Radhika Apte Nude: సినిమాల్లో కథ డిమాండ్ చేయకపోయినా బోల్డ్, న్యూడ్ సీన్స్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చే తీరుపై బాలీవుడ్ భామ రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కొన్ని సినిమాల్లో కథ కోసం న్యూడ్‌గా నటించినందుకే, ఇండస్ట్రీలోని కొంతమంది తనను 'ఈమె ఎలాంటి సీన్ అయినా చేసేస్తుందిలే' అని చులకనగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యాక్షన్ సీన్ షూటింగ్‌లో షర్ట్ బటన్స్ తీసేసి కేవలం ఇన్నర్‌వేర్‌తోనే ఫైట్ చేయమన్నారంటూ షాకింగ్ నిజాలను బయటపెట్టారు.
'ఈమె ఎలాగైనా చేసేస్తుందిలే' అనే మైండ్‌సెట్

తాజాగా జూమ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధికా ఆప్టే.. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన దారుణమైన అనుభవాలను పంచుకున్నారు. ప్రారంభంలో కథ అవసరం మేరకు నాలుగు ఐదు సినిమాల్లో పూర్తి స్థాయిలో న్యూడ్‌గా నటించాల్సి వచ్చిందని చెప్పారు. దాంతో ఇండస్ట్రీలో చాలామంది 'ఈమె ఎలాగైనా నటిస్తుంది కదా' (Yeh toh karlegi na) అనే భావనకు వచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఒకసారి న్యూడ్ సీన్ చేశానంటే ప్రతి సినిమాలోనూ కారణం లేకుండా ముద్దు సీన్లు, ఇంటిమేట్ సీన్లు చేయాలా? సీన్‌లో కిస్ ఎందుకు పెట్టాలి అని అడిగితే 'ప్లీజ్ కొద్దిగా అడ్జస్ట్ అయి 15 సెకన్ల పాటు ముద్దు పెట్టొచ్చు కదా' అని సమాధానం ఇచ్చేవాళ్లు. ఇలాంటి అనవసరపు డిమాండ్లు చూసి నేను షాక్ అయ్యాను" అని రాధికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్నర్‌వేర్‌తోనే ఫైట్ సీన్ చేయమన్నారు
యాక్షన్ సీన్ షూటింగ్ టైమ్‌లో తనకు ఎదురైన ఒక చేదు సంఘటనను కూడా రాధికా గుర్తుచేసుకున్నారు. "ఒక సెట్‌లో యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు, 'షర్ట్ బటన్స్ విప్పేసి నటిస్తే ఎలా ఉంటుంది?' అని అడిగారు. అది ఫైట్ సీన్ కదా, బేసిక్ ఫిజిక్స్ ప్రకారం షర్ట్ ఊడిపోతుంది అని నేను చెప్పాను. దానికి వాళ్లు 'అయితే కేవలం బ్రా, అండర్‌వేర్‌తోనే ఈ యాక్షన్ సీన్ చేసేయ్' అని అడిగారు. నాతో అసలు ఏం చేయించాలనుకుంటున్నారు అని నేను షాక్ తిన్నాను" అని బయటపెట్టారు.
సినిమా స్క్రిప్ట్‌కు సంబంధం లేని గ్లామర్, అతిగా ఎక్స్పోజింగ్ సీన్లను తిరస్కరించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు తనకు నేర్పాయని ఆమె చెప్పారు.
'పార్చ్‌డ్' లీక్డ్ సీన్ వివాదంపై తెగేసి చెప్పిన రాధిక
{{/usCountry}}సినిమా స్క్రిప్ట్‌కు సంబంధం లేని గ్లామర్, అతిగా ఎక్స్పోజింగ్ సీన్లను తిరస్కరించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు తనకు నేర్పాయని ఆమె చెప్పారు.
'పార్చ్‌డ్' లీక్డ్ సీన్ వివాదంపై తెగేసి చెప్పిన రాధిక
{{/usCountry}}2016లో విడుదలైన 'పార్చ్‌డ్' (Parched) సినిమాలో రాధికా ఆప్టే నటించిన ఒక న్యూడ్ సీన్ సోషల్ మీడియాలో లీకై తీవ్ర దుమారం రేపింది. దానిపై అప్పట్లోనే స్పందించిన రాధిక.. అలాంటి లీకుల గురించి తాను ఎంతమాత్రం భయపడలేదని స్పష్టం చేశారు.
"నా క్యారెక్టర్ డిమాండ్ బట్టే నేను ఆ సీన్ చేశాను. ఆ సినిమా కథ కేవలం ఆ ఒక్క సీన్ మాత్రమే కాదు. సినిమా అంతకంటే చాలా పెద్ద విషయాలను చెబుతుంది. విదేశాల్లో విడుదలైన ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులో ఉంది. కేవలం ఆ ఒక్క లీక్డ్ సీన్ గురించే మీడియా అంతగా ఎందుకు మాట్లాడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు" అని ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
సౌత్ నుంచి హిందీ దాకా.. డిఫరెంట్ రోల్స్‌తో సంచలనం
రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన రాధికా ఆప్టే.. బాలకృష్ణతో 'లెజెండ్', సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'కబాలి' వంటి భారీ చిత్రాల్లో నటించారు. టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
'ప్యాడ్‌మాన్', 'అంధాధున్', 'ఫోబియా', 'సేక్రెడ్ గేమ్స్' వంటి వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో బాలీవుడ్‌లో తిరుగులేని నటిగా ఎదిగిన రాధికా ఆప్టే.. ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) ఆంథాలజీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన బోల్డ్ వాయిస్‌తో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.