అప్పుడే మొదలైన ది రాజా సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్.. భారీ రన్ టైమ్‌తో వస్తున్న ప్రభాస్ మూవీ

ప్రభాస్ ది రాజా సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే మొదలయ్యాయి. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 9న మూవీ రిలీజ్ కానుంది. అయితే అమెరికాలో నెల రోజులకుపైగా ముందుగానే బుకింగ్స్ ప్రారంభించడం విశేషం.

Published on: Dec 2, 2025, 15:08:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ సంక్రాంతి బరిలో నిలుస్తోంది. జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమాకు అమెరికాలో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

అప్పుడే మొదలైన ది రాజా సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్.. భారీ రన్ టైమ్‌తో వస్తున్న ప్రభాస్ మూవీ
అప్పుడే మొదలైన ది రాజా సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్.. భారీ రన్ టైమ్‌తో వస్తున్న ప్రభాస్ మూవీ

ది రాజా సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్

ప్రభాస్ ది రాజా సాబ్ సందడి అప్పుడే మొదలైంది. నిజానికి అమెరికాలోనూ డిసెంబర్ 4 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సినీమార్క్ థియేటర్స్ మాత్రం రెండు రోజుల ముందుగానే ఈ బుకింగ్స్ మొదలుపెట్టడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఈసారి సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, దళపతి విజయ్ జన నాయగన్ లాంటి సినిమాలతో ది రాజా సాబ్ పోటీ పడనుంది. ఇండియాలో ఇప్పటి వరకూ చూడనటువంటి హారర్ అంటూ మేకర్స్ ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ది రాజా సాబ్ రన్‌టైమ్

ఇక ది రాజా సాబ్ మూవీ రన్ టైమ్ కూడా ఆసక్తి రేపుతోంది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో అక్కడి బుకింగ్ పోర్టల్ ఈ మూవీ రన్ టైమ్ రివీల్ చేసింది. దాని ప్రకారం 3 గంటల 15 నిమిషాలు కావడం విశేషం. అయితే ఇది ఫైనల్ కాదు. సెన్సార్ తర్వాత మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేస్తారు. అది కూడా ఇంచుమించు దీనికి దగ్గరగానే ఉంటుంది. ఆ లెక్కన మరో సినిమా భారీ రన్ టైమ్‌తో రాబోతోంది.

డార్లింగ్ ప్రభాస్ ను మరోసారి వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ తో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ఈ నేపథ్యంలో ఈ భారీ రన్ టైమ్ కూడా ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ ఓ కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. అతనితోపాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సుముద్రఖని లాంటి వాళ్లు నటించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More