...
...
Next Story

స్పిరిట్ రిలీజ్ డేట్ ఇదే.. వెనక్కి తిరిగి చూసేదే లేదంటూ మేకర్స్ పోస్ట్.. వచ్చే ఏడాది వస్తున్న ప్రభాస్, సందీప్ మూవీ

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది అతడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ది రాజా సాబ్ రూపంలో పెద్ద పరాజయమే ఎదురు కాగా.. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీపై రెబల్ స్టార్ దృష్టి సారించాడు.

Published on: Jan 16, 2026, 18:57:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ స్పిరిట్. ఈ మధ్యే మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. ఇప్పుడు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

స్పిరిట్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

స్పిరిట్ రిలీజ్ డేట్ ఇదే.. వెనక్కి తిరిగి చూసేదే లేదంటూ మేకర్స్ పోస్ట్.. వచ్చే ఏడాది వస్తున్న ప్రభాస్, సందీప్ మూవీ
స్పిరిట్ రిలీజ్ డేట్ ఇదే.. వెనక్కి తిరిగి చూసేదే లేదంటూ మేకర్స్ పోస్ట్.. వచ్చే ఏడాది వస్తున్న ప్రభాస్, సందీప్ మూవీ

ప్రభాస్, తృప్తి డిమ్రి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా స్పిరిట్. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి ఆల్ఫా మేల్ డామినేటింగ్ సినిమాలు తీసిన సందీప్ రెడ్డి వంగాకు రెబల్ స్టార్ ఛాన్స్ ఇవ్వడంతో ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. ఇప్పుడీ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. “వెనక్కి తిరిగి చూసేదే లేదు. స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలో ప్రపంచాన్ని చూడబోతోంది” అనే క్యాప్షన్ తో మూవీ టీమ్ ట్వీట్ చేసింది.

స్పిరిట్ మూవీ విశేషాలు

స్పిరిట్ మూవీ నుంచి మొదట కేవలం ఆడియో టీజర్ రిలీజ్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ ఏడాది జనవరి 1న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. అందులో ప్రభాస్ గాయాలు, కట్లతోపాటు చేతిలో ఓ మందు బాటిల్ తో కనిపించగా.. తృప్తి అతని సిగరెట్ వెలిగిస్తూ కనిపించింది. ఈ పోస్టర్ తన కెరీర్లోనే బెస్ట్ అని ప్రభాస్ ఇప్పటికే చెప్పాడు.

తాజాగా వచ్చిన ది రాజా సాబ్ దారుణంగా బోల్తా పడటంతో స్పిరిట్ మూవీపై ప్రభాస్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇందులో ప్రభాస్ ను సందీప్ ఎలా చూపించబోతున్నాడో అన్న ఆసక్తి అతని అభిమానుల్లో ఉంది. హారర్ కామెడీ జానర్ తో కాస్త భిన్నంగా ప్రయత్నించబోయి ప్రభాస్ బుక్కయ్యాడు. ఈ నేపథ్యంలో స్పిరిట్ ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి నెలకొంది.

కొత్తగా ప్రభాస్

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks