200 కోట్ల న‌ష్ట ప‌రిహారం.. హ‌నుమాన్ ప్రొడ్యూస‌ర్‌తో వివాదం.. ప్ర‌తీకారం కోస‌మంటూ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ క్లారిటీ

హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వివాదంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజా రియాక్షన్ వైరల్ గా మారింది. తనపై వస్తున్న ఆరోపణలు ప్రతీకారపూరితమైనవని ప్రశాంత్ అన్నాడు. 

Published on: Nov 2, 2025, 21:36:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ తో వివాదంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రియాక్షన్ వైరల్ గా మారింది. ఈ వ్యవహారంలో తన మీద చేసిన ఆరోపణలు అసత్యం, నిరాధారం, ప్రతీకారపూరితమైనవే అని ప్రశాంత్ పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. హనుమాన్ మూవీని ప్రొడ్యూస్ చేసిన ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది.

ప్రశాంత్ వర్మ (x/PrasanthVarma)
ప్రశాంత్ వర్మ (x/PrasanthVarma)

తీవ్రంగా ఖండిస్తున్నా

మీడియాలో వస్తున్న వార్తలపై ప్రశాంత్ వర్మ అసహనం వ్యక్తం చేశాడు. ‘‘కొన్ని మీడియా పోర్టల్స్, సోషల్ మీడియా పేజీలు, న్యూస్ ఛానెల్స్ ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఫిర్యాదు వివరాలను, అలాగే నా సమాధానంలోని కొన్ని భాగాలను మాత్రమే ప్రచురించడం, ప్రసారం చేయడం నా దృష్టికి వచ్చింది. ఈ పక్షపాత, బాధ్యతారహిత, ఏకపక్ష సమాచారం ప్రసారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని ప్రశాంత్ వర్మ ప్రెస్ నోట్ లో తెలిపాడు.

తీర్పు కోసం

‘‘నాకు, ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఉన్న వివాదం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్/తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోషియేషన్ ముందు విచారణలో, న్యాయ పరిశీలనలో ఉంది. ఈ సందర్భంలో అన్ని పక్షాలు ఆ ఫోరమ్ తీర్పు కోసం ఎదురు చూడటం మాత్రమే సమంజసం. మీడియా ద్వారా వివాదాన్ని తీర్చే ప్రయత్నం చేయడం సరైంది కాదు’’ అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు.

ఆరోపణలు అసత్యం

ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోవద్దని ప్రశాంత్ వర్మ కోరాడు. ‘‘నా మీద చేసిన అన్ని ఆరోపణలు అసత్యం, నిరాధారం, ప్రతీకారపూరితమైనవే అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. అన్ని మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ ఫారమ్స్, సోషల్ మీడియా ఛానెల్స్, న్యూస్ ఛానెల్స్ ఈ అంశంపై ఊహాగానాలు ఆధారంగా ప్రచారం చేయడం మానుకోవాలని కోరుతున్నా’’ అని ప్రశాంత్ వర్మ తెలిపాడు.

అసలు వివాదం ఏంటీ?

2024లో వచ్చిన హనుమాన్ భారీ విజయాన్ని అందుకుంది. రూ.295 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో దర్శకుడు, నిర్మాతల మధ్య ఆర్థిక పరంగా విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధీర, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలను ప్రశాంత్ వర్మ తన బ్యానర్ పై చేస్తానని హామీ ఇచ్చారని ఫిలిం చాంబర్ కు ఇచ్చిన ఫిర్యాదులో నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

రూ.200 కోట్ల నష్ట పరిహారం

ఇందు కోసం రూ.10.34 కోట్ల అడ్వాన్స్ కూడా తీసుకున్నారని చెప్పాడు. మరోవైపు ప్రశాంత్ సూచనతో రూపొందించిన అక్టోపస్ ప్రాజెక్ట్ కోసం రూ.10.23 కోట్లు ఖర్చు చేసినా అవసరమైన ఎన్ఓసీ ఇవ్వలేదన్నాడు. దీంతో మొత్తం రూ.20.57 కోట్ల రీఫండ్ తో పాటు రూ.200 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశాడు.

మరోవైపు ప్రశాంత్ వర్మ ప్రముఖ బ్యానర్లపై ఈ ప్రాజెక్ట్ లను తెరకెక్కిస్తున్నాడని, వివాదానికి ఎండ్ కార్డు పడేవరకూ ఆ ప్రాజెక్టలను నిలిపివేయాలని నిరంజన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు కలకలం రేపింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More