Priyanka Chopra Daughter: హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తుంటారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. వీలున్నప్పుడల్లా తన గారాలపట్టిని షూటింగ్ సెట్స్‌కు కూడా వెంట తీసుకెళ్తుంటారు.

తాజాగా గురువారం (నవంబర్ 19) ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బీచ్ వెకేషన్, ఫ్యామిలీ మూమెంట్స్, షూటింగ్ సెట్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. అందులో చిన్నారి మాల్తీ తన ముద్దుముద్దు మాటలతో గాయత్రి మంత్రం పఠిస్తున్న వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.
అంతేకాకుండా ప్రియాంక షూటింగ్ సెట్స్‌లో 'ప్రొడ్యూసర్' అని రాసి ఉన్న హెడ్‌ఫోన్స్ పెట్టుకుని, స్క్రిప్ట్ చదువుతున్న మాల్తీ క్యూట్ ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తల్లి ఒడిలో కూర్చుని గాయత్రి మంత్రం.. ఫిదా అవుతున్న నెటిజన్లు
ప్రియాంక షేర్ చేసిన ఈ వీడియోలో, ఇంట్లోని చిన్న పూజా మందిరం ముందు ప్రియాంక కూర్చోగా.. ఆమె ఒడిలో కూర్చున్న నాలుగేళ్ల మాల్తీ మేరీ “ఓం భూర్భువస్వః” అంటూ ఎంతో స్పష్టంగా, శ్రావ్యంగా గాయత్రి మంత్రం పఠించింది.
మంత్రం పూర్తి కాగానే ప్రియాంక ఎంతో సంతోషంతో “చాలా అందంగా పాడావు” అంటూ కూతురిని ప్రశంసించారు. “ఈమధ్య కాలంలో.. బిజీ షెడ్యూల్స్ మధ్య ఒక కలల ప్రదేశంలో.. సౌండ్ ఆన్ చేసి వినండి” అంటూ ప్రియాంక ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
విదేశాల్లో పెరుగుతున్నప్పటికీ తన కూతురికి భారతీయ సంప్రదాయాలను నేర్పిస్తున్న ప్రియాంకను అభిమానులు కొనియాడుతున్నారు. బ్రిటిష్/అమెరికన్ యాక్సెంట్లో మాల్తీ పాడిన తీరు పాప్ స్టార్లా ఉందని, భవిష్యత్తులో తను గొప్ప సింగర్ అవుతుందని కామెంట్లు పెడుతున్నారు.
షూటింగ్ సెట్స్‌లో 'ప్రొడ్యూసర్' అవతారమెత్తిన మాల్తీ
{{/usCountry}}విదేశాల్లో పెరుగుతున్నప్పటికీ తన కూతురికి భారతీయ సంప్రదాయాలను నేర్పిస్తున్న ప్రియాంకను అభిమానులు కొనియాడుతున్నారు. బ్రిటిష్/అమెరికన్ యాక్సెంట్లో మాల్తీ పాడిన తీరు పాప్ స్టార్లా ఉందని, భవిష్యత్తులో తను గొప్ప సింగర్ అవుతుందని కామెంట్లు పెడుతున్నారు.
షూటింగ్ సెట్స్‌లో 'ప్రొడ్యూసర్' అవతారమెత్తిన మాల్తీ
{{/usCountry}}ఈ ఫోటో ఆల్బమ్‌లో బీచ్ ఒడ్డున ఇసుకలో బొమ్మలు గీస్తున్న మాల్తీ.. సముద్రంలో కుటుంబంతో కలిసి సర్ఫింగ్ చేస్తున్న దృశ్యాలతో పాటు షూటింగ్ సెట్స్‌లోని కొన్ని బిహైండ్ ది సీన్స్ (BTS) ఫోటోలు కూడా ఉన్నాయి.
ఒక ఫోటోలో మాల్తీ చెవులకు "ప్రొడ్యూసర్" అని రాసి ఉన్న హెడ్‌ఫోన్స్ పెట్టుకుని, ఎంతో సీరియస్‌గా సినిమా స్క్రిప్ట్ పేపర్లను పరిశీలిస్తూ కనిపించింది. గతంలో 'హెడ్స్ ఆఫ్ స్టేట్' షూటింగ్ సమయంలోనూ, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎస్.ఎస్. రాజమౌళి సినిమా షూటింగ్ సమయంలోనూ ప్రియాంక తన కూతురిని భారత్‌కు తీసుకొచ్చారు. సెట్స్‌లో ఉండే 'క్రాఫ్ట్ సర్వీసెస్'ను నటీనటుల తరహాలోనే మాల్తీ కూడా ముద్దుగా 'క్రాఫ్టీ' అని పిలుస్తుందని ప్రియాంక గతంలో ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పారు.
రాజమౌళి - మహేష్ బాబు 'వారణాసి'తో గ్రాండ్ రీఎంట్రీ
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ చిత్రసీమలోకి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'రుద్ర'గా, పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ'గా నటిస్తున్న ఈ గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో ప్రియాంక 'మందాకిని' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.
సుమారు రూ.1,000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ షూటింగ్ ఇటీవలే పూర్తికాగా, ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ (VFX) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉగాది కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న 'వారణాసి' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.