...
...
Next Story

Rajinikanth: అన్నయ్యను యుద్ధంలో కోల్పోయా.. రజినీకాంత్ కళ్ళల్లో నీళ్లు తెప్పించే గతం! ధురంధర్ 2 చూశాక వైరల్ గా వీడియో

Rajinikanth: 'ధురంధర్ 2' చిత్రంపై సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా తన అన్నయ్య యుద్ధంలో మరణించిన విషయాన్ని రజినీకాంత్ గుర్తు చేసుకున్న వీడియో వైరల్ గా మారింది.

Published on: Mar 25, 2026, 13:18:37 IST
Advertisement

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' చిత్రాన్ని సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆకాశానికెత్తేశారు. ఈ సినిమాను 'బాక్సాఫీస్ కా బాప్' అని అభివర్ణిస్తూ ఆయన చేసిన పోస్ట్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా ఇది అని రజినీకాంత్ గర్వంగా ప్రకటించారు.

వైరల్ అవుతున్న పాత వీడియో

రజినీకాంత్
రజినీకాంత్

రజినీకాంత్ ధురంధర్ 2పై ప్రశంసలు కురిపించాడు. అయితే ఆయన ఈ సినిమాను ఎందుకు అంతగా మెచ్చుకున్నారో వివరిస్తూ, అభిమానులు ఆయనకు సంబంధించిన ఒక పాత వీడియోను వైరల్ చేస్తున్నారు.

1999 కార్గిల్ యుద్ధం సమయంలో రజినీకాంత్ తన అన్నయ్య గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి. దేశం కోసం తన కుటుంబం చేసిన త్యాగాన్ని ఆయన ఆ వీడియోలో గుర్తుచేసుకున్నారు.

యుద్ధంలో అన్నయ్య త్యాగం

రజినీకాంత్ అన్నయ్య నాగేశ్వరరావు భారత ఆర్మీలో సైనికుడిగా పనిచేశారు. 1965లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ఆయన పోరాడుతూ తీవ్రంగా గాయపడ్డారని రజినీకాంత్ వెల్లడించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారని, యుద్ధం వల్ల కలిగే బాధ తనకూ వ్యక్తిగతంగా తెలుసని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబాల వేదన వర్ణనాతీతం

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయే సైనికుల కంటే, వారి కోసం వేచి చూసే కుటుంబ సభ్యులే ఎక్కువగా బాధపడతారని రజినీకాంత్ పేర్కొన్నారు. "సైనికుల సేవలకు మనం ఎప్పటికీ వెల కట్టలేము, ఆ బాధను నేను స్వయంగా అనుభవించా" అని ఆయన అన్నారు. అందుకే దేశభక్తి నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఆయన ఎప్పుడూ మద్దతుగా నిలుస్తారు.

సూపర్ పవర్ గా

సూపర్‌స్టార్ రజినీకాంత్ నుంచి ప్రశంసలు అందడంపై దర్శకుడు ఆదిత్య ధర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. "మీరు మమ్మల్ని దశాబ్దాలుగా అలరిస్తున్నారు, మీ నుంచి 'సెల్యూట్' అందుకోవడం నా జీవితంలో అతిపెద్ద సూపర్ స్టార్ మూమెంట్" అని ఆదిత్య ట్వీట్ చేశారు. రజినీకాంత్ ఆశీస్సులు తమ చిత్ర బృందానికి కొండంత అండని ఆయన పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks