మెగాస్టార్‌కు 4 కోట్ల అడ్వాన్స్- ఇంకా రిలీజ్ కానీ మూవీ- ఫస్ట్ టైటిల్ జానీ వాకర్- వివాదంపై నోరు విప్పిన నిర్మాత

నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రాల నిర్మాత శైలేంద్ర సింగ్ 'షూబైట్' సినిమా వివాదంపై నోరు విప్పారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు అడ్వాన్స్‌గా రూ. 4 కోట్లు ఇచ్చినా, దర్శకుడు షూజిత్ సర్కార్ తనను కాదని వేరే సంస్థతో సినిమా చేశారని, ఫలితంగా ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ వెలుగు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Published on: Feb 1, 2026, 12:06:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందీ చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదాల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ‘షూబైట్’ (Shoebite) సినిమా ఒకటి. షూటింగ్ పూర్తయినా ఇప్పటికీ చిత్రం విడుదల అవ్వకపోడానికి వెనుక ఉన్న అసలు కారణాలను ప్రముఖ నిర్మాత శైలేంద్ర సింగ్ తాజాగా బయటపెట్టారు. 'పేజ్ 3', 'ట్రాఫిక్ సిగ్నల్' వంటి జాతీయ అవార్డు చిత్రాలను నిర్మించిన ఆయన.. అమితాబ్ బచ్చన్, దర్శకుడు షూజిత్ సర్కార్‌లపై సంచలన ఆరోపణలు చేశారు.

మెగాస్టార్‌కు 4 కోట్ల అడ్వాన్స్- ఇంకా రిలీజ్ కానీ మూవీ- ఫస్ట్ టైటిల్ జానీ వాకర్- వివాదంపై నోరు విప్పిన నిర్మాత
మెగాస్టార్‌కు 4 కోట్ల అడ్వాన్స్- ఇంకా రిలీజ్ కానీ మూవీ- ఫస్ట్ టైటిల్ జానీ వాకర్- వివాదంపై నోరు విప్పిన నిర్మాత

రూ. 4 కోట్ల ఒప్పందం.. కానీ!

ఒక ఇంటర్వ్యూలో శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ, "నిజానికి నేను షూజిత్ సర్కార్‌తో కలిసి ‘జానీ వాకర్’ (షూబైట్ ఫస్ట్ టైటిల్) అనే కథను డెవలప్ చేశాను. ఈ కథను అమితాబ్ బచ్చన్‌కు వినిపించి, ఆయన్నే హీరోగా ఖరారు చేశాం. ఇందుకోసం బిగ్ బికి అడ్వాన్స్‌గా రూ. 4 కోట్లు చెల్లించాను. అగ్రిమెంట్ కూడా పూర్తయింది. షూజిత్‌ను స్వయంగా నేనే జల్సాకు తీసుకెళ్లి అమితాబ్‌కు పరిచయం చేశాను" అని వివరించారు.

అయితే, ఆ తర్వాత ఏబీ కార్పొరేషన్ (AB Corp) ఈ సినిమాను తామే నిర్మిస్తామని ప్రతిపాదించిందని, కానీ తాను కేవలం అమితాబ్‌ను నటుడిగానే కోరుకున్నానని, నిర్మాణ భాగస్వామ్యం ఇవ్వడానికి నిరాకరించానని శైలేంద్ర సింగ్ తెలిపారు.

దర్శకుడిని, సినిమాను కోల్పోయాను..

ఆ వివాదం తర్వాత షూజిత్ సర్కార్ తనతో కాకుండా అమితాబ్ బచ్చన్‌తో సన్నిహితమయ్యారని శైలేంద్ర సింగ్ ఆరోపించారు. "ఆ రోజు నుంచి షూజిత్ నా చేయి జారిపోయారు. ఇప్పటికీ అమితాబ్ నటించే యాడ్స్ అన్నీ ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు" అని శైలేంద్ర సింగ్ తెలిపారు.

"చివరికి నా కథను ‘జానీ మస్తానా’ పేరుతో రోనీ స్క్రూవాలా నిర్మించారు. అదే తర్వాత ‘షూబైట్’గా మారింది. కానీ న్యాయపరమైన చిక్కుల వల్ల ఆ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు. షూజిత్, అమితాబ్, దియా మీర్జాలు నటించిన ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో అందరికీ తెలుసు" అని శైలేంద్ర సింగ్ పేర్కొన్నారు.

విమానంలో ఎదురుపడ్డ బిగ్ బి..

ఈ వివాదంపై కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలోనే ఒకసారి విమానంలో తనకు అమితాబ్ బచ్చన్ ఎదురయ్యారని శైలేంద్ర సింగ్ గుర్తుచేసుకున్నారు. "నేను ఆయన్ని కలిసి ‘సార్, ఏంటి ఇదంతా?’ అని అడిగాను. దానికి ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు, కేవలం చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఆయన హుందాతనం అలాంటిది, ఏమీ మాట్లాడలేకపోయారు" అని శైలేంద్ర సింగ్ అన్నారు.

కాగా, న్యాయపరమైన వివాదాల కారణంగా 2012లో కోర్టు స్టే ఇవ్వడంతో 'షూబైట్' ల్యాబ్‌కే పరిమితమైంది. అనంతరం షూజిత్ సర్కార్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో 'పికు', 'గులాబో సితాబో' వంటి విజయవంతమైన చిత్రాలు రావడం గమనార్హం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More