ప్రేమ, వివాహం, వ్యక్తిత్వం.. ‘U’ అక్షరంతో పేరు మొదలయ్యేవారి గురించి ఆసక్తికర విషయాలు!
న్యూమరాలజీ విశ్వాసాల ప్రకారం ‘U’ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు 3వ సంఖ్యకు సంబంధించినవారిగా పరిగణిస్తారు. ఈ సంఖ్యను సృజనాత్మకత, కమ్యూనికేషన్, భావాలను వ్యక్తపరచడం వంటి లక్షణాలతో అనుసంధానిస్తారు.
రాశుల ఆధారంగా, పుట్టిన నక్షత్రాల ఆధారంగా, పుట్టిన రోజు ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే న్యూమరాలజీ అవతారంగా కూడా మన గురించి తెలుసుకోవచ్చు. అంతే కాదు, పేరులో మొదటి అక్షరం కూడా ఎన్నో విషయాలను చెప్తుంది. 'U' అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? అయితే మీరు ఎలాంటి వారు? ఇక్కడ తెలుసుకోండి.

పేరులో మొదటి అక్షరాల ఆధారంగా ఒక సంఖ్యను సంబంధం కలిగి ఉంటారు. పేరు 'U' అక్షరంతో మొదలైనట్లయితే, వారు మూడవ సంఖ్యకు చెందినవారు. ఎవరైనా, ఎవరి పేరైనా సి, ఎల్, యు అక్షరాలతో మొదలవుతున్నట్లయితే, వారు మూడు సంఖ్యకి చెందినవారు. మూడు సంఖ్య వారు ఎలా ఉంటారు? ఈ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?
మీ పేరు 'U' అక్షరంతో మొదలవుతున్నట్లయితే, భావాలను మాటల ద్వారా వ్యక్తపరచడానికి ఇష్టపడతారు. కమ్యూనికేషన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంబంధాల్లో సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు.
సృజనాత్మకత, కమ్యూనికేషన్
మూడవ సంఖ్యను సృజనాత్మకత, కమ్యూనికేషన్ లాంటి లక్షణాలతో అనుసంధానిస్తారు. యు అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే భావాలను వ్యక్తపరిచే స్వభావం, మాట్లాడే గుణం, సామాజికంగా ఇతరులతో చురుకుగా ఉండడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు.
ప్రేమలో నిజాయితీ
మీ పేరు 'U' అక్షరంతో మొదలవుతున్నట్లయితే, సంబంధంలో నిజాయితీ, నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భాగస్వామి నుంచి కూడా అదే ఆశిస్తారు. సంబంధంలో అనుబంధం, నమ్మకం ఉన్నాయని భావించినప్పుడు భాగస్వామికి తోడుగా ఉండడానికి ప్రయత్నిస్తారు.
గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటారు
పేరు 'U' అక్షరంతో మొదలవుతున్నట్లయితే, వారు ప్రేమతో పాటు సంబంధాల్లో గౌరవం, వ్యక్తిగత స్పేస్ కూడా కోరుకుంటారు. వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మాటలను శ్రద్ధగా వింటారు. భాగస్వామి కూడా వారి మాటలను అలాగే వినాలని ఆశిస్తారు.
వివాహం, సంబంధం విషయంలో ఎలా ఉంటారు?
యు అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే, వివాహం, సంబంధాల విషయాల్లో సీరియస్‌గా ఉంటారు. ప్రేమ జీవితంలో ఈ వ్యక్తులు తొందరపడరు. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే, ఒకసారి సంబంధం ఏర్పడ్డాక, దానిని కొనసాగించడానికి కట్టుబడి ఉంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


