Tagore Movie: మరోసారి ఠాగూర్ రైట్స్ రచ్చ.. ఆ సినిమా నేనే కొనుక్కున్నా.. చిరంజీవి కోసం పట్టుకెళ్లిపోయారన్న రాజశేఖర్

Tagore Movie: ఠాగూర్ మూవీ రిమేక్ రైట్స్ రచ్చ మరోసారి వైరల్ గా మారింది. ఈ రైట్స్ పై సీనియర్ హీరో రాజశేఖర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కొన్న సినిమాను చిరంజీవి కోసం పట్టుకెళ్లిపోయారని రాజశేఖర్ పేర్కొన్నాడు. 

Published on: Apr 25, 2026, 09:53:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tagore Movie: ఠాగూర్ మూవీ చిరంజీవి కెరీర్ లో ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ పై మాత్రం వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి రాజశేఖర్ కామెంట్స్ తో ఈ రచ్చ మొదలైంది.

ఠాగూర్ రైట్స్ రచ్చ
ఠాగూర్ రైట్స్ రచ్చ

ఠాగూర్ రైట్స్ వివాదం

వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఠాగూర్ మూవీ తమిళ సినిమా ‘రమణ’కు రీమేక్. 2002లో తమిళ్ లో విజయ్ కాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన రమణ ఘన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ఫస్ట్ రాజశేఖర్ తీసుకోవాలనుకుని అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత చిరంజీవి కోసం ఠాగూర్ మధు ఎక్కువ డబ్బు ఇచ్చి ఈ రైట్స్ కొన్నాడు.

రాజశేఖర్ కామెంట్స్

తాజాగా ఠాగూర్ మూవీ రీమేక్ రైట్స్ పై రాజశేఖర్ మాట్లాడాడు. ‘‘ఠాగూర్ సినిమాను నేను చేయాల్సింది. రీమేక్ రైట్స్ నేను కొన్నా. దీని కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చా. అయితే ఆ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ కదా అని అగ్రిమెంట్ చేసుకోకుండా మాట మీదే ఉండిపోయా’’ అని రాజశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఎక్కువ డబ్బులిచ్చి

‘‘నా ఫ్రెండ్ అయిన ప్రొడ్యూసర్ ను ఠాగూర్ మధు కలిశాడు. ఎక్కువ డబ్బులిచ్చి రీమేక్ రైట్స్ కొనుక్కున్నాడు. చిరంజీవి కోసం ఆ సినిమాను పట్టుకెళ్లిపోయాడు. నేను పేపర్ మీద అగ్రిమెంట్ చేసుకోలేదు. అందుకే నాకు ఆ మూవీ దక్కలేదు’’ అని రాజశేఖర్ అప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసి మళ్లీ రచ్చకు దారితీశాడు.

అప్పుడు ఏం చేశావంటూ?

తాను చేయాల్సిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఠాగూర్ ను చిరంజీవి చేశారంటూ రాజశేఖర్ మాట్లాడాడని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి అగ్రిమెంట్ చేసుకోకుండా అప్పుడు ఏం చేశారని అడుగుతున్నారు. రూల్స్ ప్రకారమే ఠాగూర్ మూవీ రైట్స్ ను నిర్మాత మధు తీసుకున్నాడని అంటున్నారు.

బ్లాక్ బస్టర్

2003లో రిలీజైన ఠాగూర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో యాంటీ కరెప్షన్ ఫోర్స్ అంటూ అవినీతిపై పోరాడే ప్రొఫెసర్ గా చిరంజీవి నటించారు. లంచం తీసుకోవడం నేరం అంటూ సమాజానికి ఉపయోగపడేలా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఇందులో శ్రియా, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు.

ఠాగూర్ మూవీ 253 సెంటర్లలో 50 రోజులు, 192 సెంటర్లలో 100 రోజులు కంప్లీట్ చేసుకోవడం విశేషం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More