Naga Vamsi: అల వైకుంఠపురంలో తర్వాత ఆ రేంజ్ మూవీ.. మళ్లీ మళ్లీ చెప్తున్నా ఈసారి కూడా మిస్ అవ్వదు: సూర్య మూవీపై నాగవంశీ

Naga Vamsi: నాగవంశీ మరోసారి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఓ ట్వీట్ చేశారు. సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ రేపు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ మూవీని అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో తో పోలుస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Published on: Aug 13, 2026, 14:31:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Naga Vamsi: తమిళ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons) రేపే (ఆగస్ట్ 14) థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ కి కొన్ని గంటల ముందే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చేసిన ఒక ఎక్స్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాపై తనకు ఉన్న మాస్ కాన్ఫిడెన్స్ చూసి ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది.

Naga Vamsi: అల వైకుంఠపురంలో తర్వాత ఆ రేంజ్ మూవీ.. మళ్లీ మళ్లీ చెప్తున్నా ఈసారి కూడా మిస్ అవ్వదు: సూర్య మూవీపై నాగవంశీ
Naga Vamsi: అల వైకుంఠపురంలో తర్వాత ఆ రేంజ్ మూవీ.. మళ్లీ మళ్లీ చెప్తున్నా ఈసారి కూడా మిస్ అవ్వదు: సూర్య మూవీపై నాగవంశీ

ఆరేళ్ల తర్వాత ఆ రేంజ్ కాన్ఫిడెన్స్.. నాగవంశీ పోస్ట్ వైరల్

"మా బ్యానర్ నుంచి వస్తున్న ఒక సినిమాపై ఇంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వచ్చి సరిగ్గా ఆరేళ్లు అవుతోంది. రేపు థియేటర్లలో మీరు అది స్వయంగా చూస్తారు. ఈ సినిమా చూసి నవ్వుతారు, ఏడుస్తారు, ప్రతి ఎమోషన్ అనుభవిస్తారు. థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ క్యారెక్టర్లను మీ గుండెల్లో తీసుకెళ్తారు" అంటూ నాగవంశీ రాసుకొచ్చారు.

సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే 2020లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ 'అల వైకుంఠపురములో' టైమ్‌లో నాగవంశీ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో, ఇప్పుడు ఈ సూర్య సినిమా విషయంలోనూ అదే లెవెల్ నమ్మకంతో ఉన్నారు. అందుకే తన ట్వీట్ కు అప్పటి పోస్ట్ ను యాడ్ చేయడం విశేషం. మళ్లీ మళ్లీ చెప్తున్నా.. ఈసారి కూడా మిస్ అవ్వదు అని నాగవంశీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ మ్యాజిక్ రిపీట్ కాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెంకీ అట్లూరి హ్యాట్రిక్ హిట్ కొడతారా?

'సార్', 'లక్కీ భాస్కర్' లాంటి వరుస హిట్లతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసిన వెంకీ అట్లూరి.. ఈసారి సూర్య లాంటి వర్సటైల్ నటుడితో కంప్లీట్ ఎమోషనల్ అండ్ డ్రామా ఎంటర్‌టైనర్ తో ముందుకు వస్తున్నారు. సూర్య మార్కెట్, వెంకీ అట్లూరి మేకింగ్ స్టైల్ కలిసి ఈ మూవీపై విపరీతమైన హైప్ పెంచేశాయి.

సినిమాలో సూర్య సరసన 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, ఫ్రెష్ పెయిరింగ్ ట్రైలర్‌లో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ప్రమోషనల్ కంటెంట్ మొత్తానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆడియన్స్‌లో ఆసక్తి రెట్టింపు అయింది.

పవర్ ఫుల్ కాస్టింగ్.. జీవి ప్రకాష్ మ్యూజిక్

ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సీనియర్ నటీనటులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతీ క్యారెక్టర్ కి కథలో మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని సమాచారం.

జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఎమోషనల్ జర్నీకి మెయిన్ పిల్లర్ గా నిలవబోతోంది. రీసెంట్ గా రిలీజైన సాంగ్స్ తో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రేపు థియేటర్లలో వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ సినిమా సూర్య కెరీర్ లో మరో ల్యాండ్ మార్క్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

విశ్వనాథ్ అండ్ సన్స్ విశేషాలు

సినిమా పేరు: విస్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons)

నటీనటులు: సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, వైవా హర్ష

దర్శకత్వం: వెంకీ అట్లూరి

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్)

సంగీతం: జీవి ప్రకాష్ కుమార్

రిలీజ్ డేట్: ఆగస్టు 14, 2026

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More