ది రాజా సాబ్ బడ్జెట్ ఎంతో లీక్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. చాలా చాలా ఎక్కువే.. ఆర్ఆర్ఆర్‌కు సమంగా..

ది రాజా సాబ్ బడ్జెట్ ఎంతో రివీల్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ మూవీలోని లీడ్ రోల్స్ ప్రభాస్, ముగ్గురు హీరోయిన్లను ఇంటర్వ్యూ చేయగా.. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ బుధవారం (జనవరి 7) రిలీజ్ చేశారు.

Published on: Jan 7, 2026, 20:35:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డార్లింగ్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న హారర్ కామెడీ 'ది రాజా సాబ్' (The Raja Saab) చిన్న సినిమా అనుకుంటే పొరపాటే. ఈ సినిమా బడ్జెట్ ఎంతో 'స్పిరిట్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనుకోకుండా బయటపెట్టేశాడు. ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అతని నోట వచ్చిన ఆ నెంబర్ వింటే షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 400 కోట్లు అట. ఇది రాజమౌళి 'ఆర్ఆర్ఆర్', మురుగదాస్ 'సికందర్' సినిమాల బడ్జెట్‌తో సమానం.

ది రాజా సాబ్ బడ్జెట్ ఎంతో లీక్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. చాలా చాలా ఎక్కువే.. ఆర్ఆర్ఆర్‌కు సమంగా..
ది రాజా సాబ్ బడ్జెట్ ఎంతో లీక్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. చాలా చాలా ఎక్కువే.. ఆర్ఆర్ఆర్‌కు సమంగా..

ప్రభాస్‌ను ఆటపట్టిస్తూ.. అసలు విషయం చెప్పేసి..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్ సినిమా బడ్జెట్ వివరాలను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గోప్యంగా ఉంచినప్పటికీ.. సందీప్ రెడ్డి వంగా మాత్రం లీక్ చేసేశాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్, ముగ్గురు హీరోయిన్లు (మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్), సందీప్ రెడ్డి వంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపడింది. దీనికి సంబంధించిన ప్రోమోను ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేశారు.

ప్రభాస్ ఈ సినిమాను చాలా త్వరగా పూర్తి చేస్తానని చెప్పాడట. దీనిపై సందీప్ సెటైర్ వేస్తూ.. "భారీ సెట్టింగులు, ముగ్గురు హీరోయిన్లు, పాటలు, ఒక బామ్మ క్యారెక్టర్.. పైగా రూ. 400 కోట్ల బడ్జెట్. ఇవన్నీ పెట్టుకుని కేవలం 40 రోజుల్లో సినిమా ఫినిష్ చేస్తానని ప్రభాస్ అన్నాడు" అని నవ్వుతూ అసలు బడ్జెట్ ఎంతో చెప్పేశాడు.

నిర్మాత మాట.. క్లైమాక్స్ వేట

ముంబైలో జరిగిన ఈవెంట్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ బడ్జెట్ గురించి నేరుగా చెప్పకపోయినా, పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. "బడ్జెట్ ఫిగర్ చెప్పను కానీ.. అందులో చాలా సున్నాలు ఉంటాయి" అని నవ్వేశాడు.

ఈ సినిమా క్లైమాక్స్ కోసమే దాదాపు 120 రోజులు షూటింగ్ చేశారట. తెరపై 40 నిమిషాల పాటు సాగే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ విజువల్ వండర్‌లా ఉంటుందని నిర్మాత హైప్ ఇచ్చాడు.

టికెట్ రేట్ల పెంపు

ది రాజా సాబ్ మూవీ జనవరి 9న సినిమా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి లభించింది. జనవరి 8న వేసే ప్రీమియర్ షోల టికెట్ ధర రూ. 1000గా నిర్ణయించారు. ఇక మొదటి 10 రోజుల పాటు రోజుకు ఐదు షోలు, టికెట్ల ధర పెంచుకోవడానికీ అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లలో ఒక్కో టికెట్ కు రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.200 పెంచారు. దీంతో ఈ టికెట్ల ధరలు వరుసగా రూ.297, రూ.377కి చేరాయి. ఈ భారీ పెంపుతో ది రాజా సాబ్ కు గ్రాండ్ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More