Priyanka Chopra: హాలీవుడ్ టాప్ స్టార్ ఎంజెలీనా జోలీతో ప్రియాంక చోప్రా క్రేజీ ప్రాజెక్ట్.. 'వారణాసి' సెట్స్‌పై అప్డేట్
Priyanka Chopra: ప్రియాంకా చోప్రా హాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతోంది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి వారణాసి చేస్తున్న ఆమె.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి కూడా వెల్లడించింది. ఆ విశేషాలు చూడండి.
Priyanka Chopra: హాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా.. ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టార్ ఎంజెలీనా జోలీతో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి అంతర్జాతీయ సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మన గ్లోబల్ బ్యూటీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తోంది.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'వారణాసి' (Varanasi) లో ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పై ఉండగానే, ఆమె తన అప్‌కమింగ్ గ్లోబల్ ప్రాజెక్ట్స్, రాజమౌళి సినిమా రేంజ్ గురించి పంచుకున్న విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎంజెలీనా జోలీతో కొలాబరేషన్.. సస్పెన్స్‌లో ఫ్యాన్స్
ఫార్చ్యూన్ ఇండియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా తన హాలీవుడ్ కెరీర్‌కు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్‌ను కన్ఫర్మ్ చేసింది. హాలీవుడ్ ఎ-లిస్టర్, ఆస్కార్ విన్నర్ ఎంజెలీనా జోలీతో తాను కలిసి పనిచేయబోతున్నట్లు ఆమె స్పష్టం చేసింది.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించడానికి ప్రియాంక నిరాకరించడంతో.. ఇది ఒక భారీ హాలీవుడ్ సినిమానా, అంతర్జాతీయ బ్రాండ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయినా లేక ఇద్దరూ కలిసి చేయబోయే ఏదైనా గ్లోబల్ చారిటీ ప్రోగ్రామా అనే సస్పెన్స్ ఫ్యాన్స్‌లో నెలకొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంజెలీనా జోలీతో పాటు పెనెలోప్ క్రూజ్, సల్మా హాయెక్ లాంటి అంతర్జాతీయ నటీమణులు తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తారని ప్రియాంక కొనియాడింది.
రూ.1400 కోట్ల బడ్జెట్.. రాజమౌళి 'వారణాసి' విజువల్ వండర్
మరోవైపు ఇండియన్ సినిమా చరిత్రలోనే ముందెన్నడూ ఎరుగని సరికొత్త రికార్డులతో 'వారణాసి' చిత్రం రూపుదిద్దుకుంటోంది. డైరెక్టర్ రాజమౌళి ఈ గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్‌ను ఏకంగా రూ.1200 నుండి రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం జార్జియా, అంటార్కిటికా, ఆఫ్రికా లోని దట్టమైన అడవులు, హైదరాబాద్‌లోని భారీ సెట్స్‌లో గత మూడేళ్లుగా రేయింబగళ్లు షూటింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా స్కేల్ గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. "మేము ఈ సినిమాతో ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన, గతంలో ఎవరూ చూడని ఒక భారీ గ్లోబల్ విజువల్ వండర్‌ను క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. గత మూడేళ్లుగా మేము పడుతున్న కష్టాన్ని ప్రపంచానికి చూపించబోతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇది కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ గ్లోబల్ రిలీజ్ కాబోతోంది" అని స్పష్టం చేసింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
"ఆ త్యాగాల రోజులు అయిపోయాయి".. భర్త నిక్ జోనస్ కామెంట్స్
కెరీర్ ప్రారంభంలో స్క్రిప్టులు తన కోసం ప్రత్యేకంగా రాసేవారు కాదని, కానీ దశాబ్దాల కష్టం తర్వాత ఇప్పుడు తనకు నచ్చిన ప్రాజెక్ట్‌ను ఎంచుకునే స్వేచ్ఛను సంపాదించుకున్నానని ప్రియాంక ఎమోషనల్ అయింది. ఇటీవల తన భర్త నిక్ జోనస్ ప్రముఖ సింగర్ బియాన్సే కోట్‌ను గుర్తుచేస్తూ.. "నువ్వు చేసిన త్యాగాలకు ఇప్పుడు సరైన ప్రతిఫలం దక్కింది. నువ్వు సక్సెస్ అవతలి వైపు ఉన్నావు" అని చెప్పినట్లు ప్రియాంక గుర్తుచేసుకుంది. ప్రస్తుతం తాను స్వయంగా ప్రాజెక్ట్‌లను క్రియేట్ చేసే స్టేజ్‌లో ఉన్నానని చెప్పింది.
'వారణాసి'తో పాటు ప్రియాంక చోప్రా చేతిలో ప్రస్తుతం పలు అంతర్జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' ఫేమ్ ఆర్లాండో బ్లూమ్‌తో కలిసి ఒక పీపీపీ కో-ప్రొడక్షన్ ఫిల్మ్‌లో నటిస్తుండగా, ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ బయోగ్రాఫికల్ డ్రామా 'అమ్రి' (Amri) లోనూ ఆమె లీడ్ రోల్ పోషిస్తోంది.
వీటితో పాటు విల్ ఫెర్రెల్, జాక్ ఎఫ్రాన్, రెజినా హాల్ వంటి హాలీవుడ్ స్టార్స్‌తో కలిసి నికోలస్ స్టోలర్ దర్శకత్వంలో వస్తున్న 'జడ్జ్‌మెంట్ డే' (Judgment Day)లోనూ ప్రియాంక నటిస్తోంది. ఈ క్రేజీ గ్లోబల్ ప్రాజెక్ట్స్‌తో ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం అనిపిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


