Rajinikanth Anirudh Kavya: ఆ స్టైల్‌కు సాటెవ్వరు? కావ్య, అనిరుధ్ పెళ్లి పార్టీలో రజినీకాంత్ డ్యాన్స్.. వీడియోలు వైరల్!

Rajinikanth Anirudh Kavya: ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే వీడియో కనిపిస్తోంది. కావ్య మారన్- అనిరుధ్ రవిచందర్ వెడ్డింగ్ కంటే కూడా ఈ వీడియో పాపులర్ అయింది. అదే.. సూపర్ స్టార్ రజినీకాంత్ డ్యాన్స్ వీడియో. కావ్య, అనిరుధ్ మ్యారేజీ పార్టీలో తలైవా డ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Published on: Nov 12, 2026, 09:15:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rajinikanth Anirudh Kavya: సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ అండ్ స్వాగ్ వేరే లెవల్. 70 ఏళ్లలోనూ కుర్రాడిలా సినిమాల్లో అదరగొడుతున్నారు. తాజాగా రజినీకాంత్ బయట కూడా తన డ్యాన్స్ తో సెన్సేషన్ గా మారారు. తన మేనళ్లుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వెడ్డింగ్ పార్టీలో రజినీకాంత్ డ్యాన్స్ వైరల్ గా మారింది.

ఆ స్టైల్‌కు సాటెవ్వరు? కావ్య, అనిరుధ్ పెళ్లి పార్టీలో రజినీకాంత్ డ్యాన్స్.. వీడియోలు వైరల్!
ఆ స్టైల్‌కు సాటెవ్వరు? కావ్య, అనిరుధ్ పెళ్లి పార్టీలో రజినీకాంత్ డ్యాన్స్.. వీడియోలు వైరల్!

రజినీకాంత్ డ్యాన్స్

లవ్ బర్డ్స్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ గ్రీస్ లో పెళ్లి చేసుకున్నారు. బుధవారం (నవంబర్ 11) వీళ్ల వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు రజినీకాంత్ తన ఫ్యామిలీతో వెళ్లారు. అనిరుధ్, కావ్య పెళ్లిలో ఆయన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వెడ్డింగ్ పార్టీలో డ్యాన్స్ కూడా చేశారు.

కపుల్స్ తో కలిసి

అనిరుధ్, కావ్య పెళ్లి పార్టీలో రజినీకాంత్ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. తన ‘వేట్టయన్’ సినిమాలోని ఛార్ట్ బస్టర్ సాంగ్ ‘మనసిలాయో’కు తలైవా తన స్టైల్ లో స్టెప్పులేశారు. కొత్త దంపతులు అనిరుధ్, కావ్యతో కలిసి చిందులేశారు. ఈ బ్లాక్ బస్టర్ సాంగ్ కు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే.

అనిరుధ్, కావ్య పెళ్లి

మోస్ట్ వాంటెడ్ అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లిపై ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం ఊహాగానాలే అని వీళ్లు కొట్టిపారేశారు. చివరకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో నవంబర్ 11న గ్రీస్ లో అనిరుధ్, కావ్య పెళ్లి జరిగింది. వీళ్ల వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అనిరుధ్, రజినీ రిలేషన్

రజినీకాంత్, అనిరుధ్ మధ్య కేవలం హీరో, మ్యూజిక్ డైరెక్టర్ రిలేషన్ మాత్రమే కాదు అంతకుమించిన బంధం ఉంది. రజినీకాంత్ కు అనిరుధ్ మేనళ్లుడి వరుస అవుతాడు. రజినీకాంత్ భార్య సోదరుడి కొడుకే అనిరుధ్. అంటే అనిరుధ్ కు రజినీకాంత్ భార్య సొంత మేనత్త. అందుకే ఈ పెళ్లి గురించి రజినీకాంత్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారని టాక్.

చెన్నైలో రిసెప్షన్

గ్రీస్ లో జరిగిన అనిరుధ్, కావ్య వెడ్డింగ్ కు కొద్ది మందిని మాత్రమే ఇన్వైట్ చేశారు. అయితే సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖుల కోసం నవంబర్ 21న చెన్నైలో ఈ జంట గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వబోతుంది. ఈ రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కాబోతున్నారని సమాచారం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More