Rahul Gandhi: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) డ్రెస్సింగ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రక్షా బంధన్ యాడ్‌లో కృతి వేసుకున్న అవుట్‌ఫిట్‌పై నెటిజన్లు చేసిన ట్రోలింగ్‌ను కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ వారికే ఉందని ఆయన స్పష్టం చేశారు.
'మహిళల దుస్తులు వారి ఇష్టం'.. రాహుల్ గాంధీ సంచలన పోస్ట్

రాహుల్ గాంధీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కృతి సనన్ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించారు. "ఒక మహిళ ఏం వేసుకోవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత ఇష్టం. తమ స్వేచ్ఛను ఉపయోగించుకునే మహిళలను ట్రోల్ చేయడం ఇకనైనా ఆపండి" అని రాహుల్ రాసుకొచ్చారు.
అంతేకాకుండా ఈ పోస్ట్‌తో పాటు '#SmashThePatriarchy' అనే పవర్‌ఫుల్ హాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు. పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా మహిళల స్వేచ్ఛకు మద్దతుగా నిలవడం ఇప్పుడు పొలిటికల్, సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు వివాదం ఏంటి? జివా యాడ్‌లో ఏం జరిగింది?
వివాదానికి కారణమైన జివా (GIVA) జ్యువెలరీ బ్రాండ్ రక్షా బంధన్ కమర్షియల్ యాడ్‌లో కృతి సనన్ బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, కేప్ ధరించి కనిపించారు. పవిత్రమైన పండుగ రోజు ఇలాంటి రివీలింగ్ డ్రెస్ వేసుకోవడం ఏంటంటూ సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
అంతేకాకుండా ఈ యాడ్‌లో పెంపుడు కుక్కకు రాఖీ కట్టడంపై కూడా కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కృతి అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచి, సంప్రదాయాల పేరుతో మహిళలను నియంత్రించడం సరైంది కాదని కౌంటర్ ఇచ్చారు.
'సంస్కృతి గుండెల్లో ఉంటుంది.. నెక్ లైన్‌లో కాదు'.. కృతి ఘాటు స్పందన
ఈ ట్రోల్స్‌పై కృతి సనన్ ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఘాటుగా స్పందించారు. "పండుగ సంస్కృతి, సాంప్రదాయాలు మన గుండెల్లో ఉంటాయి.. మనం వేసుకునే నెక్ లైన్‌లో కాదు" అని ఆమె తేల్చి చెప్పారు.
{{/usCountry}}ఈ ట్రోల్స్‌పై కృతి సనన్ ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఘాటుగా స్పందించారు. "పండుగ సంస్కృతి, సాంప్రదాయాలు మన గుండెల్లో ఉంటాయి.. మనం వేసుకునే నెక్ లైన్‌లో కాదు" అని ఆమె తేల్చి చెప్పారు.
{{/usCountry}}పండుగ వెనుకున్న భావోద్వేగాలు ముఖ్యమని, మహిళల గౌరవాన్ని వారు వేసుకునే బట్టలతో కొలవడం ఆపాలని కృతి డిమాండ్ చేశారు. తమ పెంపుడు కుక్కలు కూడా తమ కుటుంబంలో భాగమేనని, అందుకే వాటికి కూడా రాఖీ కట్టామని ఆమె స్పష్టం చేశారు.
కంగనా రనౌత్ వ్యంగ్యాస్త్రాలు.. పీక్‌కు చేరిన వార్
మరోవైపు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ ఈ విషయంలో కృతి సనన్‌పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నకు రాఖీ కట్టేటప్పుడు వార్డ్‌రోబ్‌లో ఇన్ని ఎథ్నిక్ ఆప్షన్లు ఉండగా బికినీ లేదా ఇన్నర్ వేర్ లాంటి డ్రెస్ ఎందుకు వేసుకోవాలని ఆమె ప్రశ్నించారు.
ఈ యాడ్ కావాలని వికారంగా డిజైన్ చేసినట్లు ఉందని కంగనా కామెంట్స్ చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఈ రగడలో ఎంటర్ అయి కృతికి సపోర్ట్ ఇవ్వడంతో ఈ వివాదం మరింత సంచలనంగా మారింది.