Samantha Seemantham: సమంతకు సీమంతం.. శ్రీవిద్య సాంప్రదాయం, కళా ఆవరణ పూజ.. అసలేంటివి?

Samantha Seemantham: సమంతకు ఘనంగా సీమంతం వేడుక జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: Sep 14, 2026, 20:46:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Samantha Seemantham: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుక జరుపుకున్నారు. శ్రీవిద్య సంప్రదాయంలో ప్రత్యేకమైన 'కళా ఆవరణ' (శ్రీ కల్పం) పూజను వేద పండితుల సమక్షంలో నిర్వహించిన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Samantha Seemantham: సమంతకు సీమంతం.. శ్రీవిద్య సాంప్రదాయం, కళా ఆవరణ పూజ.. అసలేంటివి?
Samantha Seemantham: సమంతకు సీమంతం.. శ్రీవిద్య సాంప్రదాయం, కళా ఆవరణ పూజ.. అసలేంటివి?

శ్రీవిద్య సంప్రదాయంలో సీమంతం పూజ.. సమంత ఎమోషనల్

సమంత తన సీమంతం పూజకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పూజ సమయంలో ఆమె లేత ఆరెంజ్ కలర్ చుడీదార్ ధరించి, పూలమాల వేసుకుని కనిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆమెపై పవిత్ర జలాలను ప్రోక్షించారు.

ఈ వేడుక గురించి సమంత రాస్తూ.. "మన ఆచార వ్యవహారాలపై నాకు ఎప్పుడూ అమితమైన గౌరవం ఉంటుంది. ఈ పూజ వెనుక ఉన్న లోతైన అర్థం పూర్తిగా తెలియకపోయినా, మంత్రాల ధ్వనిలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుందని నేను బలంగా నమ్ముతాను" అని పేర్కొన్నారు.

'కళా ఆవరణ' పూజ ప్రత్యేకత ఏంటి?

ఈ వేడుకలో శ్రీవిద్య ఉపాసకులు ప్రతి ఘట్టాన్ని వివరిస్తూ పూజ చేశారని సమంత తెలిపారు. ఈ సంప్రదాయంలో ప్రతి మంత్రానికి, ప్రతి నివేదనకు ఒక ప్రత్యేకమైన పరమార్థం ఉంటుందని ఆమె వివరించారు.

'కళా ఆవరణ' (శ్రీ కల్పం) అనేది శ్రీవిద్య సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఘట్టం. భావి తల్లి శరీరంలోని ఏడు చక్రాల ద్వారా దేవికి ఉన్న 94 కళలను ఆవాహన చేస్తారు. పవిత్ర జలాలు, మంత్రాలతో చక్రాలను శుద్ధి చేసి దివ్య శక్తిని నింపుతారు.

"దేవతా స్వరూపంగా భావించడం నా మనసును తాకింది"

ఈ పూజలో నవజాత శిశువును మోస్తున్న తల్లిని స్వయంగా దేవీ స్వరూపంగా భావించి పూజించడం తనను ఎంతగానో కదిలించిందని సమంత చెప్పారు. ఒక కొత్త జీవికి ప్రాణం పోసే సృష్టికర్తగా మహిళను గౌరవించడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.

అభిషేకం పూర్తయిన తర్వాత తల్లిని శ్రీ చక్ర యంత్రం మధ్యలో కూర్చోబెడతారు. దేవీ ఖడ్గమాలను పఠిస్తూ తొమ్మిది ఆవరణల్లోని దేవతలను ఆహ్వానిస్తారు. వెలుపలి నుంచి కేంద్రం వైపు సాగే ఈ జపం మనసును ఆధ్యాత్మికంగా ప్రశాంతపరుస్తుందని సమంత తెలిపారు.

'మా ఇంటి బంగారం'తో భారీ కంబ్యాక్

సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన ఆరోగ్య సమస్యతో పోరాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చిన ఆమె, నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు.

రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, మంజూషా ముక్కవిల్లి, దిగంత్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ రూ.100 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూలు చేసి, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఫిమేల్ లీడ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి, ప్రెగ్నెన్సీ

సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుల బంధం 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' ప్రాజెక్ట్‌లతో మరింత బలపడింది. ఆ తర్వాత కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్‌లో లింగ భైరవి పద్ధతిలో యోగిక్ శైలిలో వీరి వివాహం జరిగింది.

'మా ఇంటి బంగారం' సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత సమంత తన ప్రెగ్నెన్సీ వార్తను అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సంప్రదాయబద్ధంగా సీమంతం పూర్తి కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More