ది రాజా సాబ్ ట్రైలర్ 2.0ను మేకర్స్ సోమవారం (డిసెంబర్ 29) రిలీజ్ చేశారు. ప్రభాస్ ను డిఫరెంట్ లుక్స్ లో చూపిస్తూ సాగింది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించబోతున్న సునామీకి ఈ ట్రైలర్ మరింత దోహదం చేయనుంది.
ది రాజా సాబ్ ట్రైలర్ 2.0

ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “ది రాజా సాబ్ ట్రైలర్ 2.0.. మీరు ఊహించిన దాని కంటే ఎక్కువే. పర్ఫార్మెన్సెస్, విజువల్స్, మ్యూజిక్.. అన్నీ కలిసి ఓ అద్భుతమైన అనుభవాన్ని ఈ సంక్రాంతికి అందించనుంది. జనవరి 9, 2026న థియేటర్లలో..” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ ను ట్వీట్ చేసింది.
గతంలో వచ్చిన ట్రైలర్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ ట్రైలర్ మరింత గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే బీజీఎం, అన్నింటికీ మించి ప్రభాస్ వైలెంట్ లుక్స్ తో మూవీపై మరింత అంచనాలు పెంచేసింది.
ది రాజా సాబ్ ప్రీ సేల్స్
ఇక ది రాజా సాబ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదరగొడుతున్నాయి. రిలీజ్ కు పది రోజుల ముందే రూ.2 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విడుదలకు ఇంకా 10 రోజులు ఉండగానే ప్రీ-సేల్స్ కలెక్షన్స్ అదిరిపోయాయి.
'సలార్', 'కల్కి 2898 AD' వంటి బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ది రాజా సాబ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఓవర్సీస్ బుకింగ్స్ రిపోర్ట్ చూస్తుంటే ప్రభాస్ మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సోమవారం (డిసెంబర్ 29) ఉదయం రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం.. డిసెంబర్ 28 నాటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ సుమారు 2 లక్షల డాలర్లు దాటాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 29 ఉదయానికి కేవలం ప్రీ-సేల్స్ ద్వారానే రూ. 2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. జనవరి 9న ఇండియాలో రిలీజ్ కానుండగా.. జనవరి 8నే అమెరికాలో ప్రీమియర్స్ పడనున్నాయి.
{{/usCountry}}నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సోమవారం (డిసెంబర్ 29) ఉదయం రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం.. డిసెంబర్ 28 నాటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ సుమారు 2 లక్షల డాలర్లు దాటాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 29 ఉదయానికి కేవలం ప్రీ-సేల్స్ ద్వారానే రూ. 2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. జనవరి 9న ఇండియాలో రిలీజ్ కానుండగా.. జనవరి 8నే అమెరికాలో ప్రీమియర్స్ పడనున్నాయి.
{{/usCountry}}