...
...
Next Story

Raja Singh On Toxic: ‘టాక్సిక్’పై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. మధ్యలోనే బయటకు వచ్చేశామంటూ!

Raja Singh On Toxic: ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. కానీ ఈ సారి పొలిటికల్ కామెంట్లతో కాదు.. సినిమాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. టాక్సిక్ మూవీపై రాజా సింగ్ ఫైర్ అయ్యారు. అదే సమయంలో ఇరుముడి చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

Published on: Aug 30, 2026, 20:43:22 IST
Advertisement

Raja Singh On Toxic: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic) పై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన స్నేహితులతో కలిసి సినిమా చూడటానికి వెళ్లిన ఆయన, అందులోని విపరీతమైన అశ్లీలత, హింసను చూసి భరించలేక థియేటర్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసినట్లు వెల్లడించారు.

రాజాసింగ్ సంచలన కామెంట్లు

‘టాక్సిక్’పై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. మధ్యలోనే బయటకు వచ్చేశామంటూ!
‘టాక్సిక్’పై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. మధ్యలోనే బయటకు వచ్చేశామంటూ!

సినిమా సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలి కానీ, డ్రగ్స్, హత్యలు, మహిళలను అసభ్యంగా చూపించడాన్ని ప్రోత్సహించకూడదని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో రవితేజ నటించిన ‘ఇరుముడి’, చారిత్రాత్మక బాలీవుడ్ చిత్రం ‘ఛావా’ సినిమాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక అంశాలు ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారు.

థియేటర్ నుంచి వాకౌట్!

మల్టీప్లెక్స్‌లో టాక్సిక్ సినిమా చూసిన తర్వాత రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ‘కేజీఎఫ్’ వంటి ప్రపంచవ్యాప్త విజయాల తర్వాత యశ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఎంతో ఆసక్తితో వెళ్లానని, కానీ సినిమాలో హద్దులు దాటిన అసభ్యత ఉందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిన రాజాసింగ్.. స్క్రీన్ పై వస్తున్న అశ్లీల సన్నివేశాలు, విపరీతమైన రక్తపాతం చూసి తీవ్ర అసౌకర్యానికి గురై థియేటర్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసినట్లు చెప్పారు.

పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న యశ్ ఇలాంటి కథలను ఎంచుకోవడం వల్ల ఆయనకు సమాజంలో చెడ్డ పేరు వస్తుందని, అభిమానులను నిరాశపరిచినట్లవుతుందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

సమాజంపై దుష్ప్రభావం

‘టాక్సిక్’ సినిమాను తీవ్రంగా తప్పుపడుతూనే, ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న మరికొన్ని కంటెంట్ బేస్డ్ చిత్రాలపై రాజాసింగ్ ప్రశంసలు కురిపించారు.

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో దైవ సంబంధమైన భక్తి అంశాలతో పాటు కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సందేశం ఉందని ఆయన కొనియాడారు. అలాగే ఛత్రపతి శంభాజీ మహారాజ్ ధీరగాథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చిత్రం హిందూ ధర్మాన్ని కాపాడేలా, యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చేలా ఉందని చెప్పారు.

కామెంట్లు వైరల్

ఎప్పుడూ పొలిటికల్ కామెంట్లతో వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే రాజా సింగ్.. తాజాగా సినిమాలపై కామెంట్లు చేయడం వైరల్ గా మారింది. ముఖ్యంగా టాక్సిక్ మూవీపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks