తెల్ల చీరలో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఫొటోలకు పోజులు.. పెళ్లి తర్వాత తొలిసారి పబ్లిగ్గా..

సమంత రూత్ ప్రభు తెల్ల చీరలో మెరిసిపోయింది. పెళ్లి తర్వాత తొలిసారి భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చింది. హైదరాబాద్ లో ఈ జంట ఫొటోలకు పోజులిచ్చింది. సామ్ తన మార్క్ స్మైల్ తో చాలా అందంగా కనిపించింది.

Published on: Jan 10, 2026, 13:43:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎన్నో ఊహాగానాల తర్వాత దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లాడిన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. ఇప్పుడు చాలా సంతోషంగా, ఉల్లాసంగా కనిపిస్తోంది. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట తొలిసారిగా ఒక పబ్లిక్ ఈవెంట్‌లో మెరిసింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరు జంటగా కెమెరాలకు చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెల్ల చీరలో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఫొటోలకు పోజులు.. పెళ్లి తర్వాత తొలిసారి పబ్లిగ్గా..
తెల్ల చీరలో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఫొటోలకు పోజులు.. పెళ్లి తర్వాత తొలిసారి పబ్లిగ్గా..

వైట్ శారీలో మెరిసిపోయిన సామ్

ఆ వీడియోలో సమంతను చూస్తే కళ్లు తిప్పుకోలేరు. తెల్లటి చీరలో, చాలా లైట్ మేకప్‌తో, సగం ముడివేసిన జుట్టుతో ఆమె చాలా సహజంగా, అందంగా కనిపించింది. అన్నింటికంటే మించి ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ ఆనందం ఓ కొత్త కళను తీసుకొచ్చింది. ఇక ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ నిడిమోరు.. నల్ల టీషర్ట్, బ్రౌన్ జాకెట్‌లో సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనిపించాడు. ఇద్దరి అవుట్‌ఫిట్స్ చాలా క్లాసీగా, పవర్ కపుల్ వైబ్స్‌ను ఇస్తున్నాయి.

ఆ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా

వేదికపై వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, కెమిస్ట్రీ స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్ తనదైన శైలిలో చాలా కూల్‌గా, కామ్‌గా ఉంటే.. సమంత ఎంతో ఉత్సాహంగా కనిపించింది. తన మార్క్ స్మైల్ తో అందరినీ పలకరించింది. ఇద్దరూ చాలా కంఫర్టబుల్‌గా, ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లుగా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్‌లో ‘భూత శుద్ధి’ అనే సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కోసం కలిసి పనిచేసినప్పటి నుంచి వీరి మధ్య స్నేహం చిగురించి, అది ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లిపీటలెక్కింది.

సమంత రాబోయే ప్రాజెక్టులు ఇవే

పర్సనల్ లైఫ్‌లోనే కాకుండా, ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ ఈ జంట దూసుకెళ్తోంది. సామ్, రాజ్ కాంబినేషన్లో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇటీవల విడుదలై అంచనాలను పెంచేసింది. ‘ఓ బేబీ’ తర్వాత బి.వి. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న చిత్రమిది. టీజర్ చూస్తుంటే ఇది పక్కా యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అనిపిస్తోంది. రాజ్ నిడిమోరు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య కూడా నటిస్తున్నాడు. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్, కెరీర్ రెండింటినీ సమంత బ్యాలెన్స్ చేస్తున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More