OTT Telugu: మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల రచ్చ.. భార్యాభర్తల గొడవలతో ఫుల్ కామెడీ.. ఇవాళ ఓటీటీలోకి లేచింది మహిళా లోకం

OTT Telugu: ఇవాళ ఓటీటీలోకి ఓ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వచ్చేసింది. వుమెన్ సెంట్రిక్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ డెబ్యూ చేసింది. మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల లాంటివాళ్లు నటించిన ఈ మూవీపై ఓ లుక్కేయండి. 

Published on: Apr 22, 2026, 08:53:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu: థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో అదరగొడుతున్నాయి. పెద్ద తెరపై ఆ మూవీని చూడని ఆడియన్స్.. చిన్న తెరపై మాత్రం తెగ ఎంజాయ్ చేసేస్తుంటారు. ఇప్పుడు అదే నమ్మకంతో ‘లేచింది మహిళా లోకం’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించలేకపోయిన ఈ ఫిల్మ్.. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు వచ్చేసింది.

ఓటీటీలోకి తెలుగు సినిమా (x/sunnxt)
ఓటీటీలోకి తెలుగు సినిమా (x/sunnxt)

లేచింది మహిళా లోకం ఓటీటీ

లేటెస్ట్ తెలుగు కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘లేచింది మహిళా లోకం’ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. బుధవారం (ఏప్రిల్ 22) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ చిత్రం డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.

ట్రెండ్ కు తగ్గట్లుగా

ప్రస్తుతం డ్రమ్ములు, కుక్కర్లు ట్రెండ్ గా మారాయి. భార్యాభర్తల మధ్య ఏ చిన్న గొడవ వచ్చినా, వివాహేతర సంబంధాల కారణంగా ఒకరి ప్రాణాలు మరొకరు తీస్తున్నారు. ఈ విషయాన్ని కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేయడంతో పాటు లింగ వివక్ష, భార్యాభర్తల మధ్య అనుబంధం, సమాజంలో మహిళలను చూసే తీరును ఈ లేచింది మహిళా లోకం సినిమాలో డిస్కస్ చేశారు.

థియేటర్ రెస్సాన్స్

లేచింది మహిళా లోకం సినిమాకు థియేటర్లో పెద్దగా ఆదరణ దక్కలేదు. ఈ చిత్రం మార్చి 26, 2026న విడుదలైంది. మంచు లక్ష్మి తదితరులు ప్రచారంతో మూవీపై బజ్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. కానీ థియేటర్లో మాత్రం ఆ ఇంపాక్ట్ కనిపించలేదనే టాక్ వినిపిస్తోంది.

అంతా ఆడవాళ్లే

లేచింది మహిళా లోకం సినిమాలో మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ, సుప్రీత నాయుడు, హేమ తదితరులు నటించారు. సింగర్ శ్రీరామచంద్ర కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. లేచింది మహిళా లోకం మూవీకి అర్జున్, కార్తీక్ కలిసి దర్శకత్వం వహించారు.

ఆ ముగ్గురి చుట్టూ

లేచింది మహిళా లోకం సినిమా ప్రధానంగా ముగ్గురు మహిళల చుట్టూ సాగుతుంది. లాయర్ గా నటించిన మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, హరితేజ ను బేస్ చేసుకుని ఈ మూవీ స్టోరీ ముందుకు సాగుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవల్లోకి పక్కింటి వాళ్లు దూరితే ఎలా ఉంటుదన్నేది కూడా ఫన్నీగా చూపించారు.

ఓటీటీలో కామెడీతో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూడాలనుకునేవాళ్లకు లేచింది మహిళా లోకం మూవీ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు లేటు ఈ మూవీపై ఓ లుక్కేయండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More