Producer vs Director: నాని సినిమా వివాదం.. రూ.5 కోట్లు ఇవ్వాలంటూ తమిళ డైరెక్టర్‌కు తెలుగు ప్రొడ్యూసర్ డిమాండ్
Producer vs Director: నాని హీరోగా రూపొందాల్సిన ఒక భారీ ప్రాజెక్ట్ బడ్జెట్ గొడవతో ఆగిపోవడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా నిర్మాతల మండలి వరకు వెళ్ళింది. బడ్జెట్‌ను అమాంతం పెంచేసిన తమిళ దర్శకుడిపై తెలుగు నిర్మాత చిత్తూరి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
Producer vs Director: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. కానీ ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకముందే బడ్జెట్ లెక్కలు తేడా కొట్టి అటకెక్కిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి (డాన్ ఫేమ్) కథను నానికి వినిపించడం, ఆయనకు నచ్చి నిర్మాత చిత్తూరి శ్రీనివాస్ దగ్గరకు పంపడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే ముహూర్తం షాట్ పడకముందే బడ్జెట్ కొండలా పెరిగిపోవడంతో ఈ సినిమా వివాదానికి కేంద్రబిందువైంది.

రూ.65 కోట్ల నుంచి 150 కోట్లకు.. ఎలా?
నాని నటించాల్సిన ఈ సినిమాను రెమ్యూనరేషన్లు కాకుండా కేవలం రూ.65 కోట్లతో పూర్తి చేస్తానని దర్శకుడు సిబి చక్రవర్తి నిర్మాతకు హామీ ఇచ్చారు. ఈ లెక్క నిర్మాతకు కూడా ఓకే అనిపించడంతో, చెన్నైలో ఆఫీస్ ఓపెన్ చేసి మరీ రైటర్ల టీమ్‌ను దర్శకుడికి అప్పగించారు చిత్తూరి శ్రీనివాస్.
కథా చర్చలు ముగిసి మరోసారి నరేషన్ ఇచ్చాక హీరో నాని కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కథ సిద్ధమయ్యాక బడ్జెట్ అమాంతం రూ.150 కోట్లకు చేరుతుందని దర్శకుడు చెప్పడంతో నిర్మాత ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రూ.65 కోట్లు ఎక్కడ.. 150 కోట్లు ఎక్కడ? అని ప్రశ్నిస్తే, అందుకు సంబంధించిన సరైన లెక్కలు కూడా దర్శకుడు చూపించలేదని సమాచారం.
"ముహూర్తానికే ఇలా ఉంటే.. విడుదల నాటికి ఇంకెంత?"
"ముహూర్తం కూడా జరగకుండానే బడ్జెట్ రూ.65 కోట్ల నుంచి 150 కోట్లకు పెరిగితే, సినిమా పూర్తయ్యేసరికి అది ఇంకెక్కడికి వెళ్తుందో ఊహించడం కష్టం," అని నిర్మాత తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్ట్ రిస్క్‌లో పడుతుందని గ్రహించిన నిర్మాత.. హీరోతో మాట్లాడి పరస్పర అంగీకారంతో ప్రాజెక్ట్‌ను రద్దు చేసుకున్నారు. అయితే గత రెండున్నర ఏళ్లుగా ఈ సినిమా కోసం ఆఫీస్ ఖర్చులు, అడ్వాన్స్‌లు, జీతాలు, వడ్డీల రూపంలో దాదాపు రూ. 5 కోట్లు ఖర్చయ్యాయని నిర్మాత వాదిస్తున్నారు.
తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు
ఈ రూ.5 కోట్లను తిరిగి చెల్లించాలని కోరుతూ చిత్తూరి శ్రీనివాస్ తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించారు. అయితే దర్శకుడు సిబి చక్రవర్తి మాత్రం కేవలం తను తీసుకున్న అడ్వాన్స్‌ను మాత్రమే తిరిగి ఇస్తానని, మిగిలిన ఖర్చులతో తనకు సంబంధం లేదని చెబుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దర్శకుడు సిబి చక్రవర్తి ఇటీవలే రజనీకాంత్ #Thalaivar173 ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాని ఇంకా ఆశతోనే ఉన్నారా?
నిర్మాత చిత్తూరి శ్రీనివాస్‌తో గొడవ జరిగినప్పటికీ.. నానికి మాత్రం సిబి చక్రవర్తి రాసుకున్న కథపై ఇంకా నమ్మకం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కథను ఎలాగైనా వెండితెరపైకి తేవాలని, అందుకే మరో నిర్మాతను ఈ దర్శకుడితో టచ్‌లో ఉండమని నాని కోరినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ఎలా సర్దుమణుగుతుందో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సిబి చక్రవర్తి, చిత్తూరి శ్రీనివాస్ మధ్య వివాదం ఏంటి?
సినిమా బడ్జెట్‌ను మొదట చెప్పిన దానికంటే (65 కోట్లు) రెట్టింపు కంటే ఎక్కువగా (150 కోట్లు) దర్శకుడు పెంచేయడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీని కోసం పెట్టిన 5 కోట్ల రూపాయల ఖర్చును తిరిగి ఇవ్వాలని నిర్మాత కోరుతున్నారు.
2. నాని సినిమా ఎందుకు ఆగిపోయింది?
నేచురల్ స్టార్ నాని ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా నటించాల్సి ఉంది. కథ నచ్చినప్పటికీ బడ్జెట్ ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్ట్ రద్దయింది.
3. #Thalaivar173 సినిమా నుంచి సిబి చక్రవర్తిని తీసేశారా?
అవును, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ 173వ సినిమా బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు లేదంటే తీసేసినట్లు సమాచారం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


