Madhavan: గాయబ్ పోస్టర్‌తో దిగి వచ్చిన మాధవన్.. విద్యార్థుల నిరసనకు మద్దతు.. అలెర్ట్‌గా ఉండాలని సూచన

Madhavan: మాధవన్ దిగి వచ్చాడు. తనపై దారుణమైన ట్రోలింగ్ జరగడంతో మొత్తానికి ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు మద్దతు తెలుపుతూ ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ పోస్ట్ చేశాడు. పేపర్ లీక్ చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూనే స్టూడెంట్స్ అలెర్ట్ గా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు.

Published on: Jul 23, 2026, 14:55:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Madhavan: ఎఫ్‌టీఐఐ (FTII) క్యాంపస్‌లో విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్న వెటరన్ యాక్టర్, ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ ఆర్. మాధవన్ ఎట్టకేలకు నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై స్పందించారు. పూణేలోని తన ఆఫీస్ డోర్‌పై 'గాయబ్' మీమ్స్, 'నీట్ ఫర్ సేల్' పోస్టర్లు వెలిసిన మరుసటి రోజే ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా విద్యార్థుల పోరాటానికి తన ఫుల్ సపోర్ట్ ప్రకటిస్తూ ఒక సుదీర్ఘమైన స్టేట్‌మెంట్ విడుదల చేశారు.

Madhavan: గాయబ్ పోస్టర్‌తో దిగి వచ్చిన మాధవన్.. విద్యార్థుల నిరసనకు మద్దతు.. అలెర్ట్‌గా ఉండాలని సూచన
Madhavan: గాయబ్ పోస్టర్‌తో దిగి వచ్చిన మాధవన్.. విద్యార్థుల నిరసనకు మద్దతు.. అలెర్ట్‌గా ఉండాలని సూచన

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న తీవ్రమైన ఆవేదనను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని మాధవన్ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ అనేది భారతదేశ యువతలో నమ్మకాన్ని, అవకాశాలను పెంచేలా ఉండాలి కానీ, ఇలాంటి క్వశ్చన్ పేపర్ లీకేజీల వల్ల వేలాది మంది కష్టపడి చదివే పిల్లల కలలు, భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

"లీకేజ్ రాయుళ్లను కఠినంగా శిక్షించాల్సిందే!"

ఈ లీకేజ్ స్కామ్‌కు బాధ్యులైన ప్రతీ ఒక్కరినీ గవర్నమెంట్ తక్షణమే గుర్తించి చాలా వేగంగా, కఠినంగా శిక్షించాలని మాధవన్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇంకెవరైనా విద్యార్థుల జీవితాలతో, వారి కలలతో ఆడుకోవడానికి సాహసించని రీతిలో ఈ శిక్షల తీవ్రత ఉండాలని స్పష్టం చేశారు. గతంలో జరిగిన పొరపాట్లను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ సిస్టమ్‌లోని లోపాలను సరిదిద్ది భవిష్యత్ తరాల కోసం విద్యా వ్యవస్థ పవిత్రతను కాపాడుతుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

అయితే ఇదే సమయంలో పోరాటం చేస్తున్న విద్యార్థులకు మాధవన్ ఒక కీలకమైన హెచ్చరిక కూడా చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థుల ధైర్యం, పట్టుదలను అభినందిస్తూనే.. తమ సొంత రాజకీయ లేదా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది ఈ విద్యార్థి ఉద్యమాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే (హైజాక్ చేసే) ప్రమాదం ఉందని, ఆ విషయంలో స్టూడెంట్స్ చాలా అలెర్ట్‌గా ఉండాలని సూచించారు.

ఎఫ్‌టీఐఐ డోర్‌పై 'గాయబ్' పోస్టర్ల రచ్చ!

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నీట్ నిరసనలపై మాధవన్ ఇన్ని రోజులు మౌనంగా ఉండటంపై పూణేలోని ఎఫ్‌టీఐఐ స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన కేబిన్ డోర్‌పై 'గాయబ్' (కనిపించకుండా పోయారు) మీమ్ తోపాటు 'నీట్ ఫర్ సేల్' అని రాసి ఉన్న పోస్టర్లను అంటించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మాధవన్ మౌనంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా బాధ్యతల్లో ఉంటూ, విద్యార్థి లోకం ఇంతలా రోడ్డెక్కితే మాట్లాడకపోవడం ఏంటని అందరూ ప్రశ్నించారు. ఈ వరుస ట్రోలింగ్స్, సోషల్ మీడియా ప్రెజర్ వల్లే మాధవన్ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడి విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఢిల్లీలో తీవ్రమవుతున్న నీట్ నిరసనలు

మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ దాదాపు 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. సీజేపీ నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు ఇటీవల చేపట్టిన 'చలో సంసద్' మార్చ్‌ పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో వాతావరణం మరింత వేడెక్కింది.

ఈ పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రకాష్ రాజ్, షబానా అజ్మీ, అనురాగ్ కశ్యప్, తమిళనాడు సీఎం విజయ్ లాంటి ప్రముఖులు కూడా విద్యార్థులకు మద్దతుగా గొంతు విప్పారు. ఇప్పుడు ఎఫ్‌టీఐఐ ఛైర్మన్ హోదాలో మాధవన్ కూడా పేపర్ లీక్‌ను ఖండిస్తూ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఈ ఉద్యమానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది.

మాధవన్ చేసిన సుదీర్ఘ పోస్ట్
మాధవన్ చేసిన సుదీర్ఘ పోస్ట్
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More