరిట్ మూవీపై ప్రశ్నలు అడిగించాడు. ముఖ్యంగా వాళ్ల టాపిక్ మొత్తం ఈ మధ్యే వచ్చిన స్పిరిట్ పోస్టర్ చుట్టూ తిరిగింది.

స్పిరిట్ పోస్టర్.. నా కెరీర్లోనే బెస్ట్

ఈ పోస్టర్ లో ప్రభాస్ ఒంటి నిండా గాయాలు, కట్లతో కనిపిస్తూ చేతిలో ఓ మందు బాటిల్ పట్టుకొని ఉంటాడు. అతనికి ఓ అమ్మాయి సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తుంది. ఈ పోస్టర్ అద్భుతంగా ఉందని మాళవిక, రిద్ధి, నిధి అన్నారు. చాలా యూనిక్ గా అనిపించిందని వాళ్లు చెప్పారు. నిజానికి ప్రభాస్ చేతిలో ఉన్నది గ్లాస్ అనుకున్నారని అనడంతో అది లీటర్ బాటిల్ అని సందీప్ క్లారిటీ ఇచ్చాడు.

అప్పుడే ప్రభాస్ స్పందిస్తూ.. “నా కెరీర్లోనే బెస్ట్ పోస్టర్ ఇది.. కల్ట్ పోస్టర్.. అసలు ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది” అని సందీప్ ను అడిగాడు. దీని గురించి సందీప్ పెద్దగా చెప్పలేదు. అయితే బాహుబలిలాంటి మూవీ తర్వాత ప్రభాస్ ను ఎలా ప్రజెంట్ చేయాలన్న ఆలోచన నుంచే ఆ పోస్టర్ వచ్చిందని మాత్రం వెల్లడించాడు.

ఇప్పటికే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ప్రభాస్ తో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడు. అయితే ఇప్పటి వరకూ ప్రభాస్ ను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతుండటమే ఎంతో ఆసక్తి రేపుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More