Nagavamsi: మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశానంటారు.. అందుకే వెనక్కి తగ్గా.. నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు
Nagavamsi: యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 'బ్లాస్ట్ జోన్' చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా ఎందుకు ప్రమోట్ చేయలేదు? మెగా ఫ్యామిలీ సినిమా 'పెద్ది' కి భయపడే ప్రమోషన్స్ ఆపేశారా? ఈ ప్రశ్నలకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓపెన్‌గా పంచుకున్న ఇండస్ట్రీ సీక్రెట్స్ వైరల్ అవుతున్నాయి.
Nagavamsi: టాలీవుడ్‌లో స్ట్రెయిట్ అండ్ ఓపెన్ టాక్‌కు కేరాఫ్ అడ్రస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. తాజాగా అక్కినేని అఖిల్ నటిస్తున్న 'లెనిన్' చిత్ర ప్రమోషన్ల వేదికగా అతను చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్ సర్కిల్స్ ను షేక్ ఇస్తున్నాయి. బ్లాస్ట్ జోన్ మూవీ ప్రమోషన్స్ పై ప్రశ్నలకు నాగవంశీ కామెంట్లు వైరల్ అయ్యాయి.

బ్లాస్ట్ జోన్ ప్రమోషన్లు
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో కోలీవుడ్‌లో వచ్చిన మూవీ ‘బ్లాస్ట్’. ఇది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ 'బ్లాస్ట్' చిత్రాన్ని తెలుగులో 'బ్లాస్ట్ జోన్' (Blast Zone) పేరుతో నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయితే, ఈ సినిమాకు కనీస ప్రమోషన్స్ కూడా చేయకపోవడం వెనుక ఉన్న 'మెగా' రహస్యాన్ని అతను తాజాగా బయటపెట్టాడు.
నాగవంశీ సేఫ్ గేమ్!
తెలుగులో 'బ్లాస్ట్ జోన్' రిలీజ్ అయిన టైమ్‌లోనే మెగా ఫ్యామిలీకి చెందిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (Peddi) కూడా థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే ప్రశ్నకు నాగవంశీ తాజాగా లెనిన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఎంతో ప్రాక్టికల్‌గా సమాధానమిచ్చారు.
మెగా ఫ్యామిలీని
"ఒకవైపు మెగా ఫ్యామిలీకి చెందిన అంత పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే, నేను ఈ చిన్న డబ్బింగ్ సినిమాను అగ్రెసివ్‌గా ప్రమోట్ చేయడం బిజినెస్ పరంగా కరెక్ట్ కాదు. ఒకవేళ నేను ఆ సమయంలో దీనికి భారీగా పబ్లిసిటీ ఇచ్చి ఉంటే.. 'నాగవంశీ కావాలనే ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు, దానికి పోటీగా నిలబెడుతున్నాడు' అని ఇండస్ట్రీలో అనవసరపు గాసిప్స్ వచ్చేవి. అందుకే వివాదాలు ఎందుకని వెనక్కి తగ్గానని’’ నాగవంశీ చెప్పాడు.
ప్రమోట్ చేసుంటే
ఇండస్ట్రీ ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం.. 'బ్లాస్ట్ జోన్' చిత్రానికి థియేటర్లలో మంచి టాక్ వచ్చింది. ఒకవేళ సితార టీం గనుక దీనికి గట్టిగా హైప్ ఇచ్చి ఉంటే, బి అండ్ సి సెంటర్లలో వసూళ్లు మరింత పెరిగేవి. అయితే, టాలీవుడ్‌లో థియేటర్ల కంట్రోల్, మెగా ఫ్యామిలీతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా నాగవంశీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం చిన్న సినిమాను బలిచేశారని విమర్శిస్తున్నారు.
నాగవంశీ ఓపెన్ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. మెగా వర్సెస్ సితార ఈక్వేషన్ల గురించి అతను ఓపెన్‌గా మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు తమిళంలో బ్లాస్ట్ మూవీ, తెలుగులో పెద్ది సినిమా కలెక్షన్ల మోత మోగించిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


