Puri Jagannadh: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో ఓ పాడ్‌కాస్ట్ మొదలు పెట్టిన విషయం తెలుసు కదా. తాజాగా అందులో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలపై మాట్లాడుతూ.. దారి తప్పిన ఆధునిక సమాజాన్ని నిలదీసేలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూరి మ్యూజింగ్స్: అడవి బిడ్డల అద్భుతమైన జీవితం

డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పుడూ తన మాటలతో సమాజాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తుంటారు. ఈ తాజా వీడియోలో ఆయన గిరిజన సంస్కృతులు (Tribal Cultures), ప్రస్తుతం మనం జీవిస్తున్న ఆధునిక జీవనశైలి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించారు. ఆయన చెప్పిన విషయాలను బట్టి చూస్తే, మనం నాగరికులం అని చెప్పుకుంటూనే ఎంత అనాగరికంగా బతుకుతున్నామో అర్థమవుతుంది.
ప్రకృతితో అనుబంధం
“వాళ్లకు మనకంటే తెలివి తేటలు, టెక్నాలజీ లేకపోవచ్చు. కానీ వాళ్లు మనకంటే ఎంతో ఆనందంగా ఉంటారు. గిరిజన ప్రజలకు ప్రకృతితో ఒక విడదీయలేని బంధం ఉంటుంది. అడవులు, జంతువులు, మారుతున్న కాలాలను వాళ్ళు చాలా లోతుగా అర్థం చేసుకుంటారు. వాళ్లది పూర్తిగా సస్టైనబుల్ లైఫ్ స్టైల్. అంటే ప్రకృతికి ఏ హానీ చేయకుండా, ప్రకృతి ఇచ్చే దాంతోనే వాళ్ళు సంతృప్తిగా బతుకుతారు. కానీ మనం మాత్రం అడవులను నరికి పాడు చేస్తున్నాం” అని పూరి అన్నారు.
నేను కాదు.. మనం
“ఆధునిక సమాజంలో 'నేను', 'నాది' అనే స్వార్థం పెరిగిపోయింది. దీనివల్ల మనమందరం ఒకరికొకరు సంబంధం లేకుండా ఒంటరి అయిపోతున్నాం. కానీ ట్రైబల్ కల్చర్‌లో 'మనం', 'మన తండా' అనే భావం బలంగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా అందరూ కలిసి ఎదురు నిలబడతారు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించాలని వాళ్ళు అస్సలు అనుకోరు" అని పూరి చెప్పారు.
అద్భుతమైన నాలెడ్జ్ సిస్టమ్స్
“మనకు తెలివితేటలు, టెక్నాలజీ ఉండొచ్చు కానీ, అడవిలో దొరికే ఆకులు, ఆయుర్వేదం, వ్యవసాయం మీద వాళ్లకు ఉన్న పట్టు మనకు లేదు. తరతరాలుగా ఈ జ్ఞానం వాళ్లకు మాటల ద్వారా అందుతోంది. వాళ్ళు పండగలు, పాటలు, డ్యాన్సులతో తమ సంస్కృతిని నిజంగా అనుభవిస్తూ బతుకుతారు. మనం మాత్రం మన సంస్కృతి గురించి కేవలం మాట్లాడుకోవడం లేదా గుర్తు తెచ్చుకోవడానికే పరిమితం అవుతున్నాం” అని పూరి అభిప్రాయపడ్డారు.
సంతోషం అంటే ఏంటి?
{{/usCountry}}“మనకు తెలివితేటలు, టెక్నాలజీ ఉండొచ్చు కానీ, అడవిలో దొరికే ఆకులు, ఆయుర్వేదం, వ్యవసాయం మీద వాళ్లకు ఉన్న పట్టు మనకు లేదు. తరతరాలుగా ఈ జ్ఞానం వాళ్లకు మాటల ద్వారా అందుతోంది. వాళ్ళు పండగలు, పాటలు, డ్యాన్సులతో తమ సంస్కృతిని నిజంగా అనుభవిస్తూ బతుకుతారు. మనం మాత్రం మన సంస్కృతి గురించి కేవలం మాట్లాడుకోవడం లేదా గుర్తు తెచ్చుకోవడానికే పరిమితం అవుతున్నాం” అని పూరి అభిప్రాయపడ్డారు.
సంతోషం అంటే ఏంటి?
{{/usCountry}}“మనకు కోరికలు ఎక్కువ.. అందుకే అసంతృప్తి కూడా ఎక్కువే. కానీ గిరిజనులకు కోరికలు చాలా తక్కువ. బతకడానికి కావాల్సిన కనీస అవసరాలు ఉంటే చాలు.. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. వాళ్ళు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు, మనలాగా రోజంతా అనవసరంగా వాగరు” అని పూరి చెప్పారు.
నిజమైన నాగరికత ఎవరిది?
ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 దేశాల్లో 500 మిలియన్ల మంది గిరిజనులు ఉన్నారని, వీరందరికీ తమదైన భాష, సంస్కృతి ఉన్నాయని పూరి తెలిపారు. ముఖ్యంగా గిరిజన సంస్కృతుల్లో ఆడవాళ్లకు ఎంతో గౌరవం ఉంటుందని, ఆడవాళ్లను తక్కువగా చూసే అలవాటు మనకే ఉంది కానీ వాళ్లకు కాదని తెలిపారు. చదువు, తెలివితేటలు పెరిగిన మనకే క్రిమినల్ ఆలోచనలు వస్తున్నాయి.. కానీ వాళ్ళు ఒకరిని ఒకరు మోసం చేసుకోరు అని కూడా పూరి స్పష్టం చేశారు.
చివరగా పూరి జగన్నాథ్ ఒక గొప్ప సామెతను గుర్తు చేశారు. "మనం ఈ భూమిని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు. మన పిల్లల దగ్గర నుండి అప్పుగా తీసుకున్నాం". మన వేర్లు చాలా లోతైనవి, ఈ ఆధునిక రోడ్ల కంటే అవే మనల్ని కాపాడతాయని ఆయన తనదైన శైలిలో ముగించారు.