Sai Dharam Tej: మెగా ఇంట పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్ ఆ రోజే? ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్!

Sai Dharam Tej Wedding: సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నవంబర్ 5న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఆయన నిశ్చితార్థం జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సాయి తేజ్ పెళ్లి చేసుకోబోయేది ఎవరిని? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Published on: Nov 3, 2026, 10:47:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sai Dharam Tej Wedding: మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. అయితే చాలా కాలంగా ఆయన పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి సైతం కొన్ని సినిమా వేదికల మీద సాయి తేజ్‌కు త్వరగా పెళ్లి చేయాలని ఉందని సరదాగా కామెంట్స్ చేశారు.

మెగా ఇంట పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్ ఆ రోజే? ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్! (x/IamSaiDharamTej)
మెగా ఇంట పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్ ఆ రోజే? ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్! (x/IamSaiDharamTej)

పెళ్లి పీటలెక్కనున్న సాయి ధరమ్ తేజ్

ఎట్టకేలకు ఈ రూమర్లకు, మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులకు చెక్ పెడుతూ సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. తన పెళ్లి వార్తలపై గతంలోనే హింట్ ఇచ్చిన ఆయన, ఈ ఏడాదే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం.

చిన్ననాటి స్నేహితురాలితో నిశ్చితార్థం

తాజా సమాచారం ప్రకారం.. చాలా ఏళ్లుగా తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, సాయి ధరమ్ తేజ్ తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం నవంబర్ 5వ తేదీన హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరగనుంది.

కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో చాలా ప్రైవేట్‌గా ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న కిరణ్మయితో ఉన్న స్నేహ బంధాన్ని, ఇప్పుడు సాయి తేజ్ అధికారికంగా జీవితకాలపు బంధంగా మార్చుకోబోతున్నాడు.

డిసెంబర్ లో పెళ్లి

నిశ్చితార్థం పూర్తయిన వెంటనే పెళ్లి పనుల్లో మెగా ఫ్యామిలీ బిజీ కానుందట. ఎంగేజ్మెంట్ ఈ నెల 5న జరగనుండగా, పెళ్లిని వచ్చే డిసెంబర్ నెలలో ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. డిసెంబర్ 10వ తేదీన వీరి వివాహం ఉండొచ్చని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. పెళ్లి వేడుక అనంతరం టాలీవుడ్ ప్రముఖులు, స్నేహితులు, అభిమానుల కోసం హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

వరుస సినిమాలతో బిజీ బిజీ

కెరీర్ పరంగా సాయి దుర్గా తేజ్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న "సంబరాల ఏటి గట్టు" అనే భారీ పాన్ ఇండియా పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీలో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ ప్రాజెక్టుతో పాటే మరిన్ని ఆసక్తికరమైన కథలను సాయి తేజ్ లైన్‌లో పెడుతున్నాడు. ఏదేమైనా అతి త్వరలోనే ఈ సుప్రీమ్ హీరో పెళ్లి వార్తపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More