టార్చర్ పెట్టే రాజమౌళి షూటింగ్.. ఆయన చేసిన మెసేజ్ అదే.. ఇలాంటి సినిమా లాంఛ్ చూడలేదు: పృథ్వీరాజ్ సుకుమార‌న్‌

నటుల నుంచి తనకు కావాల్సిన యాక్టింగ్ వచ్చేంతవరకూ రాజమౌళి వదిలిపెట్టడనే సంగతి తెలిసిందే. ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ కూడా అదే మాట అన్నారు. గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్లో ఆయన స్పీచ్ వైరల్ గా మారింది. 

Nov 15, 2025, 20:55:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ కీ రోల్ ప్లే చేస్తున్నారు. భయంకరమైన విలన్ గా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి కన్ఫామ్ చేశారు. ఇవాళ (నవంబర్ 15) హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ స్పీచ్ వైరల్ గా మారింది.

పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ (jiohotstar)
పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ (jiohotstar)

పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ స్పీచ్

శనివారం జరుగుతున్న గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్లో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ కామెంట్లు వైరల్ గా మారాయి. ‘‘గత పాతికేళ్లలో ఎన్నో ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేశా. కానీ ఇంత లెవల్లో, ఇంత మంది జనంతో ఓ సినిమా లాంఛ్ కావడం మాత్రం చూడలేదు’’ అని తెలుగులో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ చెప్పారు.

అదే మెసేజ్

‘‘చిన్నప్పటి నుంచి మలయాళ సినిమాల నుంచి ఎన్నో కథలు వింటూ పెరిగా. గొప్ప గర్వంగా మారే సినిమా కోసం మేం పని చేస్తున్నాం. ఈ సెలబ్రేషన్స్ లో భాగం కావడం నాకు ఎంతో ప్రత్యేకం. రాజమౌళి నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నా తర్వాతి సినిమాలో విలన్ క్యారెక్టర్ అద్భుతంగా ఉండబోతుంది. నువ్వు చేస్తావా? అని మెసేజ్ లో ఉంది’’ అని పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ తెలిపారు.

అయిదు నిమిషాలకే

‘‘రాజమౌళి సర్ నుంచి మెసేజ్ రాగానే కచ్చితంగా చేస్తానని వెళ్లి ఆఫీస్ లో కలిశా. స్టోరీ చెప్పారు. అయిదు నిమిషాలకే అదిరిపోయింది. ఆ తర్వాత మూడు గంటలు అలాగే వింటూ ఉండిపోయా. అంతలా ఎలా ఊహించుకోగలుగుతున్నారు. ఎలా ఆలోచించగలుగుతున్నారు అని ఆశ్చర్యపోయా. ప్రతి నటుడికి రాజమౌళి సినిమాలో చేయాలని ఉంటుంది. నాపై పెట్టుకున్న నమ్మకానికి థ్యాంక్స్. టార్చర్ పెట్టే షూటింగ్ ప్రాసెస్’’ అని పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ పేర్కొన్నారు.

ఎంతో స్పెషల్

‘‘థియేటర్లో నేను చూసిన తొలి తెలుగు సినిమా పోకిరి. అక్కడి నుంచి మీరు (మహేష్ బాబు) మీ లెగసీని బిల్డ్ చేసుకున్న తీరు ఎంతో స్పెషల్. ఈ సినిమాకు మీరు అర్హులు. అలాగే ప్రియాంక చోప్రాను మందాకినిగా చూడటం ఎంతో సంతోషంగా ఉంది’’ అని పృథ్వీరాజ్ ముగించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More