మగవారిలో వచ్చే సంతాన సమస్యలపై తెరకెక్కిన సినిమానే సంతాన ప్రాప్తిరస్తు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.
సంతాన ప్రాప్తిరస్తు విశేషాలు

విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా జంటగా నటించిన ఈ సినిమా ఇవాళ (నవంబర్ 14) థియేటర్లలో విడుదలైంది. అయితే, ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు సంబంధించిన విశేషాలను నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి పంచుకున్నారు.
ఈ సమస్య కోసమా బాధపడింది
-ఈ సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది. మంచి మెసేజ్ చేరుతుంది. మనం ఈ సమస్య కోసమా ఇంత బాధపడింది అనుకుంటారు. టైటిల్ విషయంలో మొదట్లే ఏంటీ టైటిల్ అనుకునేవారు కూడా ట్రైలర్ రిలీజ్ అయ్యాక "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టైటిల్ బాగుంది అంటున్నారు.
శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు
-స్క్రిప్ట్ దశలో నాకు, సంజీవ్‌కు ఫస్ట్ వచ్చిన టైటిల్ సంతాన ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని ముందుగా టైటిల్ అనుకున్నా, అది లెంతీగా ఉందని "సంతాన ప్రాప్తిరస్తు" ఫిక్స్ చేశాం.
ప్రేక్షకుల టేస్ట్ మారింది
-పాండమిక్ ముందు మనకు వరల్డ్ సినిమా తెలియదు. కరోనా టైమ్‌లో మనమంతా ఓటీటీల్లో డిఫరెంట్ జోనర్స్ కంటెంట్ చూశాం. గతంలో తెలుగులో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్‌తో మూవీస్ ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఆదరణ పొందలేదు. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్, ట్రెండ్ మారింది.
ఇంట్లోవాళ్లకే చూపించలేకపోయేవాన్ని
-"సంతాన ప్రాప్తిరస్తు" ట్రైలర్ను ఓ నాలుగేళ్ల కిందట అయితే నేను మా కుటుంబ సభ్యులకే చూపించలేకపోయేవాడిని. ఇప్పుడు మా అబ్బాయిలు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడగలుగుతున్నారు. ఇది సీక్రెట్గా చర్చించుకునే విషయం కాదు. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో అత్యధిక ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి.
ఓపెన్‌గా మాట్లాడుకోవాలి
-మన సొసైటీలో ఉన్న ఈ సమస్య గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో "సంతాన ప్రాప్తిరస్తు" 2 చేయాలనుకుంటున్నాం.
మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
{{/usCountry}}-మన సొసైటీలో ఉన్న ఈ సమస్య గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో "సంతాన ప్రాప్తిరస్తు" 2 చేయాలనుకుంటున్నాం.
మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
{{/usCountry}}-మా మూవీని మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చెబుతున్నాం. ఎందుకంటే సినిమాలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. మా మూవీ మ్యూజిక్ ఆల్ ఇండియాలో 15వ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుంటే, ట్రైలర్ ఆలిండియాలో 32వ ప్రేస్‌లో ట్రెండ్ అవుతోంది.
డబ్బులు ఛార్జ్ చేయలేదు
-ఇతరుల పాటల్ని తమ సినిమాలో వాడుకుంటే తప్పకుండా ఎన్‌వోసీ తీసుకోవాలి. మా మధుర ఆడియో సాంగ్స్‌ను ఇతరుల మూవీస్‌లో ఉపయోగించుకుంటామని అడిగితే నేనెప్పుడు డబ్బులు ఛార్జ్ చేయలేదు. మిగతా ఆడియో కంపెనీస్ పెద్దఎత్తున ఛార్జ్ చేస్తుంటాయి. పాత పాటల్లో ఏ చిన్న బిట్ ఉపయోగించుకున్నా ఎన్‌వోసీ తీసుకోవడం మంచిది.