Jailer 2 OTT: తలైవానా మజకా.. జైలర్ 2 మూవీకి రికార్డు ఓటీటీ డీల్.. తమిళ సినిమాల్లోనే హైయ్యస్ట్.. రజినీకాంత్ మేనియా!

Jailer 2 OTT: తలైవా రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 రికార్డులు తిరగరాసేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ డీల్ తో అదుర్స్ అనిపిస్తోంది. తమిళ సినిమాల్లోనే అత్యధికంగా జైలర్ 2 ఓటీటీ రైట్స్ డీల్ సెట్ అయిందని సమాచారం. 

Published on: Apr 19, 2026, 17:41:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jailer 2 OTT: తలైవా రజినీకాంత్ క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన అలా స్టైల్ గా నడిచొస్తే చాలు థియేటర్లు మోత మోగిపోతాయి. ఆయన మూవీ హిట్ అయిందంటే ఆ సందడే వేరు. అలాంటి రజినీకాంత్ సూపర్ హిట్ మూవీనే జైలర్. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా జైలర్ 2 రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రజినీకాంత్ (x/rajinikanth)
రజినీకాంత్ (x/rajinikanth)

జైలర్ 2 ఓటీటీ

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ జైలర్ 2. సూపర్ హిట్ జైలర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై హైప్ ఆకాశాన్ని తాకుతోంది. తాజాగా జైలర్ 2 మూవీ ఓటీటీ రైట్స్ కోసం రికార్డు డీల్ కుదిరిందనే టాక్ ఇందుకు నిదర్శనం. జైలర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలిసింది.

రికార్డు రేట్

జైలర్ 2 ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రికార్డు రేట్ చెల్లించిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ కోసం ఏకంగా రూ.160 కోట్ల డీల్ జరిగిందని సమాచారం. ఈ డీల్ తో జైలర్ 2 చిత్రం కొత్త రికార్డు క్రియేట్ చేసిందని అంటున్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలోనే ఓ మూవీకి దక్కిన అత్యధిక ఓటీటీ డీల్ రేట్ ఇదేనని చెప్తున్నారు.

హైయ్యస్ట్

ఓటీటీ రైట్స్ కోసం అత్యధిక ధర దక్కించుకున్న తమిళ సినిమాగా జైలర్ 2 నిలిచిందని అంటున్నారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ రికార్డును జైలర్ 2 బ్రేక్ చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కమల్ హాసన్ మూవీకి ఓటీటీ హక్కుల రూపంలో రూ.150 కోట్లు దక్కినట్లు టాక్. ఇప్పుడు జైలర్ 2కు అంతకంటే ఎక్కువే వచ్చాయని సమాచారం.

జైలర్ 2 గురించి

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023లో వచ్చిన జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా జైలర్ 2 రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందని రజినీకాంత్ రీసెంట్ గా పేర్కొన్న సంగతి తెలిసిందే. 2026లోనే జైలర్ 2 రిలీజ్ కానుంది.

జైలర్ 2తో టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ మరోసారి తన పవర్ చూపించబోతున్నాడు. ఈ సినిమాలో ఎస్జే సూర్య, ర‌మ్య‌కృష్ణ‌, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు. జైలర్ 2ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జైలర్ హిట్ తో జైలర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More