CM Vijay: బ్రిటన్‌లో అజిత్‌ను విజయ్ కలవడంలో తప్పేం లేదు, తొందరపడి విమర్శలు చేయొద్దు: వేల కోట్ల పెట్టుబడులపై ప్రకాష్ రాజ్

Prakash About CM Vijay Met Ajith In Britain: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇంగ్లాండ్ పర్యటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రేస్ ట్రాక్‌లో అజిత్‌ను కలవడం, ప్రతిపక్షాల విమర్శలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ సీఎం విజయ్ పాలనను ఇప్పుడే తప్పుపట్టలేమని సపోర్టింగ్‌గా మాట్లాడారు.

Published on: Sep 20, 2026, 17:38:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Prakash About CM Vijay Met Ajith In Britain: తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల చేపట్టిన బ్రిటన్ పర్యటన తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంగ్లాండ్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ రేస్ ట్రాక్‌లో జరిగిన 'లే మాన్స్' రేస్‌ను దళపతి విజయ్ జెండా ఊపి ప్రారంభించారు.

బ్రిటన్‌లో అజిత్‌ను విజయ్ కలవడంలో తప్పేం లేదు, తొందరపడి విమర్శలు చేయొద్దు: వేల కోట్ల పెట్టుబడులపై ప్రకాష్ రాజ్
బ్రిటన్‌లో అజిత్‌ను విజయ్ కలవడంలో తప్పేం లేదు, తొందరపడి విమర్శలు చేయొద్దు: వేల కోట్ల పెట్టుబడులపై ప్రకాష్ రాజ్

స్వల్ప కాలంలోనే విదేశీ పర్యటన

ఈ పోటీలో స్టార్ హీరో అజిత్ కుమార్ తన టీమ్‌తో పాల్గొనగా, విజయ్ ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే విదేశీ పర్యటనకు వెళ్లడంపై ప్రతిపక్షాలు మండిపడుతుండటంతో, ఈ వివాదంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ సమయం ఇచ్చి తీరాల్సిందే: ప్రకాష్ రాజ్

తిరుచిరాపల్లిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ తమిళనాడు సీఎం విజయ్ పర్యటన వివాదంపై మాట్లాడారు. పాలన తీరుతెన్నులను అంచనా వేయడానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.

"తనకు ఓటేసిన వారికే కాక, ఓటేయని ప్రజలందరికీ విజయ్ ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఏర్పడి కేవలం 120 రోజులే అయింది కాబట్టి, ఇప్పుడే ఓ అభిప్రాయానికి రావడం సరికాదు. ఆయన పనితీరును విశ్లేషించేందుకు కనీసం ఒక సంవత్సరం సమయం ఇవ్వాలి. ఎన్నికలకు ముందు విజయ్ రాజకీయ నిర్ణయాలపై నాకు కొన్ని అనుమానాలు ఉండేవి. కానీ, ప్రజలు ఆయనను గెలిపించి అధికారాన్ని అప్పగించారు" అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

పర్యటన వెనుక వేల కోట్ల పెట్టుబడులు

ఒకవేళ ఏడాది పూర్తయ్యాక కూడా పాలన సరిగ్గా లేకపోతే తానే స్వయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్ కోసం వేచి చూస్తున్నానని, పాలకుడు నచ్చలేదనే కారణంతో వెంటనే విమర్శలు చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

"విజయ్ విదేశాలకు వెళ్లి తన స్నేహితుడు అజిత్‌ను కలవడంలో ఎలాంటి తప్పు లేదు. అసలు పర్యటన ఉద్దేశం నెరవేరిందా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. ఈ పర్యటన ద్వారా తమిళనాడుకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చానని సీఎం స్వయంగా చెప్పారు. అందువల్ల తొందరపడి విమర్శలు చేయాల్సిన అవసరం లేదు" అని ఆయన తెలిపారు.

రేస్ ట్రాక్‌లో సందడి చేసిన తారలు

సిల్వర్‌స్టోన్ రేస్ ట్రాక్‌ వద్ద విజయ్, అజిత్ కలయిక అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. విజయ్ వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి అజిత్‌ను ఆలింగనం చేసుకున్న వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. గ్యాలరీలోని అభిమానులు 'టీవీకే' అని నినాదాలు చేస్తున్న సమయంలో, తనకంటే ఎక్కువగా అజిత్ కోసమే కేకలు వేయాలని విజయ్ సైగలు చేయడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ పర్యటనలో విజయ్ వెంట హీరోయిన్ త్రిష, తమిళగ వెట్రి కళగం (TVK) నాయకుడు ఆధవ్ అర్జున కూడా ఉన్నారు. రేస్ వ్యాఖ్యాతలు వీరిద్దరి ప్రజాదరణను హాలీవుడ్ దిగ్గజాలు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్‌లతో పోల్చడం విశేషం.

విజయ్, అజిత్ సినిమాలు

ఇక సినిమాల విషయానికొస్తే.. అజిత్ ఇటీవల 'విడాముయర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాల్లో నటించగా, ప్రస్తుతం 'డేర్ డెవిల్' చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' జూలై 23న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ఆగస్ట్ 21 నుంచి జీ5లో జన నాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More