Vijay Trisha: సీఎంగా తొలిసారి జాతీయ జెండా ఎగరేసిన దళపతి విజయ్- ఇండిపెండెన్స్ వేడుకల్లో త్రిష- విజయ్ ఫ్యామిలీ పక్కనే!

Trisha Attends CM Vijay Independence Day Celebrations: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళనాడు సచివాలయంలో నూతన ముఖ్యమంత్రి విజయ్ తొలిసారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రుల పక్కన హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Published on: Aug 15, 2026, 09:44:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trisha Attends CM Vijay Independence Day Celebrations: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మిన్నుముట్టాయి. తమిళనాడులో ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకున్న 'తమిళగ వెట్రి కళగం' (TVK) ప్రభుత్వం నిర్వహిస్తున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవం ఇది కావడం విశేషం.

సీఎంగా తొలిసారి జాతీయ జెండా ఎగరేసిన దళపతి విజయ్- ఇండిపెండెన్స్ వేడుకల్లో త్రిష- విజయ్ ఫ్యామిలీ పక్కనే!
సీఎంగా తొలిసారి జాతీయ జెండా ఎగరేసిన దళపతి విజయ్- ఇండిపెండెన్స్ వేడుకల్లో త్రిష- విజయ్ ఫ్యామిలీ పక్కనే!

సచివాలయంలో మువ్వన్నెల జెండా ఎగరేసిన సీఎం విజయ్

చెన్నైలోని చారిత్రాత్మక సెంట్ జార్జ్ కోట (సచివాలయం) ప్రాంగణంలో శనివారం (ఆగస్ట్ 15) ఉదయం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ తొలిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అత్యంత వైభవంగా వేడుక, సీఎం విజయ్ స్పీచ్

సంగీత విభావరి, పోలీసు బలగాల మార్చ్ ఫాస్ట్ నడుమ అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రసంగిస్తూ, తమిళనాడును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

విజయ్ కుటుంబంతో కలిసి మెరిసిన త్రిష

ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్, సీఎం విజయ్ ఆప్తమిత్రురాలు త్రిష పాల్గొనడం అందరి దృష్టినీ ఆకర్షించింది. తన తల్లితో కలిసి వేడుకకు విచ్చేసిన త్రిష, వీఐపీ విభాగానికి కేటాయించిన మొదటి వరుసలో ఆసీనులయ్యారు. విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్, తల్లి శోభల పక్కనే త్రిష కూర్చుని కనిపించారు.

రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే

విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయం నుంచే ఆయన వ్యక్తిగత జీవితంపై మీడియాలో అనేక ఊహాగానాలు షికారు చేశాయి. భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో త్రిష పేరును పలువురు తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.

నేరుగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు

అయితే ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోని త్రిష.. విజయ్ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు నేరుగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహోత్సవంలోనూ పాల్గొని తన మద్దతును చాటుకున్నారు.

కొనసాగుతున్న రాజకీయ విమర్శలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రిష పాల్గొనడంపై తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చర్చ మొదలైంది. కొద్దిరోజుల క్రితం కావేరీ జలాల వివాదంపై డీఎంకే చేపట్టిన నిరసన కార్యక్రమంలో కొందరు కార్యకర్తలు త్రిష పేరును ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారడం, ఆపై ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది.

సోషల్ మీడియాలో ట్రెండింగ్

తాజాగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి త్రిష వేదిక పంచుకోవడం సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌గా మారింది. ఒక పక్క రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు ఎదురవుతున్నా, విజయ్-త్రిషల బంధం మళ్లీ వార్తల్లో నిలిచింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More