Prakash Raj: ఫ్రెండ్ అంటూ ప్రధాని మోదీకి ప్రకాష్ రాజ్ చురకలు.. రాజీనామా అడగరు కుర్చీ లాక్కుంటారంటూ వార్నింగ్
Prakash Raj: ప్రధాని నరేంద్ర మోదీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డాడు. ఫ్రెండ్ అంటూనే మోదీని వెక్కిరిస్తూ మీ కుర్చీ లాక్కుంటారంటూ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Prakash Raj: విద్యార్థులపై కేసులు పెట్టి వారి జీవితాలను, కెరీర్‌ను నాశనం చేయవద్దంటూ బహుభాషా నటుడు, వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ప్రధాని మోదీ షేర్ చేసిన ఒక వీడియోపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ అత్యంత ఘాటుగా రీ-కౌంటర్ ఇచ్చారు.

దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో శరవేగంగా వైరల్ అవుతోంది.
"పిల్లలు తప్పు చేస్తే మందలించాలి గానీ.. కేసులు పెడతారా?"
ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనల్లో కొందరు తనను, తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించారని, అయినా తాను వారిని క్షమించాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ హలో ఫ్రెండ్స్ అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ప్రకాష్ రాజ్ ఒక ఎమోషనల్ వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ దేశంలోని తల్లిదండ్రుల తరఫున మాట్లాడారు.
పిల్లలు ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు లేదా పెద్దలను నిందించినప్పుడు తల్లిదండ్రులుగా వారిని హెచ్చరిస్తాం తప్ప, వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వేధించమని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. విఫలమైన సిస్టమ్ వల్ల తమ తోటి విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం చూసి నిరాశ చెందిన యువత అలా ఆక్రోశం వెళ్లగక్కుతుంటే, వారిపై లాఠీ ఛార్జీలు, పోలీస్ కేసులు ప్రయోగించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
"నేడు రాజీనామా అడిగినవారు.. రేపు పవర్ లాక్కుంటారు!"
ప్రస్తుతం దేశంలో విద్యార్థులు కేవలం రాజీనామా మాత్రమే డిమాండ్ చేస్తున్నారని, కానీ పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో దేశం, తల్లిదండ్రులు, ఈ సమాజం మొత్తం కలిసి పవర్‌నే లాక్కునే ప్రమాదం ఉందని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు. ఒక విద్యార్థిని లేదా యువకుడిని వేధింపులకు గురిచేస్తే వారి కుటుంబం, బంధువులు, స్నేహితులు అందరూ మానసికంగా గాయపడతారని ఆయన గుర్తుచేశారు.
మరోవైపు ఫరీదాబాద్‌కు చెందిన ఒక మహిళ నిరసన సమయంలో ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తదుపరి విచారణ కోసం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ తరహా పోలీస్ చర్యలపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఫ్రెండ్లీగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సోషల్ మీడియాలో మోదీకి ఓపెన్ లెటర్
ఇండియన్ సినిమాలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డులు అందుకున్న ప్రకాష్ రాజ్.. సామాజిక, రాజకీయ అంశాలపై నిరంతరం తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు. 'కంచివరమ్', 'ఇరువర్' వంటి సినిమాల్లో నటనకు జాతీయ పురస్కారాలు పొందిన ఆయన, ప్రస్తుతం విలక్షణమైన పాత్రలతో పాటు సామాజిక కోణంలో వచ్చే చర్చల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కక్షసాధింపు చర్యలు ఆపాలని, వారి సున్నిత మనస్సులను అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు నెట్టింట తీవ్రమైన చర్చకు దారితీసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


