...
...
Next Story

స్క్రిప్ట్ వినకుండా చేస్తున్న ఏకైక మూవీ-ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే పేరు చాలు-ఆ స్టార్‌డ‌మ్ వేరే లెవ‌ల్‌: రాశీ ఖ‌న్నా ఇంట‌ర్వ్యూ

హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. పవన్ కళ్యాణ్‌తో సినిమాను స్క్రిప్ట్ వినకుండానే చేస్తున్నానని వెల్లడించింది.

Published on: Nov 19, 2025, 11:22:37 IST
Advertisement

నటి రాశీ ఖన్నా తన కెరీర్‌లో వివిధ చిత్ర పరిశ్రమలలో విభిన్న పాత్రలు పోషించింది. కానీ స్క్రిప్ట్ చదవకుండా సంతకం చేసిన ప్రాజెక్ట్ అంటూ ఏదీ లేదు. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' దీనికి మినహాయింపు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశీ తన సహనటుడు పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ, ఎందుకు అలా చేసిందో వివరించింది.

స్క్రిప్ట్ వినకుండా

పవన్ కల్యాణ్, రాశీ ఖన్నా
పవన్ కల్యాణ్, రాశీ ఖన్నా

ఇటీవల విడుదలైన 'తెలుసు కదా' తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్'లో నటిస్తున్నారా అని అడిగినప్పుడు, రాశీ ఖన్నా ఇలా చెప్పింది. “స్క్రిప్ట్ వినకుండా నేను సంతకం చేసిన ఏకైక చిత్రం ఇదే. పవన్ కల్యాణ్ సినిమా కాబట్టి నేను ఓకే చెప్పాను. ఆయన తీసుకువచ్చే స్టార్‌డమ్ స్థాయి కారణంగా నేను ఎప్పుడూ ఆయనతో పనిచేయాలని కోరుకున్నాను. ఇది ఆయన సినిమా అని, నేను అందులో భాగం అని నాకు తెలుసు. నేను దానితో సంతోషంగా ఉన్నాను. కొన్నిసార్లు మనం ఈ కమర్షియల్ చిత్రాలను వాటి స్థాయి, రీచ్ కోసం చేస్తాం” అని రాశీ తెలిపింది.

ప్రజలపై పవన్ ప్రేమ

పవన్ ఎందుకు అంత పెద్ద స్టార్ అయ్యాడోననే విషయం సెట్లో తెలుసుకున్నానని రాశీ వెల్లడించింది. “ఆయన మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటాడనే విషయాన్ని నేను ప్రేమిస్తున్నా. ఇంకొక విషయం ఏమిటంటే సాధారణంగా ప్రజల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ. ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మంచి నటుడు అని నేను తెలుసుకున్నా’’ అని రాశీ చెప్పింది.

కామిక్ టైమింగ్

'ఫర్జీ 2', ‘120 బహదూర్’, తెలుగులో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు రాశీ చాలా సినిమాలే చేస్తోంది. “నేను ఫర్హాన్ అఖ్తర్‌తో '120 బహదూర్'లో ఒక మార్వారీ-రాజస్థానీ మహిళగా, రాబోయే సిరీస్‌లో ఒక పంజాబీ పోలీసుగా, విక్రాంత్ మాస్సేతో 'తలాఖోన్ మే ఏక్'లో ఒక బెంగాలీ అమ్మాయిగా, ఆర్. మాధవన్‌తో ఒక టైమ్ ట్రావెల్ చిత్రంలో.. ముఖ్యంగా చాలా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నాను” అని ఆమె నవ్వుతూ చెప్పింది.

“మేము వచ్చే ఏడాది ప్రారంభంలో ఫర్జీ 2 షూటింగ్ ప్రారంభిస్తాం. అంతకంటే ఎక్కువ నాకు తెలియదు. స్క్రిప్ట్ ఇంకా నా చేతికి రాలేదు. కాబట్టి మీరు ఎంత ఆసక్తిగా ఉన్నారో అంతే ఆసక్తిగా నేను కూడా ఉన్నాను” అని రాశీ ఖన్నా పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe