చిరంజీవికి బాడీగార్డ్‌లా ప్రకాష్ రాజ్.. భట్టి కొడుకు పెళ్లిలో.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..
మెగాస్టార్ చిరంజీవికి ప్రకాష్ రాజ్ ఓ బాడీగార్డ్ లా ఉంటూ బయటకు తీసుకెళ్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు కాస్త చులకన చేసేలా మాట్లాడారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహం సాక్షి అనే యువతితో గురువారం (మార్చి 5) హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు తరలివచ్చారు. అయితే ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన ఒక ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను నవ్విస్తోంది.

'బాస్' కోసం బౌన్సర్‌గా మారిన ప్రకాష్ రాజ్
పెళ్లి వేడుకకు చిరంజీవి రాగానే ఆయనతో ఫోటోలు దిగేందుకు, కనీసం ఒక్కసారైనా పలకరించేందుకు అతిథులు ఎగబడ్డారు. చిరంజీవి తనదైన శైలిలో అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతుండగా.. ఆయన వెంటే ఉన్న ప్రకాష్ రాజ్ సెక్యూరిటీ సిబ్బంది తరహాలో జనాలను పక్కకు నెట్టుకుంటూ చిరంజీవికి దారి సుగమం చేశాడు.
ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "బాస్‌కు బాడీగార్డ్‌లా ప్రకాష్ రాజ్", "అన్నయ్యకు బౌన్సర్‌లా ఉన్నారు" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అయితే "ఆయన నిజంగానే బాడీగార్డా? జస్ట్ ఆస్కింగ్ అంతే" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మరికొందరేమో "బాస్ అంటే ప్రకాష్ రాజ్‌కు పిచ్చి ప్రేమ" అంటూ వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
విభేదాలున్నా.. గౌరవం తగ్గదు
కేవలం కామెడీగానే కాకుండా, మరికొందరు నెటిజన్లు ఈ విషయాన్ని చాలా గౌరవప్రదంగా చూస్తున్నారు. "రాజకీయంగా లేదా సిద్ధాంతపరంగా ఎన్ని విభేదాలు ఉన్నా, చిరంజీవి అంటే ప్రకాష్ రాజ్‌కు అమితమైన గౌరవం, అభిమానం. అందుకే ఆయనకు ఏ ఇబ్బంది కలగకుండా అలా చేశారు" అని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడు ఎటువంటి అహంకారం లేకుండా అలా చేయడం గమనార్హం.
వీరిద్దరి కాంబినేషన్‌లో స్నేహం కోసం (1999), ఇంద్ర (2002), అందరివాడు (2005), స్టాలిన్ (2006) వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇటీవలే వాల్తేరు వీరయ్య (2023)లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు.
ఇద్దరు నటుల కెరీర్ అప్‌డేట్స్
ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర'లో నటిస్తున్నారు. దీనితో పాటు బాబీ, శ్రీకాంత్ ఓదెల సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ ఏడాది 'సీత పయణం'లో కనిపించిన ప్రకాష్ రాజ్.. త్వరలో విజయ్ 'జన నాయగన్', అడివి శేష్ 'G2', 'డెకాయిట్' సినిమాల్లో నటించనున్నారు. మహేష్ బాబు 'వారణాసి'లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












