...
...
Next Story

Prime Video OTT: ప్రైమ్ వీడియోలోకి మరో కామెడీ వెబ్ సిరీస్.. ప్రేమ, అల్గారిథమ్స్ చుట్టూ తిరిగే ఫన్ డ్రామా..

Prime Video OTT: ప్రైమ్ వీడియోలోకి ఓ కామెడీ వెబ్ సిరీస్ వస్తోంది. దీని పేరు మా కా సమ్ (Maa ka Sum). ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని తాజాగా ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది. ప్రేమ, అల్గారిథమ్స్ చుట్టూ తిరిగే సిరీస్ ఇది.

Published on: Mar 25, 2026 01:59 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Prime Video OTT: ఓ లైట్ హార్టెడ్ కామెడీతో కూడిన ఎమోషనల్ వెబ్ సిరీస్ కోసం చూస్తున్నారా? అయితే ప్రైమ్ వీడియో మీకోసం అలాంటిదే ఓ సిరీస్ ను తీసుకొస్తోంది. ప్రేమ, అల్గారిథమ్స్ కాన్సెప్ట్‌తో వస్తున్న లైట్-హార్టెడ్ డ్రామా 'మా కా సమ్' (Maa Ka Sum). ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 3న ప్రైమ్ వీడియోలో వరల్డ్‌వైడ్‌గా ప్రీమియర్ కాబోతోంది. యూనోయా ఫిల్మ్స్ బ్యానర్‌పై బబితా ఆశీవాల్ ప్రొడ్యూస్ చేసిన ఈ ప్రైమ్ ఒరిజినల్ ఎమోషనల్ డ్రామాను నికోలస్ ఖార్కోంగోర్ డైరెక్ట్ చేశాడు.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Prime Video OTT: ప్రైమ్ వీడియోలోకి మరో కామెడీ వెబ్ సిరీస్.. ప్రేమ, అల్గారిథమ్స్ చుట్టూ తిరిగే ఫన్ డ్రామా..
Prime Video OTT: ప్రైమ్ వీడియోలోకి మరో కామెడీ వెబ్ సిరీస్.. ప్రేమ, అల్గారిథమ్స్ చుట్టూ తిరిగే ఫన్ డ్రామా..

రవీందర్ రంధావా, సుమ్రిత్ షాహి రాసిన ఈ మా కా సమ్ అనే ఈ వెబ్ సిరీస్ స్టోరీలో.. ఒక 19 ఏళ్ల మ్యాథ్స్ జీనియస్ ఒక ఇంపార్టెంట్ మిషన్ మీద ఉంటాడు. ఇందులో మోనా సింగ్, మిహిర్ అహుజా, అంగిరా ధర్, రణ్‌వీర్ బ్రార్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ మెయిన్ లీడ్స్ చేశారు.

ప్రైమ్ వీడియో ఈ వెబ్ సిరీస్‌ను ఏప్రిల్ 3న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఇది హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సబ్‌టైటిల్స్‌తో ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది.

'మా కా సమ్' స్టోరీ ఏంటంటే..

ఈ హార్ట్ టచింగ్ వెబ్ సిరీస్.. ఒక సింగిల్ మదర్, ఆమె 19 ఏళ్ల కొడుకు మధ్య ఉండే బంధాన్ని చాలా కొత్తగా చూపిస్తుంది. వీళ్లిద్దరి మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్, నమ్మకం, ఒకరికొకరు ఇచ్చుకునే ఫ్రీడమ్ ఈ కథలో హైలైట్.

ఈ వెబ్ సిరీస్ లో మిహిర్ అహుజా ప్లే చేసిన అగస్త్య క్యారెక్టర్ ఒక తెలివైన మ్యాథ్స్ జీనియస్. అతను ఈ ప్రపంచాన్ని కేవలం గ్రాఫ్‌లు, నంబర్స్, అల్గారిథమ్స్ ద్వారా మాత్రమే చూస్తుంటాడు. అగస్త్య దృష్టిలో ప్రతి ప్రాబ్లమ్‌కు ఒక లాజికల్ సొల్యూషన్ ఉంటుంది.

అగస్త్య చాలా కేర్‌ఫుల్‌గా వేసుకున్న ప్లాన్ మెల్లగా ఒక ఫన్నీ, హార్ట్ టచింగ్ జర్నీగా మారుతుంది. లాజిక్‌కు, నిజమైన ఎమోషన్స్‌కు మధ్య జరిగే వార్, ఊహించని పరిణామాలు ఈ సిరీస్‌ను ఇంట్రెస్టింగ్‌గా మారుస్తాయి. మంచి హ్యూమర్, ఎమోషన్స్‌తో పాటు కొంచెం మ్యాథ్స్ టచ్ ఇచ్చి.. తల్లీకొడుకుల బంధాన్ని ఈ సిరీస్ చాలా ఫ్రెష్‌గా మన ముందుకు తీసుకొస్తోంది.

మేకర్స్ ఏమంటున్నారంటే..

ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఒరిజినల్స్ నిఖిల్ మధోక్ దీనిపై మాట్లాడుతూ.. బంధాలను ఆధారంగా చేసుకుని వచ్చే కథలకు ఎప్పుడూ ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆ ఎమోషన్స్‌కు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఈ సిరీస్‌లో తల్లీకొడుకుల బంధాన్ని చాలా డీప్‌గా, ఒక రేర్ ఫ్రెష్‌నెస్‌తో చూపించాం. వాళ్ల మధ్య ఉండే ప్రేమ, చిన్న చిన్న గొడవలు, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా చాలా నిజాయితీగా తీశాం. మోనా, మిహిర్ తమ క్యారెక్టర్స్‌లో అదరగొట్టేశారు. ఏప్రిల్ 3న ఈ కథను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఆడియన్స్‌కు అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe