Tamil Thriller OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్.. మూడేళ్లకు తెలుగులో.. అడవిలో సీత పోరాటం!

Tamil Thriller OTT: ఓటీటీలోకి మరో తమిళ సినిమా వచ్చేసింది. దట్టమైన అడవి నేపథ్యంలో సైకలాజికల్, సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘సాయవనం’ మూవీ మూడేళ్లకు ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ కథ ఏంటీ? ఎందుకు చూడాలి? అనే విషయాలపై లుక్కేయండి. 

Published on: Nov 12, 2026, 13:46:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Tamil Thriller OTT: ఓటీటీ ప్రియుల కోసం ఆహా వీడియో ఎప్పటికప్పుడు విభిన్నమైన కంటెంట్ ను అందిస్తూనే ఉంది. కేవలం తెలుగు సినిమాలే కాకుండా, ఇతర భాషల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇవాళ (నవంబర్ 12) తమిళంలో రూపొందిన ఓ క్రేజీ డ్రామా అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'సాయవనం' డిజిటల్ ప్రీమియర్ గా ఆహాలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్.. మూడేళ్లకు తెలుగులో.. అడవిలో అదిరే ట్విస్ట్ లు!
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్.. మూడేళ్లకు తెలుగులో.. అడవిలో అదిరే ట్విస్ట్ లు!

సాయవనం స్టోరీ

'సాయవనం' సినిమా కథ అంతా దట్టమైన అడవి నేపథ్యంలో.. ఒంటరితనం, నమ్మకద్రోహం, మనుషుల మధ్య జరిగే ఎమోషనల్ సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో 'సీత' అనే మహిళదే ప్రధాన పాత్ర. ముత్తు అనే వ్యక్తి లారీ కొనేందుకు వెళ్లి మూడేళ్ల పాటు కనిపించకుండా పోతాడు. దీంతో సీత ఒంటరిగా మిగిలిపోతుంది.

సీత పోరాటం

ఆ సమయంలో సురుళి అనే వ్యక్తి ఆమెకు దగ్గరవుతాడు. అయితే అనుకోకుండా కొన్నాళ్ల తర్వాత ముత్తు తిరిగి రావడం, ఆ తర్వాత దొంగిలించిన డబ్బు, నమ్మకద్రోహం, పగ.. ఇలా అనూహ్య మలుపులతో సాయవనం సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మోసపోయిన ఓ మహిళ తనకంటూ ఓ ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం, తన బాధను శక్తిగా, నిశ్శబ్దాన్ని బలంగా ఎలా మార్చుకుంది అనేది ఈ సాయవనం మూవీలో చాలా సహజంగా చూపించారు.

అడవిలో భయం

సాయవనం సినిమాలో సీత పాత్రలో దేవనంద షాజిలాల్ (Devananda Shajilal) అద్భుతమైన నటన కనబరిచారు. ముత్తుగా సౌందర రాజా, సురుళిగా సంతోష్ దామోదరన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అప్పుకుట్టి, జానకి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రామచంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు.

అడవి అందాలను, అక్కడ ఉండే భయానక వాతావరణాన్ని కెమెరాలో అద్భుతంగా బంధించారు. పోలి వర్గీస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సైకలాజికల్, సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలోని సస్పెన్స్ ను మరింత పెంచుతుంది.

తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్

సైకలాజికల్ థ్రిల్లర్, డ్రామా జానర్ లో తెరకెక్కిన సాయవనం సినిమాను ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆహా వీడియోలో (Aha Video) ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా ఒకేసారి అటు తమిళంతో పాటు ఇటు తెలుగు డబ్బింగ్ వర్షన్ లో కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.

ఎందుకు చూడాలంటే?

అసలు అడవిలో ఏం జరిగింది? సైకలాజికల్ గా మనుషుల వ్యక్తిత్వం ఎలా మారిందనేది ఈ సాయవనం సినిమాలో గొప్పగా చూపించారు. మనుషుల మధ్య ఉండే బంధాలు, పరిస్థితులు వారిని ఎలా మార్చేస్తాయి అనే అంశాలను మేకర్స్ చాలా నేచురల్ గా ప్రెజెంట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం, మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే 'సాయవనం' మూవీని ఆహాలో చూసేయండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More