సమంత, రాజ్ పెళ్లిపై అతని మొదటి భార్య రియాక్షన్ ఇలా.. ఇక్కడ సింపథీ, డ్రామా ఏమీ ఉండవంటూ ఘాటు కామెంట్స్
సమంతతో రాజ్ నిడిమోరు పెళ్లిపై అతని మొదటి భార్య శ్యామలీ డే స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో చాలా ఘాటు కామెంట్స్ చేసింది. సింపథీ కోసం చూడటం, డ్రామాలాంటివి కావాలంటే ఇక్కడి నుంచి వెళ్లండి.. అలాంటివేమీ ఉండవని అనడం విశేషం.
నటి సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో 'యోగ' పద్ధతిలో ఒక్కటయ్యారు. ఈ వివాహం తర్వాత రాజ్ మాజీ భార్య శ్యామలి డే (Shhyamali De) సోషల్ మీడియా వేదికగా మౌనం వీడింది. తనకు లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూనే, తనకు ఎవరి సానుభూతి అవసరం లేదని ఘాటుగా స్పందించింది.

శ్యామలి డే ఏమన్నదంటే?
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత అతని మొదటి భార్య శ్యామలి తొలిసారి దీనిపై స్పందించింది. ఇప్పుడు కూడా వాళ్ల పేర్లు ప్రస్తావించకుండానే ఓ పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో శ్యామలి ఒక నోట్ రాసింది. అందులో ఆమె చాలా ఘాటు కామెంట్స్ చేసింది.
"ఇక్కడ ఎవరైనా డ్రామా లేదా బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తుంటే, మీకు అది ఇక్కడ దొరకదు. దయచేసి వెళ్లిపోండి. నేను ఎవరి సానుభూతి కోరుకోవడం లేదు. మీడియా కవరేజ్, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు లేదా పెయిడ్ పార్టనర్‌షిప్‌ల కోసం నేను చూడటం లేదు. నేను ఎవరికీ ఏమీ అమ్మడానికి ప్రయత్నించడం లేదు" అని ఆమె అనడం విశేషం.
అంతకుముందు శ్యామలి మరొక ఎమోషనల్ నోట్‌ను కూడా పంచుకుంది. "రాత్రంతా నిద్ర లేకుండా గడిపాను. ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. కానీ నాకు వస్తున్న మద్దతును, మంచిని గుర్తించకపోతే అది కృతజ్ఞత లేని తనం అవుతుందని గ్రహించాను" అని రాసుకొచ్చింది.
సమంత-రాజ్ వివాహ విశేషాలు
సమంత, రాజ్ నిడిమోరు 'లింగ భైరవి వివాహ' పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి ఫోటోలలో సమంత చేతికి ఉన్న భారీ ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా రూపొందించిన ఎరుపు రంగు చేనేత బెనారసి చీరలో సమంత మెరిసిపోయింది. దీనిని ఒక్కరే మాస్టర్ ఆర్టిసన్ స్వచ్ఛమైన కటన్ సాటిన్ సిల్క్‌తో తయారు చేశారు.
సమంత గతంలో 2017 నుండి 2021 వరకు నాగ చైతన్యతో వివాహ బంధంలో ఉంది. చైతన్య ఇప్పుడు శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్నాడు. రాజ్ నిడిమోరు 2015లో శ్యామలిని వివాహం చేసుకోగా, వారు 2023లో విడిపోయారని సమాచారం. రాజ్, సమంత కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్‌లకు పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరూ 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


