ఈరోజు ఋషి పంచమి.. పూజా సమయం, విధానం, పౌరాణిక ప్రాధాన్యత పూర్తిగా తెలుసుకోండి
ఈరోజు సెప్టెంబర్ 15న ఋషి పంచమి జరుపుకుంటారు. భాద్రపద శుక్లపక్ష పంచమి రోజున సప్తఋషులను భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీ. ఉపవాసం ఉండి సప్తఋషులను ఆరాధించడం వల్ల తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తి, సుఖసంతోషాలు, కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం కలుగుతాయని మత విశ్వాసం.
ఈరోజు ఋషి పంచమి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమినాడు ఋషి పంచమిని జరుపుకుంటాము. ఈరోజు సప్తఋషులను భక్తితో పూజిస్తారు. ఋషి పంచమి నాడు ఉపవాసం ఉండి సప్త ఋషులను ఆరాధించడం వలన రుతు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్మకం. ఋషి పంచమి పూజా విధానంతో పాటుగా శుభ సమయం, ఋషి పంచమి పౌరాణిక ప్రాధాన్యత గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.

ఋషి పంచమి పూజకు శుభ సమయం
తేదీ: సెప్టెంబర్ 15, మంగళవారం.
పంచమి తిథి ప్రారంభం: సెప్టెంబర్ 15 ఉదయం 7:44 గంటలకు.
పంచమి తిథి ముగింపు: సెప్టెంబర్ 16 ఉదయం 8:59కి.
పూజకు శుభ సమయం: ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:58 వరకు.
ఋషి పంచమి పౌరాణిక ప్రాధాన్యత
మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, ఋషి పంచమి నాడు సప్తఋషులకు గౌరవం, భక్తి, కృతజ్ఞతలు తెలుపుతారు. ఈరోజు కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ మహర్షులను ఆరాధిస్తారు. సప్తఋషులను ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
సప్త ఋషులను జ్ఞానం, తపస్సు, ధర్మానికి ప్రతీకలుగా భావిస్తారు. ఉపవాసం ఉండి భక్తితో సప్తఋషులను పూజిస్తే తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది.
ఋషి పంచమి పూజా విధానం
ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఆ తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. సప్తఋషులను పూజించేందుకు సంకల్పం చెప్పుకుని, సప్తఋషుల చిత్రపటం లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకోవాలి.
తర్వాత గంగాజలంతో సప్తఋషులను పవిత్రం చేసి, అక్షతలు, పుష్పాలు, చందనం సమర్పించాలి. ధూప, దీప, నైవేద్యాలను సప్తఋషులకు సమర్పించి వారి ఆశీస్సులను పొందాలి. ఇలా చేయడం వలన సుఖ సంతోషాలు, కుటుంబంలో శ్రేయస్సు కూడా కలుగుతాయని నమ్మకం.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


