Prakash Raj: అవును.. నేను దేవుడిని నమ్మను.. కానీ మా అమ్మ నమ్మకం ప్రకారమే అలా చేశా: ట్రోలింగ్‌పై ప్రకాష్ రాజ్ ఘాటు కౌంటర్

Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన తల్లి స్వర్ణలత అంత్యక్రియలను ఆమె నమ్మకం ప్రకారం క్రైస్తవ పద్ధతిలో నిర్వహించాడు. తాను దేవుడిని నమ్మకపోయినా, తన తల్లి విశ్వాసాన్ని గౌరవించానని చెబుతూ విమర్శించిన వారికి అతడు గట్టి సమాధానమిచ్చాడు.

Published on: Apr 2, 2026, 16:12:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తల్లి స్వర్ణలత (86) ఇటీవల వయోభారంతో తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె నమ్మకాలకు అనుగుణంగా మంగళవారం బెంగళూరులోని సెయింట్ మైఖేల్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రోజూ సామాజిక, రాజకీయ అంశాలపై గళమెత్తే ప్రకాష్ రాజ్ నాస్తికుడన్న విషయం అందరికీ తెలిసిందే.

Prakash Raj: అవును.. నేను దేవుడిని నమ్మను.. కానీ మా అమ్మ నమ్మకం ప్రకారమే అలా చేశా: ట్రోలింగ్‌పై ప్రకాష్ రాజ్ ఘాటు కౌంటర్
Prakash Raj: అవును.. నేను దేవుడిని నమ్మను.. కానీ మా అమ్మ నమ్మకం ప్రకారమే అలా చేశా: ట్రోలింగ్‌పై ప్రకాష్ రాజ్ ఘాటు కౌంటర్

తాను దేవుడిని నమ్మనని చెప్పే వ్యక్తి, తన తల్లికి మతపరమైన అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. దీనిపై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు.

ట్రోలర్‌కు అదిరిపోయే సమాధానం

ఒక నెటిజన్ ప్రకాష్ రాజ్ పాత ఇంటర్వ్యూను, అతని తల్లి అంత్యక్రియల వీడియోను కలిపి పోస్ట్ చేస్తూ విమర్శలకు దిగారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "నాకు దేవుడిపై నమ్మకం లేదు. ఆ ఆలోచనలకు నా దగ్గర సమయం లేదు. నేను తోటి మనుషుల గురించి, ఈ ప్రపంచం గురించి మాత్రమే ఆలోచిస్తాను" అని చెప్పాడు.

ఈ వీడియోను షేర్ చేసిన నెటిజన్.. "ప్రకాష్ రాజ్ తనను తాను నాస్తికుడిగా చెప్పుకుంటారు. కానీ తన తల్లి అంత్యక్రియలు మాత్రం క్రైస్తవ పద్ధతిలో చేశారు" అని ఎద్దేవా చేశారు.

దీనికి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. "అవును.. నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ మా అమ్మ తన దేవుడిని నమ్మేది. ఆమె నమ్మకం ప్రకారం అంత్యక్రియలు పొందే హక్కును కాదనడానికి నేనెవరు? ఒకరినొకరు గౌరవించుకోవడమంటే ఇదే. ద్వేషాన్ని నింపుకున్న మీలాంటి రాక్షసులకు ఇది అర్థమవుతుందా?" అంటూ దీటైన సమాధానమిచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలోనే అతడు ఒక విషయం స్పష్టం చేశాడు. తన భార్య పోనీ వర్మ హిందూ మతాన్ని, తల్లి క్రైస్తవాన్ని అనుసరిస్తారని, వారి నమ్మకాలను ప్రశ్నించే హక్కు తనకు లేదని అతడు చెప్పాడు. భార్య చేసే హోమాల్లో కూర్చుంటానని, అమ్మ అడిగితే చర్చికి కూడా వెళ్తానని, వారు ఎవరికీ హాని చేయనంత కాలం తనకు అభ్యంతరం లేదని అప్పట్లోనే ఆయన వివరించాడు.

అమ్మ జ్ఞాపకాల్లో ప్రకాష్ రాజ్

తల్లి మరణం తర్వాత ప్రకాష్ రాజ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లి పాత ఫోటోను షేర్ చేస్తూ.. "మా దుఃఖ సమయంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అమ్మ.. ప్రతిదానికీ థాంక్యూ. నిన్ను చాలా మిస్ అవుతున్నాను" అని రాసుకొచ్చాడు. గతంలో తన తల్లికి బ్రెయిన్ సిస్ట్ సర్జరీ జరిగిందని, దానివల్ల ఆమె జ్ఞాపకశక్తి కోల్పోయి ఇబ్బంది పడ్డారని అతడు వెల్లడించాడు.

సినిమాల విషయానికి వస్తే.. ప్రకాష్ రాజ్ ఇటీవల ధనుష్, కృతి సనన్ నటించిన 'తేరే ఇష్క్ మే' చిత్రంలో కనిపించాడు. త్వరలో విజయ్-హెచ్.వినోద్ కాంబినేషన్‌లో వస్తున్న 'జన నాయగన్'లో కీలక పాత్ర పోషించనున్నాడు. వీటితో పాటు అడివి శేష్ 'డెకాయిట్', 'G2', 'వారణాసి' వంటి క్రేజీ ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. ప్రకాష్ రాజ్ తల్లి అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి?

ఆమె అంత్యక్రియలు బెంగళూరులోని సెయింట్ మైఖేల్ చర్చిలో ఆమె నమ్మకాల ప్రకారం క్రైస్తవ సంప్రదాయంలో జరిగాయి.

2. ప్రకాష్ రాజ్ నాస్తికుడా?

అవును, ప్రకాష్ రాజ్ తాను దేవుడిని నమ్మనని (Atheist) పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారు.

3. తన తల్లి అంత్యక్రియల విషయంలో ప్రకాష్ రాజ్ ఏమని స్పందించాడు?

తల్లికి తన నమ్మకం ప్రకారం అంత్యక్రియలు పొందే హక్కు ఉందని, ఒకరి విశ్వాసాన్ని మరొకరు గౌరవించుకోవడమే మానవత్వమని ఆయన పేర్కొన్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More