సమంత ఇంట్లో లలిత.. బయట మహిషాసుర మర్దిని.. మూవీ సెట్స్‌ నుంచి వీడియో షేర్ చేసిన రాజ్ నిడిమోరు చెల్లెలు

సమంత భర్త రాజ్ నిడిమోరు చెల్లెలు శీతల్ షేర్ మా ఇంటి బంగారం సెట్స్ లోని వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ బిహైండ్ ద సీన్స్ వీడియోను షేర్ చేస్తూ ఆమె రాసిన క్యాప్షన్ కూడా చాలా బాగుంది.

Published on: Jan 11, 2026, 13:10:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అక్కినేని కోడలిగా ఒకప్పుడు అందరి మన్ననలు పొందిన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. ఇప్పుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె వ్యక్తిగత జీవితం ఎంత సంతోషంగా ఉందో చెప్పడానికి తాజాగా ఆమె ఆడపడుచు (రాజ్ నిడిమోరు సోదరి) శీతల్ నిడిమోరు చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టే నిదర్శనం.

సమంత ఇంట్లో లలిత.. బయట మహిషాసుర మర్దిని.. మూవీ సెట్స్‌ నుంచి వీడియో షేర్ చేసిన రాజ్ నిడిమోరు చెల్లెలు
సమంత ఇంట్లో లలిత.. బయట మహిషాసుర మర్దిని.. మూవీ సెట్స్‌ నుంచి వీడియో షేర్ చేసిన రాజ్ నిడిమోరు చెల్లెలు

సమంత ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మా ఇంటి బంగారం’. శుక్రవారం (జనవరి 9) విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో శీతల్.. సినిమా సెట్స్‌లో షూట్ చేసిన కొన్ని అన్ సీన్ వీడియోలను షేర్ చేస్తూ తన వదినపై ప్రేమను చాటుకుంది.

ఇంట్లో లలిత.. బయట మహిషాసుర మర్దిని

శీతల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. "మా ఇంటి బంగారం ట్రైలర్ అద్భుతం. ఇంట్లో లలిత.. మధుర భాషిణి.. మృదు స్వభావి. బయట మాత్రం మహిషాసుర మర్దిని.. భయం ఎరుగని శక్తి. ఎప్పుడు సున్నితంగా ఉండాలో, ఎప్పుడు రౌద్రంగా మారాలో తెలిసిన స్త్రీ శక్తి ఇది. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది" అని క్యాప్షన్ ఇచ్చింది.

వ్యాన్‌లో అల్లరి.. సెట్లో హడావుడి

శీతల్ షేర్ చేసిన వీడియోలో.. సమంత తన క్యారవాన్‌లో ఆడపడుచు, మేనల్లుళ్లతో కలిసి ఫోటోలకు పోజులిస్తూ, చాలా ఉల్లాసంగా గడపడం చూడవచ్చు. మరో వీడియోలో దర్శకురాలు నందిని రెడ్డితో శీతల్ ముచ్చటించడం, రాజ్ నిడిమోరు సెట్‌లో పనిలో నిమగ్నమై ఉండటం, టెక్నీషియన్ల హడావుడి కనిపిస్తోంది.

సామ్ ఆనందం చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్ ఈ వీడియోలు చూసిన నెటిజన్లు, సమంత అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. "సామ్ మళ్లీ ఇంత సంతోషంగా ఉండటం చూస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంది" అని ఒకరు.. "సామ్ దక్కించుకున్న కొత్త కుటుంబం చాలా బాగుంది" అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. "సమంతకు కేవలం ప్రేమాభిమానాలు మాత్రమే దక్కాలి" అంటూ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.

మా ఇంటి బంగారం సినిమా గురించి..

‘ఓ బేబీ’ మ్యాజిక్ తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే అందించగా.. అతనితో పాటు సమంత, హిమాంక్ దువ్వూరు కలిసి ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. టీజర్‌ను బట్టి చూస్తే.. ఇందులో సమంతది డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలా కనిపిస్తోంది. ఇంట్లో భయస్తురాలిగా నటిస్తూనే.. బయట క్రైమ్ వరల్డ్‌లో లేడీ డాన్‌లా వ్యవహరించే పాత్రలో సామ్ కనిపించనుందని టాక్. టీజర్ చివర్లో శవాన్ని ఈడ్చుకెళ్లే సీన్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More