Rahul Ramakrishna: తెలుగు సినీ పరిశ్రమకే అవమానం.. ఇంకా అదే పేర్లతో వ్యాపారం సిగ్గుచేటు.. రాహుల్ రామ‌కృష్ణ‌ సంచలన ట్వీట్

Rahul Ramakrishna: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, వివిధ ట్రెండింగ్ టాపిక్స్ పై తనదైన స్టైల్లో రియాక్టయ్యే నటుడు రాహుల్ రామ‌కృష్ణ‌ సంచలన ట్వీట్ పెట్టాడు. సినిమా పరిశ్రమకే అవమానం, సిగ్గు చేటు అంటూ ఘాటు పదాలు వాడాడు. పూర్తి వివరాలు చూసేయండి.

Published on: May 13, 2026, 05:55:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rahul Ramakrishna: ఓ వైపు కమెడియన్ గా కామెడీ పండిస్తూనే, మరోవైపు వివిధ క్యారెక్టర్లలో అదరగొడుతూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు రాహుల్ రామ‌కృష్ణ‌. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ నటుడు తాజాగా సంచలన ట్వీట్ చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎగ్జిబ్యూటర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ ట్వీట్ వైరల్ అవుతోంది.

రాహుల్ రామ‌కృష్ణ‌ (x/eyrahul)
రాహుల్ రామ‌కృష్ణ‌ (x/eyrahul)

పర్సంటేజీ కావాలని

సినిమా టికెట్ల రేట్ల విషయంలో, పర్సంటేజీ విషయంలో తెలుగు సినిమా ఎగ్జిబ్యూటర్లు అందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. సినిమా టికెట్లు పెంచే అవకాశమే లేదని, అమ్మకాల్లో పర్సంటేజీ కావాలని డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ రామ‌కృష్ణ‌ ట్వీట్

టాలీవుడ్ లో ఎప్పటి నుంచో నైజాం, సీడెడ్, ఆంధ్ర అంటూ ప్రాంతాలను విభజించి సినిమా రైట్స్ కొంటున్నారు. అయితే ఇప్పటికీ నైజాం, సీడెడ్ అనే పేర్లతో పిలవడంపై రాహుల్ రామ‌కృష్ణ‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘‘తెలంగాణ మార్కెట్‌ని ఇప్పటికీ “నైజాం”, రాయలసీమని “సీడెడ్” అని పిలవడం తెలుగు భాషకు, తెలుగు ప్రేక్షకులకు, తెలుగు సినీ పరిశ్రమకే అవమానం. మన భాషలో వస్తున్న సినిమాలని ఇప్పటికీ సామంత-వలస పాలన పేర్లతో వ్యాపారం చేయడం సిగ్గుచేటు. ట్రేడ్ టెర్మినాలజీ కూడా కాలానికి తగ్గట్లుగా మారాలి’’ అని రాహుల్ ఎక్స్ లో పోస్టు పెట్టాడు.

గుడ్ బై

అంతకుముందు ఈ సీజన్ లో వచ్చిన సినిమాలపై కూడా రాహుల్ సెన్సేషనల్ పోస్టులు పెట్టాడు. చెత్త సినిమాలు తీస్తే థియేటర్లకు ఎవరూ రారని, ప్రేక్షకులను తక్కువ అంచనా వేయొద్దని పేర్కొన్నాడు. చివరగా.. ‘‘ఈ సీజన్ కు ట్విటర్ ఇక చాలు. అందరికీ గుడ్ బై. ప్రేమతో’’ అని రాహుల్ ట్వీట్ పెట్టాడు.

రాహుల్ సినిమాలు

2016లో వచ్చిన జయమ్ము నిశ్చయంబురా మూవీతో రాహుల్ రామ‌కృష్ణ‌ తెరంగేట్రం జరిగింది. అయితే 2017లో వచ్చిన అర్జున్ రెడ్డితో రాహుల్ కు అదిరిపోయే బ్రేక్ వచ్చింది. ఇందులో హీరో ఫ్రెండ్ గా రాహుల్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

అర్జున్ రెడ్డి తర్వాత రాహుల్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. కమెడియ్ గా సత్తాచాటతున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను నవ్విస్తున్నాడు.

లీడ్ రోల్స్ లోనూ

మరోవైపు రాహుల్ లీడ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. మిఠాయి, బ్రోచేవారెవరురా, జాతి రత్నాలు, స్కై ల్యాబ్, ఓం భీమ్ బుష్ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు చేశాడు. ముఖ్యంగా జాతి రత్నాలు మూవీతో రాహుల్ చాలా పాపులర్ అయ్యాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More