Priya Bhavani Shankar Marriage: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్-ప్రియా భవానీ మ్యారేజీ వీడియో-వరుడు ఎవరంటే
Priya Bhavani Shankar Marriage: ప్రియా భవానీ శంకర్ అంటే ఈ హీరోయిన్ ను చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ, ఇరుముడి హీరోయిన్ అంటే మాత్రం చాటు ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఇరుముడి మూవీతో తెలుగు నాట అంతటి క్రేజ్ దక్కించుకున్న ప్రియా భవానీ శంకర్ కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది. సైలెంట్ గా ఆమె పెళ్లి చేసుకుంది.
Priya Bhavani Shankar Marriage: తమిళ స్టార్ నటి, ఇరుముడి సినిమా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తన లైఫ్ లో ఓ కొత్త ఛాప్టర్ స్టార్ట్ చేసింది. ఈ భామ సైలెంట్ గా ఇవాళ (నవంబర్ 11) పెళ్లి చేసుకుంది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ వేల్ తో ఆమె వివాహం బుధవారం పొద్దున చెన్నైలో జరిగింది.

సింపుల్ గా మ్యారేజీ
సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటుల పెళ్లిళ్లంటే ఉండే హడావుడి వేరు. ఆ హైప్, బజ్ వేరే లెవల్. కానీ ప్రియా భవానీ శంకర్ మాత్రం చాలా సింపుల్ గా తన మ్యారేజీ చేసుకుంది. ఇవాళ ఉదయం చెన్నైలోనే తన బాయ్ ఫ్రెండ్ రాజ్ వేల్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ ఏడడుగులు నడిచింది.
వీడియోలు వైరల్
ప్రియా భవానీ శంకర్ పెళ్లి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. నెటిజన్లు ఈ కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇరుముడి హీరోయిన్ పెళ్లి చేసుకుందంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో ప్రియా భవానీ శంకర్ పేరు ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది.
కాలేజీ ఫ్రెండ్
ప్రియా భవానీ శంకర్, రాజ్ వేల్ కు కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. వీళ్లు సుమారు పదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య లవ్ కొనసాగుతూ వచ్చింది. చివరకు మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటైంది.
ప్రియా భవానీ శంకర్ సినిమాలు
హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తమిళంలో చాలా సినిమాలే చేసింది. 2017లో వచ్చిన మేయాద మాన్ సినిమాతో ఆమె అరంగేట్రం చేసింది. తెలుగులో 2023లోనే అడుగుపెట్టింది. సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా టాలీవుడ్ లో ఆమె ఫస్ట్ మూవీ.
ఆ తర్వాత తెలుగులో భీమా, జీబ్రా సినిమాలు చేసింది. అనంతరం తమిళంలో బిజీ అయింది. తెలుగులో ఆమెకు గత సినిమాలు మంచి రిజల్ట్ ఇవ్వలేకపోయాయి.
ఇరుముడితో పాపులర్
తెలుగులో ఇరుముడి సినిమాతో సక్సెస్ అందుకోవడమే కాదు ఇక్కడ ప్రియా భవానీ శంకర్ పాపులర్ కూడా అయింది. ఇందులో హీరో భార్యగా ఆమె సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఎమోషనల్ సీన్లలో అయితే ఏడిపించేసింది.
పెళ్లి చేసుకున్న ప్రియా భవానీ శంకర్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. తమిళంలో ఆమె డీమాంటీ కాలనీ 2, మరగధ నానయం 2 తదితర సినిమాలు చేస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


