...
...
Next Story

Prabhas The Raja Saab: సంక్రాంతికి రిలీజ్ చేసినందుకే రాజా సాబ్ ఫ్లాప్ అయిందట.. నిర్మాత కామెంట్స్ వైరల్

Prabhas The Raja Saab: ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ ఫెయిల్యూర్ గురించి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి సీజన్ లో మూవీ రిలీజ్ చేయడమే దానికి అతిపెద్ద కారణమని అన్నారు.

Published on: Oct 13, 2026, 21:30:13 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Prabhas The Raja Saab: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ది రాజా సాబ్' (The Raja Saab) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 208 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Prabhas The Raja Saab: సంక్రాంతికి రిలీజ్ చేసినందుకే రాజా సాబ్ ఫ్లాప్ అయిందట.. నిర్మాత కామెంట్స్ వైరల్
Prabhas The Raja Saab: సంక్రాంతికి రిలీజ్ చేసినందుకే రాజా సాబ్ ఫ్లాప్ అయిందట.. నిర్మాత కామెంట్స్ వైరల్

తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) హైదరాబాద్‌లో జరిగిన 'గరివిడి లక్ష్మి' ప్రమోషన్స్ సందర్భంగా మీడియా సమావేశంలో రాజాసాబ్ ఫలితంపై తొలిసారిగా ఓపెన్‌గా మాట్లాడారు. సినిమా డిజాస్టర్ కావడానికి ప్రధాన కారణాలు ఇవేనంటూ ఆయన కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.

సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ చేయడమే పెద్ద తప్పు

ప్రభాస్ రాజాసాబ్ ఫ్లాప్ గురించి ప్రస్తావించగా నిర్మాత విశ్వప్రసాద్ చాలా కూల్‌గా స్పందించారు. "మేము ఇప్పుడు చాలా మంచి మూడ్‌లో ఉన్నాం. రాజాసాబ్ గురించి మాట్లాడితే నా మూడ్ ఏమీ పోదు. మేము చేసిన ప్రాథమిక తప్పుల్లో అసలు సిసలైనది ఆ సినిమాను సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయడమే. ఒకవేళ వేరే టైమ్‌లో రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా కేవలం రిలీజ్ డేట్ మాత్రమే కాకుండా, ఆ సమయంలో తలెత్తిన ఇతర కారణాలు కూడా సినిమా రిజల్ట్‌ను దెబ్బతీశాయని ఆయన అంగీకరించారు. సినిమా విడుదల రోజున ప్రీమియర్లు ఆలస్యం కావడం, అదే సమయంలో టికెట్ ధరలను పెంచడానికి ప్రయత్నించడం ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తిని నింపిందని తెలిపారు.

ప్రభాస్ ఫ్యాన్స్‌ను రాజాసాబ్ నిరాశపరిచిందని, త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న 'స్పిరిట్' (Spirit) సినిమాతో ఆ లోటును భర్తీ చేస్తారా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. తాను కేవలం ఆ సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా మాత్రమే వ్యవహరిస్తున్నానని విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. 2027లో విడుదల కానున్న ఈ భారీ యాక్షన్ చిత్రానికి సంబంధించి తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తమ వద్దే ఉన్నాయని తెలిపారు.

భారీ హంగులతో, సరికొత్త కథతో రాబోతున్న 'స్పిరిట్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, ప్రభాస్-సందీప్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి సెంటిమెంట్ బెడిసికొట్టి రాజాసాబ్ నిరాశపరిచినా, రాబోయే ప్రాజెక్ట్‌లతో ఆడియన్స్‌ను అలరిస్తామని మేకర్స్ భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks