Psychological Thriller OTT: ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. 'పంచాయత్' సచివ్ జీ ఊహించని అవతారం.. స్ట్రీమింగ్ ఆరోజే

Psychological Thriller OTT: 'పంచాయత్' ఫేమ్ జితేంద్ర కుమార్, మరాఠీ స్టార్ నటి ప్రియా బాపట్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'దాలింబ్' (Dalimb) ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5)లో డిసెంబర్ 4, 2026 నుంచి ఈ ఒరిజినల్ హిందీ చిత్రం నేరుగా స్ట్రీమింగ్ కానుంది.

Published on: Nov 18, 2026, 22:05:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Psychological Thriller OTT: 'పంచాయత్' వెబ్ సిరీస్‌లో 'సచివ్ జీ'గా, 'కోటా ఫ్యాక్టరీ'లో 'జీతూ భయ్యా'గా తన సహజసిద్ధమైన కామెడీ, ఎమోషనల్ నటనతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు జితేంద్ర కుమార్. అయితే ఈసారి తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన, ఇంతకుముందెన్నడూ చూడని ఇంటెన్స్ అవతారంలో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు.

Psychological Thriller OTT: ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. 'పంచాయత్' సచివ్ జీ ఊహించని అవతారం.. స్ట్రీమింగ్ ఆరోజే
Psychological Thriller OTT: ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. 'పంచాయత్' సచివ్ జీ ఊహించని అవతారం.. స్ట్రీమింగ్ ఆరోజే

డిసెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్

జితేంద్ర కుమార్, ప్రముఖ నటి ప్రియా బాపట్ ప్రధాన పాత్రల్లో నటించిన హై-స్టేక్స్ సైకలాజికల్ థ్రిల్లర్ 'దాలింబ్' (Dalimb) విడుదల తేదీని జీ5 (ZEE5) అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 4, 2026 నుంచి ఈ చిత్రం హిందీ జీ5లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. "భయం ఆవహించినప్పుడు నమ్మకమే దారి చూపుతుంది.. సంకట్ మోచన్ సరికొత్త రూపం" అంటూ మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

'సంకట్ మోచన్' క్యాప్షన్‌తో ఆసక్తికర పోస్టర్

బుధవారం (నవంబర్ 18) జీ5 తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో 'దాలింబ్' కొత్త ప్రమోషనల్ ఆర్ట్‌వర్క్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను వెల్లడించింది. “భయం ఆవహించినప్పుడు, నమ్మకమే దారి చూపుతుంది.. సంకట్ మోచన్ సరికొత్త రూపాన్ని అందిస్తున్నాం. జై హనుమాన్!” అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో ప్రఖ్యాత 'సంకట్ మోచన్' భజనను ఒక ప్రత్యేక రీతిలో రీ-ఇమాజిన్ చేసి ఉపయోగించినట్లు తెలుస్తోంది.

దాలింబ్ కథేంటంటే? జానపద కళలకు, అర్బన్ థ్రిల్లర్‌కు మేళవింపు

ప్రియా అవెన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన 'దాలింబ్' ముంబై మహానగరం నేపథ్యంలో సాగే ఒక పారలల్-ట్రాక్ సైకలాజికల్ థ్రిల్లర్. తప్పిపోయిన తన చిన్నారిని కాపాడుకునేందుకు సూరజ్ (జితేంద్ర కుమార్) అనే వ్యక్తి ప్రమాదకర పరిస్థితుల నడుమ సాగించే ఉత్కంఠభరిత పోరాటం ఒకవైపు.. అత్యంత ఒత్తిడితో కూడిన ఈ కేసును ఛేదించే మహిళా పోలీస్ అధికారిణి (ప్రియా బాపట్) దర్యాప్తు మరోవైపు సమాంతరంగా సాగుతాయి.

ఈ సినిమా ప్రమోషనల్ పోస్టర్లు, టీజర్‌ను గమనిస్తే.. తీరప్రాంత జానపద కళారూపాలైన యక్షగానం, భూతకోల తరహా మేకప్, ముసుగులు కథలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది. జానపద విశ్వాసాలు, జ్ఞాపకాలు, భ్రమలకు ఒక గ్రిప్పింగ్ అర్బన్ థ్రిల్లర్‌ను జోడించి దర్శకురాలు ఈ కథను తీర్చిదిద్దారు.

దాలింబ్ మూవీ విశేషాలు

ఎల్లిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తనూజ్ గార్గ్, అతుల్ కస్బేకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో జితేంద్ర కుమార్, ప్రియా బాపట్‌లతో పాటు క్షితీష్ దాటే, కవిన్ డేవ్, సాయి ప్రసాద్, హరీష్ కులకర్ణి, సాగర్ యాదవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

జార్జ్ జోసెఫ్ సంగీతం అందించారు. విశేషమేమిటంటే, డిసెంబర్ 3న ప్రైమ్ వీడియోలో జితేంద్ర కుమార్ నటించిన 'పంచాయత్ సీజన్ 5' విడుదలవుతుండగా, మరుసటి రోజే అంటే డిసెంబర్ 4న 'దాలింబ్' జీ5లోకి రాబోతుండటంతో ఓటీటీ ప్రేక్షకులకు బ్యాక్-టు-బ్యాక్ విందు లభించనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More