Prime Video Web Series: ప్రేమంటే ఈక్వేషనా ఎమోషనా.. తల్లికి అల్గారిథమ్‌తో పర్ఫెక్ట్ మ్యాచ్ చూసే కొడుకు.. మా కా సమ్ సిరీస్

Prime Video Web Series: ప్రైమ్ వీడియోలోకి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. మా కా సమ్ (Maa Ka Sum) అనే వెరైటీ టైటిల్ తో రాబోతున్న ఈ సిరీస్.. అల్గారిథమ్ తో తన తల్లికి పర్ఫెక్ట్ మ్యాచ్ చూసే కొడుకు చుట్టూ తిరుగుతుంది.

Published on: Mar 27, 2026, 19:14:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మోనా సింగ్, మిహిర్ అహుజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'మా కా సమ్' ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక సింగిల్ మదర్, ఆమె కొడుకు మధ్య ఉండే క్యూట్ అండ్ ఎమోషనల్ బాండింగ్‌ను బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆడియన్స్‌ను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ కొత్త వెబ్ సిరీస్ ఏప్రిల్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Prime Video Web Series: ప్రేమంటే ఈక్వేషనా ఎమోషనా.. తల్లికి అల్గారిథమ్‌తో పర్ఫెక్ట్ మ్యాచ్ చూసే కొడుకు.. మా కా సమ్ సిరీస్
Prime Video Web Series: ప్రేమంటే ఈక్వేషనా ఎమోషనా.. తల్లికి అల్గారిథమ్‌తో పర్ఫెక్ట్ మ్యాచ్ చూసే కొడుకు.. మా కా సమ్ సిరీస్

'ప్రాజెక్ట్ మామ్' అసలు కథ ఏంటంటే..

ఈ ట్రైలర్‌లో 19 ఏళ్ల మ్యాథ్స్ జీనియస్ అగస్త్య (మిహిర్ అహుజా) క్యారెక్టర్‌ను మేకర్స్ భలేగా పరిచయం చేశారు. మ్యాథ్స్ అయినా, ప్రేమ అయినా.. రెండింటికీ ఒకటే ఈక్వేషన్ అంటూ అతను చెప్పే డైలాగ్ భలే క్యాచీగా ఉంది. తన సింగిల్ మదర్ వినీత (మోనా సింగ్) కు ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్టనర్‌ను వెతకడం కోసం అతను ఏకంగా 'ప్రాజెక్ట్ మామ్' అనే ఒక మిషన్‌ను స్టార్ట్ చేస్తాడు.

ఆ తర్వాత జరిగే కథ అంతా చాలా ఫన్నీగా, ఫాస్ట్‌గా సాగుతుంది. లాజిక్‌కు, ఎమోషన్స్‌కు మధ్య జరిగే వార్‌ను ఇందులో బాగా చూపించారు. అగస్త్య చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసిన ఈక్వేషన్స్ అన్నీ ఎలా తలకిందులయ్యాయో ఈ సిరీస్‌లో మనం చూడొచ్చు.

సరిగ్గా ఇదే టైమ్‌లో ఇరా (అంగిరా ధర్) అనే ఒక కొత్త మ్యాథ్స్ ప్రొఫెసర్ ఎంట్రీ ఇవ్వడంతో అగస్త్య మిషన్‌కు మరింత బలం దొరుకుతుంది. వీళ్లిద్దరూ కలిసి వినీతకు పర్ఫెక్ట్ మ్యాచ్‌ను సెట్ చేయడానికి ఒక అల్గారిథమ్‌ను రెడీ చేసే పనిలో పడతారు. కానీ ఎప్పుడైతే అతని పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్‌లో ఎమోషన్స్ ఎంటర్ అవుతాయో.. అప్పుడు అగస్త్య వేసిన ఫార్ములా మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అసలు ఏ ఈక్వేషన్ కూడా సాల్వ్ చేయలేని సమస్యలు అతనికి ఎదురవుతాయి.

నా కెరీర్‌లోనే డిఫరెంట్ రోల్: మోనా సింగ్

వెబ్ సిరీస్‌లో అగస్త్య తల్లి వినీత పాత్రలో నటించిన మోనా సింగ్ తన ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంది.

నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అన్నింటికంటే వినీత పాత్ర చాలా డిఫరెంట్, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే.. ఈ కథ చాలా రిఫ్రెషింగ్‌గా, కొత్తగా ఉండటమే అని ఆమె చెప్పింది.

ఒక సింగిల్ మదర్, ఆమె కొడుకు మధ్య ఉండే మంచి ఫ్రెండ్‌షిప్, ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం, అలాగే ప్రేమను ఒక కొత్త కోణంలో చూడటం లాంటివి ఈ కథలో మెయిన్ హైలైట్స్. ఇవే నన్ను ఈ ప్రాజెక్టు వైపు వెంటనే లాగాయి అని మోనా వివరించింది.

వినీత తన లోపాలను దాచుకోకుండా ఉండటం, మళ్లీ ప్రేమను వెతుక్కోవడానికి ట్రై చేయడం, ముఖ్యంగా తన కొడుకు లైఫ్‌ను చూసే ఆ డిఫరెంట్ యాంగిల్‌ను నమ్మడం నాకు బాగా నచ్చాయి అని చెప్పింది.

అంతేకాదు.. ఈ వెబ్ సిరీస్‌లో కామెడీ, ఎమోషన్స్‌ను చాలా అందంగా బ్యాలెన్స్ చేశారు. ఒక నిజాయితీ గల, హార్ట్ టచింగ్ స్టోరీని ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా భలేగా చెప్పారు. చాలామంది ఈ కథలో తమ సొంత రిలేషన్షిప్స్‌ను చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఏప్రిల్ 3 నుంచి ప్రైమ్ వీడియోలో మాత్రమే రాబోతున్న 'మా కా సమ్' సిరీస్‌ను మీరంతా చూసి ఎంజాయ్ చేస్తారని నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.

అగస్త్యలో ఆ క్వాలిటీ భలే నచ్చింది: మిహిర్ అహుజా

అగస్త్య క్యారెక్టర్ చేసిన మిహిర్ అహుజా మాట్లాడుతూ.. అగస్త్యలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే.. అతనిలో ఎంత కాన్ఫిడెన్స్, టాలెంట్ ఉన్నప్పటికీ, లోపల మాత్రం అతను తన తల్లిని అమితంగా ప్రేమించే ఒక మామూలు కొడుకు. తన తల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తపన పడే కుర్రాడు అని చెప్పాడు.

తల్లితో అతనికి ఒక రేర్ ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. వాళ్ల బంధంలో ఒక నిజాయితీ, కంఫర్ట్ ఉంటుంది. అది చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది అని మిహిర్ అన్నాడు. ఏప్రిల్ 3న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫీల్ గుడ్ సిరీస్ గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More