నటుడు శివాజీ హీరోయిన్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెబుతూ నోరు జారిన సంగతి తెలుసు కదా. ఇప్పటికీ అతని కామెంట్స్ పై డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ పతంగ్ మూవీ సక్సెస్ మీట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అతడు ఏమన్నాడో చూడండి.
శివాజీకి ఎస్కేఎన్ కౌంటర్

నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పై పతంగ్ మూవీ సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ స్పందించాడు. అక్కడే ఉన్న మూవీ హీరోయిన్ ను చూస్తూ.. “ఏంటి ఇలా మామూలు డ్రెస్ వేసుకొచ్చావ్.. కాస్త గ్లామరస్ గా రావచ్చు కదా. మీకు అమ్మాయిలు, హీరోయిన్లు ఏ డ్రెస్సు కంఫర్టబుల్, కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుందో అవే వేసుకోండి. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినక్కర్లేదు. ఈ డ్రెస్సు వేసుకుంటే బాగుంటారు.. ఈ డ్రెస్సు వేసుకుంటే ఇదైపోతారు అనేది ఏమీ లేదు. ఏం జరిగినా మన మనసు మంచిదైతే మంచిగా ఉంటాం. మన ఉద్దేశం మంచిదైతే మంచి జరుగుతుంది తప్ప డ్రెస్సుల్లో ఉండదు” అని అతడు అనడం గమనార్హం.
మహిళా కమిషన్ ముందుకు శివాజీ
శివాజీ వ్యాఖ్యలను సుమోటోగా (Suo moto) స్వీకరించడంతోపాటు వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ అతనికి నోటీసులు జారీ చేసింది. మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
దీంతో శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చుకున్నాడు. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని, ఆవేశంలో దొర్లిన మాటలని ఆయన కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తనపై ఎవరో కుట్ర పన్ని కావాలనే ఇలా చేస్తున్నారని తర్వాత అతడు మీడియాతో అనడం గమనార్హం.
వివాదం ముదరడంతో శివాజీ ఒక సెల్ఫీ వీడియోను గతంలో విడుదల చేశాడు. "నా ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదు. హీరోయిన్లను జనం ఇబ్బంది పెడుతున్న వీడియోలు చూసి ఆవేదనతో అలా మాట్లాడాను. కానీ నేను వాడిన పదాలు తప్పు. అందుకు నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను" అని శివాజీ పేర్కొన్నాడు.
{{/usCountry}}వివాదం ముదరడంతో శివాజీ ఒక సెల్ఫీ వీడియోను గతంలో విడుదల చేశాడు. "నా ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదు. హీరోయిన్లను జనం ఇబ్బంది పెడుతున్న వీడియోలు చూసి ఆవేదనతో అలా మాట్లాడాను. కానీ నేను వాడిన పదాలు తప్పు. అందుకు నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను" అని శివాజీ పేర్కొన్నాడు.
{{/usCountry}}మొత్తానికి 'దండోరా' ఈవెంట్ కాస్తా శివాజీ మెడకు చుట్టుకుంది. సీనియర్ నటుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.