తెలుగులో మరో కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ వస్తోంది. ఈ సినిమా పేరు ప్రేమంటే. యువ హీరో ప్రియదర్శి, ఆనంది లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్, సుమ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ మూవీ ట్రైలర్ సోమవారం (నవంబర్ 17) రిలీజ్ అయింది.
ప్రేమంటే ట్రైలర్ ఎలా ఉందంటే?

నటుడు ప్రియదర్శి ఈ మధ్యే సారంగపాణి జాతకం, మిత్ర మండలి సినిమాలతో వచ్చి బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇప్పుడీ నటుడు ప్రేమంటే అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన గత రెండు సినిమాల్లాగే పూర్తిగా కామెడీనే నమ్ముకొని వస్తున్న సినిమాలా ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ఇందులో ఆనంది ఫిమేల్ లీడ్ గా కనిపించింది. నవనీత్ శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి కాకపోవడంతో ఇబ్బంది పడే మది (మధుసూదన్) అనే పాత్రలో ప్రియదర్శి కనిపించాడు. ఎన్నో సంబంధాలు చెడిపోయిన తర్వాత చివరికి అతనికి పెళ్లి అవుతుంది. అయితే అప్పుడే అతని కష్టాలు మొదలవుతాయి. ఇంతలో పెళ్లంటేనే పప్పన్నం.. ఆ పప్పే మాడిపోయిన తర్వాత ఇంకేం లాభం అంటూ సుమా ఎంట్రీ ఇస్తుంది. సారం లేని సంసారం వద్దు.. విడాకులే ముద్దు అని ఆమె చెప్పే డైలాగుతోనే ఈ ట్రైలర్ ముగుస్తుంది.
ప్రేమంటే మూవీ గురించి..
ప్రియదర్శి, ఆనంది లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ ప్రేమంటే. ఈ సినిమాను నవనీత్ శ్రీరామ్ డైరెక్ట్ చేయగా.. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ వచ్చే శుక్రవారం (నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫుల్ కామెడీతో సాగిపోయిన ట్రైలర్ చూస్తుంటే.. మూవీపై అంచనాలు పెరిగాయి.
థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా మూవీ తీసినట్లు కనిపిస్తోంది. థ్రిల్లు ప్రాప్తిరస్తు అనే ట్యాగ్‌లైన్ ఈ మూవీకి పెట్టడం విశేషం. మరి ఈ సినిమాతో అయినా ప్రియదర్శి మళ్లీ గాడిలో పడతాడో లేదో చూడాలి.
{{/usCountry}}థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా మూవీ తీసినట్లు కనిపిస్తోంది. థ్రిల్లు ప్రాప్తిరస్తు అనే ట్యాగ్‌లైన్ ఈ మూవీకి పెట్టడం విశేషం. మరి ఈ సినిమాతో అయినా ప్రియదర్శి మళ్లీ గాడిలో పడతాడో లేదో చూడాలి.
{{/usCountry}}