ది రాజా సాబ్ నుంచి కింగ్ వరకు.. వచ్చే ఏడాది ఈ 11 సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. లిస్టులో రెండు తెలుగు మూవీస్
వచ్చే ఏడాది ఇండియన్ సినిమాకు మరింత కీలకం కానుంది. 2026లో ఎన్నో భారీ బడ్జెట్, మోస్ట్ అవేటెడ్ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వాటిలో ది రాజా సాబ్, పారడైజ్ తోపాటు పలు హిందీ, తమిళ, కన్నడ మూవీస్ కూడా ఉన్నాయి.
వచ్చే ఏడాది అంటే 2026 ఇండియన్ సినిమాకి ఒక బిగ్గెస్ట్ ఇయర్ కాబోతోంది. మైథాలాజికల్ ఎపిక్స్ నుంచి యాక్షన్ బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్ వరకు అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిలో రెండు మోస్ట్ అవేటెడ్ తెలుగు సినిమాలు కూడా ఉండటం విశేసం. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేలా ఉన్న ఈ లైనప్ వివరాలు ఏంటో తెలుసుకోండి.

1. కింగ్
2026లో మోస్ట్ హైప్ ఉన్న సినిమాల్లో ఇదొకటి. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో వస్తున్న ఈ హై-బడ్జెట్ హిందీ యాక్షన్ థ్రిల్లర్లో షారుక్ ఖాన్ నటిస్తున్నాడు. షారుక్ కూతురు సుహానా ఖాన్ ఈ సినిమాతోనే థియేట్రికల్ డెబ్యూ ఇస్తోంది. ఇందులో దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ వంటి భారీ తారాగణం ఉంది. మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేస్తున్నాడు. ఇది రీసెంట్ టైమ్స్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమాగా ప్రచారం జరుగుతోంది.
2. ధురంధర్ 2
2025లో వచ్చిన 'ధురంధర్' హిట్ అవ్వడంతో, దానికి సీక్వెల్ గా 'ధురంధర్ 2' వస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్ లోనే రణ్‌వీర్ సింగ్ హీరోగా ఈ సీక్వెల్ రాబోతోంది. ఇది కూడా స్పై యాక్షన్ థ్రిల్లరే. 2026 రంజాన్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ హిందీలోనే వచ్చినా, సెకండ్ పార్ట్ మాత్రం సౌత్ భాషల్లో కూడా (తెలుగుతో సహా) రిలీజ్ అవుతోంది. స్క్రిప్ట్ లీక్ అవ్వకుండా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
3. రామాయణ: పార్ట్ 1
2026లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇదే. నితేష్ తివారీ డైరెక్షన్లో వాల్మీకి రామాయణాన్ని గ్రాండ్ గా చూపించబోతున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యష్ (రావణుడు), సన్నీ డియోల్ (హనుమంతుడు) నటిస్తున్నారు. లెజెండ్స్ ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మిర్ మ్యూజిక్ ఇస్తున్నారు. దీని విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణంతో ఇండియన్ సినిమా రేంజ్ మారుతుందని అంచనా వేస్తున్నారు.
4. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్
2020లో ఇండియా-చైనా మధ్య గాల్వాన్ వ్యాలీలో జరిగిన రియల్ ఫైట్ ఆధారంగా ఈ వార్ డ్రామా వస్తోంది. సల్మాన్ ఖాన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. టీజర్ లో ఎమోషనల్ డైలాగ్స్, వార్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇదొక పక్కా పేట్రియాటిక్ సినిమా. రంజాన్ సందర్భంగానే రిలీజ్ కానుంది.
5. బోర్డర్ 2
1997లో వచ్చిన ఐకానిక్ వార్ మూవీ 'బోర్డర్' కి ఇది సీక్వెల్. సన్నీ డియోల్ తో పాటు వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి నటిస్తున్నారు. రిపబ్లిక్ డే (Republic Day) వీకెండ్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ జనరేషన్ హీరోలతో వార్ డ్రామాను కొత్తగా చూపించబోతున్నారు.
6. దృశ్యం 3
ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ ఫ్రాంచైజీకి ఇది చివరి భాగం. అక్టోబర్ 2, 2026 న రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. అజయ్ దేవగన్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఈసారి ఎలాంటి ప్లాన్ వేస్తాడన్నది ఆసక్తికరం. కథకు ఇందులో ఫుల్ క్లారిటీ, ఎండింగ్ ఇచ్చేస్తారట.
7. టాక్సిక్
కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. కానీ చాలా స్టైలిష్ గా ఉంటుందట. యష్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియాలాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇది కూడా రంజాన్ సమయంలోనే రిలీజ్ కానుండటం విశేషం. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
8. ది పారడైజ్
న్యాచురల్ స్టార్ నాని, 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ అడ్వెంచర్ డ్రామా. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు.
9. జన నాయగన్
దళపతి విజయ్ నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో అతనితోపాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ కూడా కనిపించనున్నారు. జనవరి 9, 2026న రిలీజ్ కానుంది. విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లే ముందు చేస్తున్న సినిమాల్లో ఒకటి కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే అతనికి చివరి మూవీగా భావిస్తున్నారు.
10. జైలర్ 2
2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'జైలర్' కి ఇది సీక్వెల్. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. రజనీకాంత్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, మిథున్ చక్రవర్తి, ఎస్.జె. సూర్య నటిస్తున్నారు. ఇందులో షారుక్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించొచ్చని టాక్. జూన్ 2026లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
11. ది రాజా సాబ్
ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న హారర్-కామెడీ సినిమా. సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 2026న రిలీజ్ కానుంది. ప్రభాస్ ని కొత్త లుక్ లో, కొత్త జానర్ లో చూడబోతున్నాం. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా సంజయ్ దత్ విలన్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో దీనిపై మంచి బజ్ ఉంది. మొత్తానికి 2026లో అన్ని రకాల సినిమాలు (యాక్షన్, సెంటిమెంట్, డివోషనల్) ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


