Prakash Raj: ప్రశ్నిస్తే చంపేస్తారా.. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్.. రావణ్ అరెస్టుపై సెన్సేషనల్ ట్వీట్స్

Prakash Raj: నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్రంగా మండిపడ్డాడు ప్రకాష్ రాజ్. హైదరాబాద్ లో రావణ్ అరెస్టుపై అతడు చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రశ్నిస్తే చంపేస్తారా అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించాడు.

Published on: Jul 3, 2026, 21:27:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Prakash Raj: ఏపీ పాలిటిక్స్ లో మరోసారి పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ పెట్టిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్న ఆయన.. జనసైనికుల దాడుల గురించి కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు.

Prakash Raj: ప్రశ్నిస్తే చంపేస్తారా.. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్.. రావణ్ అరెస్టుపై సెన్సేషనల్ ట్వీట్స్
Prakash Raj: ప్రశ్నిస్తే చంపేస్తారా.. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్.. రావణ్ అరెస్టుపై సెన్సేషనల్ ట్వీట్స్

ఎప్పుడూ తన ఐకానిక్ హ్యాష్ ట్యాగ్ #justasking తో పొలిటికల్ లీడర్స్ ను ఇరుకున పెట్టే ప్రకాష్ రాజ్.. ఈసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ పాయింట్ ను టచ్ చేస్తూ ఒక ఘాటైన ట్వీట్ చేశారు.

మీ నాన్నను చూసైనా ఆ పనులు ఆపండి

తన మొదటి ట్వీట్ లో ప్రకాష్ రాజ్ పోలీసు వ్యవస్థ గురించి చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. "పోలీస్ డిపార్ట్‌మెంట్ లో ఎన్నో ఏళ్లు సేవలు అందించిన మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో అయినా ఆలోచించండి. మీకు ఒక పవర్ ఫుల్ పదవి రాగానే, మీ పర్సనల్ ఎజెండాలు, కోరికలు తీర్చుకోవడానికి పోలీసు వ్యవస్థను వాడుకోకండి #justasking" అంటూ పవన్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ తండ్రి కొణిదెల వెంకట్రావు ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసి రిటైర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కరెక్ట్ గా ఆ పాయింట్ నే బేస్ చేసుకుని ప్రకాష్ రాజ్ ఈ ఎమోషనల్, పొలిటికల్ అటాక్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటం సరైంది కాదని పదే పదే అన్నారు.

ప్రశ్నిస్తే చంపేస్తారా?

ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రకాష్ రాజ్ మరో సెన్సేషనల్ ట్వీట్ వదిలారు. ఈసారి ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్స్ ను ట్యాగ్ చేస్తూ జనసేన క్యాడర్ పై విరుచుకుపడ్డారు.

"అసలు మీ జనసేన పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఈ పనులేంటి? నిలదీసి ప్రశ్నిస్తే చంపేస్తారా? ఈ రౌడీయిజం మీద మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా?" అంటూ ఒక పోస్ట్ ను కోట్ చేస్తూ ఫైర్ అయ్యారు.

దీనికి ఓ వీడియో కూడా యాడ్ చేశారు. “ఏంటో జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు.. జన సైనికులా గూండాలా.. ప్రశ్నించాడని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.. కోర్టు బెయిల్ మీద బెయిల్ ఇస్తోంది.. మీరు అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నారు.. ఈ కొత్త నాటకం ఏంటి? ఈ బెదిరింపులు ఏంటి.. ప్రశ్నించేవాళ్లను ఈ జన సైనికులు చంపేస్తారా ఏంటి? కాస్త జాగ్రత్తగా ఉండండి.. దేశం చూస్తోంది” అని ప్రకాష్ రాజ్ చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

ప్రకాష్ రాజ్ వర్సెస్ జనసేన

గతంలో కూడా పలుమార్లు ఐడియాలజీ పరంగా పవన్ కళ్యాణ్ కు, ప్రకాష్ రాజ్ కు మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద కోల్డ్ వారే నడిచింది. గత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎలక్షన్స్ టైమ్ లో కూడా ఈ విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలో ఉండటం, పవన్ కీలకమైన డిప్యూటీ సీఎం పోస్ట్ లో ఉండటంతో ప్రకాష్ రాజ్ విమర్శలకు నేషనల్ లెవల్ లో అటెన్షన్ దక్కుతోంది.

ప్రస్తుతం ఈ ట్వీట్స్ కి జనసేన అభిమానులు, పార్టీ శ్రేణులు తమ స్టైల్ లో కౌంటర్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియా అంతా ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అన్న రేంజ్ లో ట్రోలింగ్ వార్ నడుస్తోంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ సమస్యలపై వస్తున్న వార్తలకు ప్రకాష్ రాజ్ ట్వీట్స్ తోడవ్వడంతో పాలిటిక్స్ మరింత కాక రేపుతున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More