Pony Verma: ప్రకాష్ రాజ్‌ను పెళ్లి చేసుకుంటే సాంబార్ తిని తిని చచ్చిపోతావ్ అన్నారు:నటుడి రెండో భార్య పోనీ వర్మ కామెంట్స్
Pony Verma About Marriage With Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ను వివాహం చేసుకునే సమయంలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎలా స్పందించారో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ వెల్లడించారు. 12 ఏళ్ల వయసు వ్యత్యాసంతో పాటు దక్షిణాది ఆహార అలవాట్లపై తమ ఇంట్లో వ్యక్తమైన భయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Pony Verma About Marriage With Prakash Raj: టాలీవుడ్లో విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్. వెండితెరపై ఆయన కనిపించే తీరు, చెప్పే సంభాషణలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపై విలన్‌గా మెప్పించినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏడిపించినా ఆయన శైలే వేరు.

ప్రకాష్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ
అటువంటి నటుడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని ఆయన సతీమణి, ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రకాష్ రాజ్‌తో తన ప్రేమ, పెళ్లి ప్రయాణం వెనుక ఉన్న జ్ఞాపకాలను ఆమె మనసు విప్పి మాట్లాడారు.
'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' నాటి తొలి పరిచయం
ప్రకాష్ రాజ్‌ను తెరపై మొదటిసారి చూసిన క్షణాన్ని పోనీ వర్మ గుర్తు చేసుకున్నారు. "2003లో వచ్చిన 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలో ప్రకాశ్‌ను వీల్‌చైర్‌లో కూర్చున్న ఒక వృద్ధుడిగా మొదటిసారి చూశాను" అని ఆమె తెలిపారు.
ఆ తర్వాత పలు చిత్రాలకు కలిసి పనిచేస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఒకవైపు పోనీ వర్మ తన తల్లిని కోల్పోయి తీవ్రమైన బాధలో ఉండగా, మరోవైపు ప్రకాష్ రాజ్ తన మొదటి భార్య లలితా కుమారితో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నారు. ఆ కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలిచిన ఈ బంధం, కాలక్రమేణా ప్రేమగా మారి 2010లో వివాహానికి దారితీసింది.
"సాంబార్ తిని చచ్చిపోతావా ఏంటి?" – పంజాబీ కుటుంబంలో భయాలు
ఉత్తరాదికి చెందిన పంజాబీ కుటుంబంలో పెరిగిన పోనీ వర్మ, ప్రకాష్ రాజ్‌ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు.
"మా ఇంట్లో వాళ్లకు దక్షిణాది సంస్కృతి, తిండి అలవాట్లపై పెద్దగా అవగాహన లేదు. రోజూ సాంబార్ తిని చచ్చిపోతావా ఏంటి? అని భయపడ్డారు. మనం ఎప్పుడో ఒకసారి హోటల్‌కి వెళ్లినప్పుడు ఇడ్లీ సాంబార్ తింటే బాగుంటుంది కానీ రోజూ ఎలా తింటావని ప్రశ్నించారు. అయితే నాకు సాంబార్ అంటే ఇష్టమేనని నచ్చజెప్పాను" అని పోనీ వర్మ ఆనాటి సరదా సంఘటనను గుర్తు చేసుకున్నారు.
12 ఏళ్ల వయసు తేడా
12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటంపై స్నేహితులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారట. "అంత వయసు తేడా ఉన్న వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు?" అని ప్రశ్నించారని ఆమె చెప్పారు. అయితే ఈ వయసు వ్యత్యాసమే తమ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని పోనీ వర్మ చెప్పారు.
"నా జీవితంలో ఉన్న అస్థిరతను, శ్రమను అర్థం చేసుకుని, నాకు ప్రశాంతతను ఇవ్వగల పరిణతి ఒక్క ప్రకాష్లోనే ఉంది. ఎగిసిపడే అలలాంటి నా జీవితానికి ఆయన ఒక తీరంలా దొరికారు. స్పూన్ పక్కన పెట్టి చేత్తో హాయిగా తిను, దేని గురించి కంగారు పడకు అని నా జీవితంలో ఒక నిలకడను తీసుకొచ్చారు" అని పోనీ వర్మ పేర్కొన్నారు.
ఒడిదుడుకులను దాటుకుని సాగిన ప్రయాణం
ప్రకాష్ రాజ్ 1994లో నటి లలితా కుమారిని వివాహం చేసుకోగా.. వారికి మేఘన, పూజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే 2004లో గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి వారి ఐదేళ్ల కుమారుడు సిద్ధార్థ్ మరణించాడు. ఆ విషాదం వారి జీవితాన్ని తీవ్రంగా కలచివేసింది.
తదనంతర పరిణామాలతో 2009లో విడాకులు తీసుకున్న ప్రకాష్ రాజ్, 2010లో పోనీ వర్మను వివాహం చేసుకున్నారు. వీరికి 2015లో వేదాంత్ అనే కుమారుడు జన్మించాడు. సొంత కొడుకును కోల్పోవడం, ఆత్మీయ మిత్రురాలు గౌరీ లంకేష్‌ను కోల్పోవడం వల్ల కలిగిన మానసిక వేదనపై ప్రకాష్ రాజ్ గతంలో మాట్లాడారు.
స్వార్థపరుడిలా మారిపోలేను
"బాధ అనేది వ్యక్తిగతం. కొడుకుని, స్నేహితురాలిని కోల్పోయిన వేదన నా గుండెల్లో అలాగే ఉంటుంది. కానీ నేను స్వార్థపరుడిలా మారిపోలేను. నాకు కుమార్తెలు ఉన్నారు, కుటుంబం ఉంది, నటన ఉంది. ఒక మనిషిగా నా బాధ్యతలను నేను నెరవేర్చాలి" అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఈ కష్ట సుఖాలన్నింటినీ పంచుకుంటూ ప్రస్తుతం ఈ జంట ఆదర్శవంతంగా ముందుకు సాగుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


