...
...
Next Story

Prime Video Releases: ప్రైమ్ వీడియోలో ఒకే రోజు వస్తున్న 5 క్రేజీ వెబ్ సిరీస్, మూవీస్, షోలు.. తేజ సజ్జా ట్రైటర్స్ కూడా..

Prime Video Releases: ప్రైమ్ వీడియోలో ఈవారం అక్టోబర్ 15, 16 తేదీల్లో కంటెంట్ వరద పారనుంది. తెలుగు రియాల్టీ షో ది ట్రైటర్స్ తోపాటు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ కూడా అలరించనున్నాయి. అవేంటో చూడండి.

Published on: Oct 14, 2026, 21:00:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Prime Video Releases: ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రేక్షకులను అలరించడానికి మరోసారి అదిరిపోయే కంటెంట్‌తో సిద్ధమైంది. ఈ వారం ప్రైమ్ వీడియోలో హిందీ కంటెంట్ పెద్దగా లేకపోయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న డాక్యుమెంటరీలు, సస్పెన్స్ రియాలిటీ షోలు, యాక్షన్ కామెడీ సినిమాలు డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తున్నాయి.

Prime Video Releases: ప్రైమ్ వీడియోలో ఒకే రోజు వస్తున్న 5 క్రేజీ వెబ్ సిరీస్, మూవీస్, షోలు.. తేజ సజ్జా ట్రైటర్స్ కూడా..
Prime Video Releases: ప్రైమ్ వీడియోలో ఒకే రోజు వస్తున్న 5 క్రేజీ వెబ్ సిరీస్, మూవీస్, షోలు.. తేజ సజ్జా ట్రైటర్స్ కూడా..

ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా వస్తున్న 'ది ట్రైటర్స్' రియాలిటీ షోతో పాటు స్పోర్ట్స్ లవర్స్‌ను ఆకట్టుకునేలా 'హోమ్‌టౌన్ జెయింట్స్' స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీకెండ్ ప్లాన్ చేసుకునేవాళ్లకు ఈ లైనప్ పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

ప్రైమ్ వీడియో రిలీజెస్ ఇలా..

తేజ సజ్జా ది ట్రైటర్స్ (అక్టోబర్ 15)

హోమ్‌టౌన్ జెయింట్స్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ (అక్టోబర్ 16)

మాస్టర్‌ప్లాన్ (యాక్షన్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ) (అక్టోబర్ 16)

ప్రైమ్ వీడియోలో ఈ వారం స్ట్రీమింగ్ అయ్యే టాప్ సిరీస్, షోలు

1. ది ట్రైటర్స్ (The Traitors) - అక్టోబర్ 15: హిందీలో సంచలన విజయం సాధించిన 'ది ట్రైటర్స్' షో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది. తేజ సజ్జా (Teja Sajja) హోస్ట్‌గా రాబోతున్న ఈ సస్పెన్స్ రియాలిటీ షో అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రగతి, హర్షవర్దన్, చిన్మయి శ్రీపాదలాంటి సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేస్తున్నారు.

2. హోమ్‌టౌన్ జెయింట్స్ (Hometown Giants) - అక్టోబర్ 16: ఇది ఒక అద్భుతమైన 6 ఎపిసోడ్‌ల స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్. జూనియర్ హాకీ ఫ్రాంచైజీ లోపలి విషయాలు, క్రీడాకారుల కష్టాలను ఈ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.

4. ఫ్రెండ్స్ సెక్స్ అండ్ గేమ్స్ (Friends Sex and Games) - అక్టోబర్ 16: జర్మన్ భాషలో తెరకెక్కిన ఈ బోల్డ్ అండ్ ఎంటర్‌టైనింగ్ సిరీస్‌లో చాలా కాలం తర్వాత కలుసుకున్న ఇద్దరు స్నేహితులు తమ పార్ట్‌నర్స్‌ను మార్చుకునే సరికొత్త కాన్సప్ట్‌తో రానుంది.

5. మార్లియా మెండోంకా: ఆల్ ది ఫీల్స్ (Marília Mendonça: All the Feels) - అక్టోబర్ 16: ప్రసిద్ధ సర్టెనెజో మ్యూజిక్ సూపర్‌స్టార్ మార్లియా మెండోంకా వ్యక్తిగత జీవితం, ఆమె మ్యూజికల్ జర్నీ ఆధారంగా రూపొందించిన పర్చుగీస్ డాక్యుమెంటరీ సిరీస్ ఇది.

ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో 'రైజ్ అండ్ ఫాల్స్' రెండో సీజన్ కూడా ట్రెండింగ్‌లో ఉంది. విభిన్న భాషల నుంచి వస్తున్న ఈ కొత్త కంటెంట్ ఓటీటీ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks